For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ గా వ్యాయామం చేయడానికి గల ముఖ్య కారణాలు

By Super
|

వ్యాయామం మన దినచర్యలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే మన శరీరంలో హెల్తీగా మరియు ఫిట్ గా ఉండాలంటే వ్యాయామం ఎంతో దోహదపడుతుంది. అయితే వ్యాయామం ఫిజికల్ గా మరియు మాససికంగా ఏవిధంగా సహాయపడుతుంది?

వ్యాయామం చేయడం చాలా ముఖ్యం మరియు అవసరం అని మనకు తెలుసు, అయితే బద్దకం వల్ల వ్యాయామాన్ని దాటవేస్తుంటాం . కొంత మంది వ్యాయామం అన్న పదాన్నే మర్చిపోయే బ్రతికేస్తుంటారు. మరికొందరకేమో రెగ్యులర్ గా వ్యాయామం చేయడానికి కొద్దిగా ప్రోత్సహం అవసరం అవుతుంది. అలాంటి వారిలో మీరు ఒకరైతే, మీకోసమే ఈ విలువైన సమాచారం.

రెగ్యులర్ గా వ్యాయామం చేయడానికి ప్రధాణ కారణం ఇది మీ మొత్తం ఆరోగ్యానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. వ్యాయామం అనేది వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పెద్ద అన్ని వయస్సుల వారు చేయవల్సినటువంటి ఒక ఆరోగ్యకరమైన అలవాటు. వ్యాయామం చేయడానికి బద్దకించడం లేదా ఆలస్యం చేయడం వల్ల జీవితంలో ఎన్నో కోల్పోవల్సి వస్తుంది. వ్యాయామం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవడం వల్ల ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వ్యాయామం చేయడం ప్రారంబించి మీ దిన చర్యలో ఒక అలవాటుగా మార్చుకోండి . ఫిజికల్ యాక్టివిటి స్త్రీ మరియు పురుషులు ఇద్దరికి చాలా ఉపయోగకరం.

వ్యాయామం చేయని వారికి కంటే వ్యాయామం చేసే వారు ఆరోగ్య పరంగా చాలా హెల్తీ గా ఉంటే అనారోగ్య సమస్యలుకు దూరంగా ఉంటూ మరికొంత ఆయుష్యును పెంచుకుంటారని కొన్ని పరిశొధనల ద్వారా పేర్కొనబడినది . కాబట్టి, రెగ్యులర్ గా వ్యాయమం ఎందుకు చేయాలన్న విషయం తెలుసుకోవడా చాలా అవసరం. శారీరక వ్యాయామం లేకపోవడం అనేది కార్డియో వ్యాస్కులర్ వ్యాధులకు ఒక కారణంగా గుర్తించవచ్చు.READ MORE: వ్యాయామం లేకుండా బరువు తగ్గించుకోవడానికి 9 తెలివైన మార్గాలు

వ్యాయామం చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పర్సనల్ డెవలప్ మెంట్ , మిమ్మల్ని నమ్మకంగా మార్చుతుంది, మీ ఆత్మగౌరవం మెరుగుపరుస్తుంది. మరి రెగ్యులర్ గా వ్యాయామం చేయడానికి గల కారణాలను తెలుసుకుందాం రండి...

శరీరం యాక్టివ్ గా ఉంటుంది

శరీరం యాక్టివ్ గా ఉంటుంది

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆకర్షణీయంగా మారుతుంది. కాబట్టి, ప్రతి రోజూ వ్యాయమం చేయడానికి కొంత సమయం వెచ్చించాలి.

ప్రత్యుత్పత్తిని పెంచుతుంది

ప్రత్యుత్పత్తిని పెంచుతుంది

ప్రత్యుత్పత్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వ్యాయంమ మిమ్మల్ని హెచ్చరికగా మరియు మరింత ఫోకస్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి, రెగ్యులర్ గా వ్యాయామం చేసి, హెల్తీ లైఫ్ ను పొందండి.

దీర్ఘాయువు మెరుగుపరుస్తుంది

దీర్ఘాయువు మెరుగుపరుస్తుంది

రోజువారీ వ్యాయామం చేయడానికి ఉత్తమ కారణం అది దీర్ఘాయువు మెరుగుపరుస్తుంది. భౌతికంగా ఎవరైతే చురుకుగా ఉంటారో వారు దీర్ఘకాలం జీవించడానికి సహాయపడుతుంది.

కండరాల శక్తి మెరుగుపరుస్తుంది

కండరాల శక్తి మెరుగుపరుస్తుంది

రెగ్యులర్ వ్యాయామం కండరాల శక్తి మరియు మజిల్ మాస్ ను మెరుగుపరుస్తుంది. కాబట్టి, ఈ రోజు నుండే వ్యాయామం ప్రారంభించండి.

జ్ఝాపక శక్తిని మెరుగుపరుస్తుంది

జ్ఝాపక శక్తిని మెరుగుపరుస్తుంది

వ్యాయామం బ్రెయిన్ సెల్స్ ను ఉత్తేజపరుస్తుంది, ఇది మెమెరీసని పెంచుతుంది మరియు నేర్చుకోవడంలో సహాయపడుతుంది.

యవ్వనంగా కనబడుతారు

యవ్వనంగా కనబడుతారు

వ్యాయామం ముడుతలు మరియు చర్మంలో గీతలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు వ్యాయామం చేస్తే, మీరు మీ చర్మంను తాజాగా, తేమగా ఉంచుకోవచ్చు. కాబట్టి, వ్యాయామం చేయడం మిస్ చేయకండి

ఒత్తిడి తగ్గిస్తుంది

ఒత్తిడి తగ్గిస్తుంది

మీరు రోజువారీ వ్యాయామం చేస్తుంటే, ఒత్తిడి విస్తృతంగా తగ్గించుకోవచ్చు. ఒత్తిడికి వివిధ కారకాలు మరియు బాధ్య కలిగి ఉన్నాయి. రోజువారీ వ్యాయామం చేసి ఒత్తిడికి దూరంగా ఉండాలి.

వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది

వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది

రెగ్యులర్ వ్యాయామం మొత్తం రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవచ్చు.

ఆకలి మెరుగుపరుస్తుంది

ఆకలి మెరుగుపరుస్తుంది

శారీరక వ్యాయామం ఆకలి మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వ్యాయామం మీరు ఆకలితో అనుభూతి చెందడానికి సహాయపడుతుంది.

మంచి జీర్ణ వ్యవస్థ కోసం

మంచి జీర్ణ వ్యవస్థ కోసం

ఎవరైతే మలబద్దకంతో బాధపడుతున్నారో, అలాంటి వారికి వ్యాయామం చాల గ్రేట్ గా సహాయపడుతుంది. వ్యాయామం ఒక ఉత్తమ ఔషధంగా పనిచేసి ప్రేగును ప్రక్షాళన చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ కు మంచిది

కొలెస్ట్రాల్ కు మంచిది

శారీరక వ్యాయామం బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది . చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు మరియు మంచి కొలెస్ట్రాల్ ను శరీరంలో పెంచుతుంది.

అధిక రక్తపోటు తగ్గుతుంది

అధిక రక్తపోటు తగ్గుతుంది

వ్యాయామం అధిక రక్తపోటును చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుందని నిరూపించబడ్డాయి. కాబట్టి, మీరు రెగ్యులర్ గా వ్యాయంమ చేయడం మర్చిపోకూడదు

మధుమేహం

మధుమేహం

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం 50-60 శాతం తగ్గుతుంది.

చర్మం మెరుస్తుంది

చర్మం మెరుస్తుంది

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా స్కిన్ టోన్ మరియు కలర్ మెరుగుపడుతుంది. కాబట్టి, వ్యాయామం చేయడం ఈ రోజు నుండి ప్రారంభించండి.

హార్ట్ స్ట్రాంగ్ గా మార్చుతుంది

హార్ట్ స్ట్రాంగ్ గా మార్చుతుంది

రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటి మీ హార్ట్ ను మరింత స్ట్రాంగ్ గా మార్చుతుంది . ఫిజికల్ యాక్టివిటి మరియు కార్డియో వ్యాస్కులర్ డెత్ రెండు నేరుగా సంబంధం కలిగి ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటి హార్ట్ పంప్ ను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత సమస్యలను క్రమంగా తగ్గిస్తుంది.

పొడవుగా పెరగడానికి

పొడవుగా పెరగడానికి

రెగ్యులర్ గా వ్యాయామం చేయడానికి మరో ముక్యమైన కారణం పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి, వ్యాయామం చేయడం ఈరోజే మొదలు పెట్టండి

క్యాలరీలు కరిగిస్తుంది

క్యాలరీలు కరిగిస్తుంది

శరీరంలో అదనంగా పేరుకున్న క్యాలరీలను ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది, దాని ద్వారా ఊబకాయం నుండి రక్షింపబడుతారు. కాబట్టి, వ్యాయామం చేయడం ఈరోజే మొదలు పెట్టండి.

క్యాన్సర్ నివారిస్తుంది

క్యాన్సర్ నివారిస్తుంది

లోరిస్క్ క్యాన్సర్ కు మరియు ఫిజిలక్ యాక్టివిటికి సంబంధం కలిగి ఉంటుంది ముఖ్యంగా కోలన్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాధంను నివారిస్తుంది .

ఎముకలను బలోపేతం చేస్తుంది

ఎముకలను బలోపేతం చేస్తుంది

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఎముకలను చాలా ఎఫెక్టివ్ గా స్ట్రాంగ్ గా మార్చుతుంది.

బ్యాక్ పెయిన్

బ్యాక్ పెయిన్

ఎవరైతే బ్యాక్ పెయిన్ తో బాధపడుతుంటారో , వారు రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా బ్యాక్ పెయిన్ నివారించుకోవచ్చు.

స్ట్రోక్ నివారిస్తుంది

స్ట్రోక్ నివారిస్తుంది

ఎవరైతే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటారో వారిలో స్ట్రోక్ ప్రమాదం 40శాతం తగ్గిస్తుంది .

మంచి నిద్రకు

మంచి నిద్రకు

నిద్రలేమితో బాధపడుతున్నట్లైతే అలాంటి వారికి రెగ్యులర్ వ్యాయం వల్ల మంచి నిద్రపొందవచ్చు.

సెక్స్ లైఫ్ ను మెరుగుపరుస్తుంది

సెక్స్ లైఫ్ ను మెరుగుపరుస్తుంది

రెగ్యులర్ వ్యాయామం ద్వారా సెక్స్ లైఫ్ ను మెరుగుపరుస్తుంది . ఎవరైతే రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుంటారో వారిలో శీఘ్రస్కలన లోపాలను నివారిస్తుంది .

మోనో పాజ్

మోనో పాజ్

రెగ్యులర్ వ్యామం వల్ల బుతుక్రమం పరివర్తన సంబంధించిన ప్రతి కూల మార్పులను తగ్గిస్తుంది. తద్వారా మోనోపాజ్ సమస్యలను ఎదుర్కోవచ్చు.

Desktop Bottom Promotion