For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ కంటిచూపు దినోత్సవం స్పెషల్.. దృష్టిని పెంచే పవర్ ఫుల్ ఫుడ్స్

By Nutheti
|

సర్వేంద్రియానాం.. నయనం ప్రదానం అన్నారు. కానీ మారుతున్న జీవన శైలి.. నయనాలకు ముప్పుగా మారింది. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టీవీలు.. ఇవి లేకుండా పూటగడవడం లేదు నేటి జనరేషన్ కు. నిద్రలేచిన దగ్గరనుంచి ఏ పని చేయాలన్నా.. వీటన్నింటితో ముడిపడి ఉన్నాయి. దీంతో కంటిపైన ఒత్తిడి పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. స్కూల్ కెళ్లే కుర్రాడి నుంచి ప్రతి ఒక్కరిని కంటిచూపు సమస్యలు వేధిస్తున్నాయి.

కంటిచూపును మెరుగుపరుచుకోవడానికి.. అంధత్వాన్ని రూపుమాపడానికి అవగాహన కల్పిస్తూ.. అక్టోబర్ 9ని ప్రపంచ కంటి చూపు దినోత్సవంగా జరుపుకుంటాం. తీసుకునే ఆహారంలో లోపాల కారణంగా.. సైట్ అందరినీ వేధిస్తున్న సమస్య. పోషకాహార లోపం ఒకటైతే.. వంశపారంపర్యంగా సైట్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి కంటికి అందాల్సిన పోషకాలు, విటమిన్ ఏ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల చూపు సమస్యలను కొంతవరకైనా తగ్గించుకోవచ్చు.. కంటి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారాలేంటో చూద్దాం..

క్యారెట్

క్యారెట్

కంటి ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంది. కంటి ఆరోగ్యానికి క్యారెట్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో బీటా కెరోటిన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిలోని రెటీనా పనితీరు సక్రమంగా ఉండేలా చూస్తాయి.

పాలకూర

పాలకూర

పాలకూర కంటిచూపు పెరుగుదలకు సహకరిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు వయసుతో పాటు వచ్చే కంటిచూపు సమస్యలను తగ్గిస్తాయి.

నట్స్

నట్స్

బాదాం, వాల్ నట్ వంటి వాటిలో విటమిన్ ఇ, జింక్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల.. సైట్ ప్రాబ్లమ్స్ కి దూరంగా ఉండవచ్చు.

అవకాడో

అవకాడో

కంటిచూపు మందగించకుండా ఉండటానికి అవకాడో తోడ్పడుతుంది.

చేపలు

చేపలు

కంటి చూపు మెరుగుపరచడానికి చేపలు సరైన ఆహారం. ట్యూనా, సాల్మన్, సార్డీన్స్ చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తరచుగా వీటిని తీసుకోవడం మంచిది.

కోడిగుడ్డు

కోడిగుడ్డు

కోడిగుడ్డులోని తెల్లసొనలో ఉండే పోషక విలువలు కంటి ఆరోగ్యానికి రక్షణగా ఉంటాయి. కాబట్టి రోజు ఒక కోడిగుడ్డుని ఆహారంలో చేర్చుకోవాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి

కంటిపొరకు రక్షణగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లను శరీరంలో విడుదల చేయడానికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

English summary

7 Super Foods That Boost Your Eyesight: health tips in telugu

October 9th is observed as World Sight Day and it is necessary to spread awareness about improving eyesight and eliminating blindness. Poor eyesight is a common problem faced by every other person these days. Macular degeneration is the main reason for poor vision. Some other factors include heredity, ageing and malnutrition.
Story first published: Thursday, October 8, 2015, 10:06 [IST]
Desktop Bottom Promotion