For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజంగా రక్తపోటును తగ్గించడానికి 7 యోగ ఆసనాలు

|

హైపర్ టెన్షన్ మానవ శరీర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి హైపర్ టెన్షన్ ను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. హార్ట్ స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ ను ప్రమాధాన్ని తగ్గించుకోవాలంటే, మనం తీసుకొనే రెగ్యులర్ డైట్ లో హైపర్ టెన్షన్ తగ్గించే ఆహారాలను చేర్చుకోవాలి.

READ MORE: హైబ్లడ్ ప్రెజర్, హైపర్ టెన్షన్ తగ్గించే ఎఫెక్టివ్ రెమెడీస్

హైపర్ టెన్షన్ మరియు హైబ్లడ్ ప్రెజర్ కొన్ని తీవ్రమైన పరిస్థితుల కారణం వల్ల ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం సేవించడం, వ్యాయామం చేయకపోవడం, బర్త్ కంట్రోల్ పిల్స్, పెయిన్ కిల్లర్స్, కిడ్నీ సమస్యలు మరియు అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ మరియు హైబ్లడ్ ప్రెజర్ కు గురికావల్సి ఉంటుంది. ఇంకా హైపర్ టెన్షన్ వల్ల, కిడ్నీ, మెమరీ పవర్ మరియు సెక్స్ డ్రైవ్ మీద తీవ్రప్రభావం చూపుతుంది.

READ MORE: హైపర్ టెన్షన్ తగ్గించుకోవడానికి 12 పవర్ ఫుల్ ఫుడ్స్

ఆధునిక యుగంలో అధిక రక్తపోటు అనేది నిశ్శబ్ద కిల్లర్స్ లలో ఒకటిగా మారింది. కాబట్టి మీకు అధిక రక్తపోటు ఉంటే, దానికి చెక్ పెట్టటానికి యోగ ఆసనాలను ప్రయత్నించండి.

పశ్చిమోత్తాసన:

పశ్చిమోత్తాసన:

రక్తపోటుతో బాధ పడుతున్న వారిలో ధమనులు అణచివేయబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది క్రమంగా గుండెపోటు మరియు స్ట్రోక్ కు దారితీస్తుంది. దీనికి మంచి పరిష్కారంగా పశ్చిమోత్తాసనం ఉంది. ఇది మీ ధమనులను సౌకర్యవంతముగా ఉంచుట ద్వారా సహజంగానే రక్తపోటును తగ్గిస్తుంది.

శవాసన:

శవాసన:

రిలాక్సేషన్ కోసం శవాసనం చాలా బాగా పనిచేస్తుంది. శవం పోజ్ రక్తపోటు తక్కువగా ఉంచటానికి అద్భుతంగా ఉంటుంది. కండరాల ఉద్రిక్తత నుంచి ఉపశమనం మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.

బాలాసన:

బాలాసన:

రక్తపోటు కారణంగా తరచుగా ఆందోళన మరియు కోపం వస్తూ ఉంటాయి. బాలాసన లేదా పిల్లల యొక్క భంగిమలో ఆందోళన అనవసరమైన అయోమయం తగ్గి మీ మనస్సు ప్రశాంతతకు సహాయపడుతుంది. ఇది కూడా ఒత్తిడి ఉపశమనానికి సహాయపడుతుంది. అలాగే టాక్సిన్స్ ని బయటకు పంపుతుంది.

 ప్రాణాయం:

ప్రాణాయం:

యోగ సాధనలో ప్రాణాయామం అనేది మెదడు ప్రశాంతతకు ఒక గొప్ప మార్గం. అనులోమ,విలోమ ప్రాణాయామం ఆందోళన హాని మరియు మీ గుండె రేటును కిందకి తగ్గిస్తుంది. రక్తపోటు తగ్గించడం మరియు రోగనిరోధక వ్యవస్థ మరియు ఎండోక్రైన్ వ్యవస్థలను తటస్థికరిస్తుంది.

అధోముఖ ఆసనం

అధోముఖ ఆసనం

అధోముఖ ఆసనం లేదా అధో ముఖంలో ఉండే కుక్క భంగిమ ఒక గొప్ప భంగిమగా ఉంటుంది. మీ భుజాలు మరియు మీ మొత్తం వెనక బాగం ఉద్రిక్తత మరియు ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

సేతుబంధఆసనం

సేతుబంధఆసనం

సేతుబంధఆసనం లేదా వంతెన భంగిమలో ఉండి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి మరియు ఉద్రిక్తతను తగ్గిస్తూ చురుకుదనంను పెంచుతుంది.

సుఖాసన

సుఖాసన

సుఖాసన వంటి కూర్చునే భంగిమలు మీ గుండె మీద ఒత్తిడిని తగ్గించి రక్తపోటు చికిత్సలో సహాయపడుతుంది. ఈ ఆసనం మీ మనస్సు ఉధృతి మరియు శరీరం విశ్రాంతికి గొప్పగా ఉంటుంది.

English summary

7 yoga asanas to reduce hypertension naturally!: Health Tips in Telugu

7 yoga asanas to reduce hypertension naturally!: Health Tips in Telugu. Hypertension also referred to as high blood pressure has become one of the silent killers of the modern era. So, if your blood pressure is on the higher side, try out these yoga poses to keep it in check.
Desktop Bottom Promotion