For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న చిన్న అలవాట్లే ఆరోగ్యానికి గొప్ప వరాలు

|

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకూ పనికిరాడు. ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనాబ్రతికేయగలడు. మనిషికే కాదు, ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆహ్లాదం.. నిజమైన సంతోషం ఎంతో విలువైనది. మనిషి జీవితంలో ప్రశాంతత ఉన్నప్పుడు ఆనందం, సంతోషమనేది సాధ్యమవుతుంది. మనిషికి సంతోషమనేది పెద్ద ఆస్తి. అంతకుమించిన ఆస్తి ప్రస్తుత సమాజంలో దొరకదు.

చూడ్డానికి చిన్నవే కావొచ్చు. కానీ కొన్ని కొన్ని అలవాట్లు పెద్ద ప్రభావాన్నే చూపుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఏమాత్రం చిన్నచూపు చూడాల్సిన పనిలేదు. వీటిని రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాంటి చిన్న అలవాట్లు కొన్నింటిని పరిశీలిద్దాం.

మెట్లు ఎక్కటం:

మెట్లు ఎక్కటం:

ఇంట్లో గానీ ఆఫీసులో గానీ మెట్లు ఉంటే ‘ఆ.. ఏం ఎక్కుతాం లే' అని అనుకోకుండా కాస్త కాళ్లకు పని చెప్పండి. ఒక్కరోజుతోనే ఆగకుండా దాన్నొక అలవాటుగా మార్చుకోండి. క్రమంగా మెట్లను ఎక్కే, దిగే సంఖ్యనూ పెంచుకోండి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మరో గ్లాసు నీరు:

మరో గ్లాసు నీరు:

చాలామంది దాహం వేసినప్పుడే నీరు తాగుతుంటారు. కానీ మనకు దాహం వేయటానికన్నా ముందే ఒంట్లో నీటిశాతం పడిపోతుంది. కాబట్టి తరచుగా నీరు తాగటం మంచిది. తగినంత నీరు తాగటం వల్ల శరీర ఉష్ణోగ్రత సరిగా ఉంటుంది. కీళ్ల కదలికలు సాఫీగా సాగుతాయి. వెన్నుపాము, ఇతర సున్నితమైన కండరాలకు రక్షణ లభిస్తుంది. మూత్రం, చెమట, మల విసర్జన రూపంలో వ్యర్థాలు తేలికగా బయటకు వెళ్లిపోతాయి.

నిటారుగా కూచోవటం:

నిటారుగా కూచోవటం:

వెన్ను ముందుకు వంగిపోకుండా నిటారుగా కూచుంటే నొప్పుల బారిన పడకుండా చూసుకోవచ్చు. అలాగే నడుస్తున్నప్పుడూ భుజాలు వెనక్కి, తల పైకెత్తి ఉండేలా చూసుకున్నా ఆత్మవిశ్వాసం, ఉత్సాహం సొంతమవుతాయి.

కాస్త పెందరాళే పడక:

కాస్త పెందరాళే పడక:

రాత్రిపూట గాఢంగా ఏడెనిమిది గంటలు పడుకోవటం గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉందనటానికి సూచిక. గాఢ నిద్ర మూలంగా శరీరం కొత్త శక్తిని పుంజుకోవటమే కాదు.. ఆహార అలవాట్లు గాడి తప్పకుండానూ ఉంటాయి. నిద్రలేమితో ఆకలిని తగ్గించే హార్మోన్ల ఉత్పత్తి పడిపోతుంది. ఇది ఎక్కువ ఆహారాన్ని తినటానికి, బరువు పెరగటానికి దోహదం చేస్తుంది.

ఒంటికాలి మీద నిలబడటం:

ఒంటికాలి మీద నిలబడటం:

పది సెకండ్ల పాటు ఒక కాలు మీద నిలబడి, తర్వాత మరో కాలు మీద నిలబడటం చాలా తేలికైన వ్యాయామం. దీన్ని పళ్లు తోముకుంటున్నప్పుడు, బస్సు కోసం, టికెట్ల కోసం వరుసలో నిలబడినప్పుడు కూడా చేయొచ్చు. ఇది రోజువారీ పనులకు అవసరమైన శరీర నియంత్రణ, కదలికల వంటివి మెరుగుపడేలా చేస్తుంది.

 వారం వారం బరువు తూచుకోవటం:

వారం వారం బరువు తూచుకోవటం:

బరువు తగ్గటానికి గానీ దాన్ని నియంత్రించుకోవటానికి గానీ ప్రతీ వారానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. దాన్ని కాగితం మీద రాసుకొని ఎంతమేరకు దాన్ని చేరుకున్నారో చూసుకోండి. ప్రతీ వారం ఒకే రోజున, ఒకే సమయాన, ఒకే రకం దుస్తులను ధరించి తూచుకుంటే తగ్గిన బరువు కచ్చితంగా తెలుస్తుంది.

మంచి అల్పాహారం:

మంచి అల్పాహారం:

ఉదయాన్నే ప్రోటీన్‌తో కూడిన పీచు అధికంగా గల అల్పాహారాన్ని తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండానూ అలసిపోకుండా పనులు చేసుకోవటానికీ తోడ్పడుతుంది.

 కేలరీల మోతాదుపై కన్ను:

కేలరీల మోతాదుపై కన్ను:

కేలరీల మోతాదులు అధికంగా గల పదార్థాలు బరువు పెరగటానికి దారితీస్తాయి. కాబట్టి తక్కువ కేలరీల ఆహారం మీద దృష్టి పెట్టండి. వెన్నతీసిన పాల పదార్థాలు, పొట్టు తీయని ధాన్యాలు తినటం అలవాటు చేసుకోవాలి. కొవ్వు ఎక్కువగా లేదా కృత్రిమ తీపి పదార్థాలకు బదులుగా తాజా పండ్లు తినటం మేలు.

English summary

8 Healthy Habits For A Longer Life: Health Tips in Telugu

Living a long and healthy life wherein life's numerous pleasures are relished to their fullest is everyone's dream, isn't it? With increasing levels of pollution and dramatic lifestyle changes, the prospect of living a long life, longer than it was originally meant to be, is a far cry.
Story first published: Saturday, October 10, 2015, 17:33 [IST]
Desktop Bottom Promotion