For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్యాలయంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లను

By Super
|

మీరు రోజుకు దాదాపు 6 నుండి 8 గంటలు కార్యాలయంలోనే గడుపుతారు. కానీ చాలామంది ఇక్కడ ఒక నిజాన్ని తెలుసుకోవాలి, ఈ కార్యాలయం నిశ్చల జీవనశైలిలో చెడు ఆహారాన్ని తీసుకునే ఒక కేంద్రం లాంటిది.

ఈ కార్యాలయంలో ఆరోగ్యపు అలవాట్లతో ఈ అనారోగ్య కార్యాలయ ఆహారాన్ని ఎలా వదిలివేయాలి అని న్యూ ఢిల్లీ ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ పోషకాహార నిపుణురాలు మిస్.దివ్య చౌదరి నుండి తెలుసుకుందాం.

ఆకలిగా ఉన్నపుడు అల్పాహారం తినాలి. మీరు జాగ్రత్తగా ఉండక పోతే మీ ఆఫీసు జీవితం మీ ఆహార నిర్ణయాలను చెడగొడుతుంది. మనం కావలసినంత అల్పాహారం తీసుకోకపోవడం వల్ల పనిచేసే సమయంలో ఎక్కువగా తినడం అనేది అత్యంత సాధారణ కారణాలలో ఒకటి. అల్పాహారం మానేయడం అనేది అవ్యవస్దిత జీవనశైలికి దారితీస్తుంది. ఇది రోజువారీ ఆహారంలో అతి ముఖ్యమైనది, దానిని నిర్లక్ష్యం చెయకూడదు. భోజనం విషయానికి వస్తే, ఆకలితో ఎదైనాసరే, ఎంతైనాసరే తినడానికి సిద్ధమౌతము.

Adopt these healthy office habits

కొన్ని ఆరోగ్యకర అల్పాహార సూచనలను చూద్దాం.
మీ కాఫీ మెషీన్ తో స్నేహంగా ఉండండి. కెఫీన్ మీ గుండెను, శ్వాసకోశ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కానీ ఎక్కువ స్నేహంగా ఉండకండి. రోజుకు కేవలం రెండు కప్పుల కాఫీ మాత్రమే తాగండి. మీరు ఎప్పుడు కాఫీ తాగినా, రెండు నిండు గ్లాసుల నీరు త్రాగండి, అప్పుడు మీరు తీసుకున్న కెఫీన్ మీ వ్యవస్థను తిరిగి నింపడానికి సిద్ధంగా ఉంచడానికి సహాయపడుతుంది.

ఒక మోస్తరు గోరువెచ్చని నీటితో సాధారణ నీటిని తీసుకుని భార్తీచేయడానికి ప్రయత్నించండి. గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి, అవి:

-మన వ్యవస్థ నుండి టాగ్జిన్లు బైటికి పంపబడినపుడు, నొప్పులు, తలనొప్పి కి దారితీయవచ్చు.

-జీర్ణసంబంధమైన, పెద్దప్రేగుకు సంబంధించిన వ్యాధులు ఉన్నపుడు, గోరు వెచ్చని నీరు జీర్ణకోశ వ్యవస్థపై అద్భుతంగా పనిచేస్తాయి.

-గోరువెచ్చని నీరు చర్మాన్ని ఆర్ద్రీకరణతో ఉంచుతుంది. తగినంత నీరు త్రాగడం వల్ల తమర, సోరియాసిస్, పొడి చర్మం, ముడతలు వంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.

Adopt these healthy office habits

ఇంటినుండి ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకువెళ్ళండి. అవకాశం ఉంటే, ఎవరైనా ఎప్పుడూ ఇంటి ఆహారాన్నే తీసుకువెళ్ళండి దీనివల్ల ఎంతో పరిశుభ్రంగా, అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. కాంటీన్ లేదా రెస్టారెంట్ ఆహారాన్ని తరచుగా తింటుంటే, ఫాస్ట్ ఫుట్ పద్ధతిలో వండే ఆహారంలో పోషక విలువలు నశిస్తాయి కాబట్టి కావలసిన పౌష్టికాలు దొరక్క మనకు అనేక సమస్యలు ఎదురౌతాయి.

మీరు ఒకే గదిలో కూర్చునే ఉండాలి అంటే, కనీసం అది ఆరోగ్యకరంగా ఉండేట్లు చూసుకోండి. సమయానికి భోజనం చేయండి, ప్రత్యేకంగా ప్రశాంతమైన వాతావరణానికి ప్రాధాన్యతను ఇవ్వండి. రోజు మొత్తంలో నీరు ఎక్కువగా తాగండి. ఎప్పుడూ పళ్ళను దగ్గరపెట్టుకోండి (మీరు బరువు పెరగకుండా ఉండడానికి అద్భుతమైన స్నాక్). వేయించన చన, బిస్కేట్లకు బదులుగా 100% అన్నిరకాల పిండ్లతో కూడిన క్రాకర్లు వంటి ఇతర స్నాక్స్ ను చూడండి. వాటిని మీ డెస్క్ డ్రాయర్ లో ఉంచండి. మీరు ఉప్పులేని బాదాము, వాల్ నట్స్ లేదా తీపిలేని అంజీర వంటివి కూడా తినండి.

ఆఫీసులో ఆరోగ్యకరమైనవి తినడానికి చిట్కా: మీ ఆఫీస్ బాక్స్ లేదా బాగ్ లో పెరుగు, కొవ్వు తక్కువ చీస్, కొవ్వు తక్కువ స్త్రింగ్ చీజ్, మీకు ఇష్టమైన పళ్ళు, హమ్ములు, పచ్చి కూరగాయలు వంటి ఆరోగ్యకర స్నాక్స్, ఆహార పదార్ధాలను ఆఫీసులోని రెఫ్రిజిరేటర్ లో ఉంచుకోండి. దానిని సీల్ చేసి మీ పేరుతో గుర్తుపెట్టుకోవడం మర్చిపోకండి. దీనివల్ల ప్రతి గంటకు మీరు కుర్చీని వదిలి వెళ్ళే గొప్ప అవసరం ఉంటుంది, పని సమయంలో మీకు అవసరమైన ఆరోగ్యకర ఆహరం మీకు అందుబాటులో కూడా ఉంటుంది. అవును, ఎక్కువగా తినొద్దు, స్నేహితులు పుట్టినరోజులకు, బేబీ షవర్లు, క్లైంట్స్ నుండి అధిక కాలరీల బహుమతులను తీసుకోవద్దు. మీ పరిధులను గౌరవించండి!

English summary

Adopt these healthy office habits

You spend approximately 6 to 8 waking hours in your office. But are you aware of the fact that for most of us, the office is a hub of bad diet decisions accompanied with a sedentary lifestyle.
 
Story first published: Tuesday, February 24, 2015, 18:26 [IST]
Desktop Bottom Promotion