For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ సమ్మర్లో హాట్ టీ హెల్త్ కు మంచిదేనా...?

|

మన ఇండియన్స్ సీజన్ తో సంబంధం లేకుండా వేడి వేడి టీ మరియు కాఫీలను త్రాగుతుంటారు. అది ఒక అలవాటుగా...ఉదయం నిద్రలేవగానే టీ త్రాగిన తర్వాత మిగిలిన దినచర్య ప్రారంభమౌతుంది. అయితే వర్షకాలంలో టీ లేడా కాఫీని త్రాగినప్పుడు ఆ మజాయే వేరుగా ఉంటుంది. మరి వేసి కాలంలో కూడా మన ఇండియన్ వేడి వేడి త్రాగుతుంటారు. మరి ఇది వేసవిలో ఆరోగ్యకరమేనా?ఒక రకంగా ఆరోగ్యకరమే అని చెప్పాలి ఎందుకంటే టీ శరీరాన్ని చల్లబరుస్తుంది.

టీలో వివిధ రకాల టీలు గ్రీన్ టీ, బ్లాక్ టీ, హేర్బల్ టీ మరియు ఇతర రకాల టీలు కూడా ఉన్నాయి. ఈ టీలన్నింటిలోనూ అనేక ఆరోగ్యప్రయోజనాలున్న విషయం మనకు తెలిసిందే...

వేసవి సీజన్ లో అల్లం టీ మీరు తీసుకొన్నట్లైతే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వేసవి సీజన్ లో ఎండవేడికి మీరు భయపడుతున్నట్లైతే, అటువంటి భయాలేమి పెట్టుకోకుండా నిరభ్యంతరంగా మీకు నచ్చిన టీని మీరు త్రాగవచ్చు.

రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల ప్రకారం వేసవి సీజన్ లో వేడి వేడి టీ త్రాగడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నిర్ధారించారు . మరియు ఇలాంటి వేడి వాతావరణంలో టీ శరీర ఉష్ణోగ్రతను చల్లబరచడం మాత్రమే కాదు ఇది అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది.

గుర్తించుకోవల్సిన విషయం: టీలో కానీ, కాఫీలో కానీ, కెఫిన్ అధికంగా ఉంటుంది కాబట్టి, మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి అన్ని రకాల శ్రేయస్కరం.

మరి సమ్మర్లో వేడి టీ త్రాగడం వల్ల ప్రయోజనాలేంటో చూద్దాం...

1. శరీరాన్ని కూల్ చేస్తుంది:

1. శరీరాన్ని కూల్ చేస్తుంది:

వేసవిలో, వేడి వాతావరణంలో కూడా టీ త్రాగితే ఆరోగ్యానికి ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. శరీరాన్ని చల్లబరుస్తుంది .

2. హాట్ టీ vs ఐస్ టీ:

2. హాట్ టీ vs ఐస్ టీ:

యూకెలో జరిపిన పరిశోధనల ప్రకారం ఐస్ టీ శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అదేవిధంగా హాట్ టీ శరీరం యొక్క ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గించి శరీరంను పూర్తిగా చల్లబరుస్తుంది.

3. ఎలా చల్లబరుస్తుంది:

3. ఎలా చల్లబరుస్తుంది:

కొన్ని పరిశోధనల ప్రకారం టీలో ఉండే కెఫిన్ శరీరాన్ని చల్లబరుతుంది. మొత్తం జీవక్రియలను క్రమబద్దం చేసి, చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది.

4.ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్:

4.ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్:

ఒక కప్పు టీ మీ శరీరాన్ని నేచురల్ కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. అంతర్గతంగా శరీరాన్ని చల్లబరచడానికి లాజికల్ రీజన్ బయట వేడికి శరీరం వేడుకుతున్నప్పుడు టీ వల్ల శరీరంలోని అవయవాలు చల్లబడటం ప్రారంభమవుతుంది. దీన్నే కూలింగ్ సిస్టమ్ అంటారు.

5. దప్పిక:

5. దప్పిక:

ఒకకప్పు టీ త్రాగిన తర్వాత దప్పకి అనేది ఉండదని కొంత మంది చెబుతుంటారు. మరికొంత మంది టీ త్రాగిన తర్వాత దప్పిక ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అంతే కాదు, డీహైడ్రేషన్ తగ్గిస్తుంది.

6. సాలివ:

6. సాలివ:

టీ ఒక సీక్రెట్ సాలివ. ఇది నోట్లో ఎక్కువ లాలాజలం ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. పెక్టిన్, అమినో యాసిడ్స్, మరియు షుగర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇలా జరగుతుంది . అందువల్లే నోరు హైడ్రేషన్లో ఉంటుంది.

English summary

Benefits Of Hot Tea In Summer

Many recent studies have proved that drinking hot tea during summer is not dangerous when done in moderation. On the other hand, they claim that tea can cool down the system in hot climates apart from offering several health benefits.
Story first published: Monday, May 25, 2015, 16:42 [IST]
Desktop Bottom Promotion