For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరెంజ్ తొక్కలోనే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

By Super
|

నారింజ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్‌ అంటారు. చక్కగా తినేసి జీర్ణం చేసుకోగల ఫలం కమలాఫలం. ఆరెంజ్ రంగులు చూడగానే తినేయాలని... జ్యూస్ తాగేయాలని అనిపించే పండు కమలాపండు. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు కలదు.

నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవు. ఆరెంజ్ పండులోనే కాదు, ఆరెంజ్ తొక్కలో కూడా అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం...

యాంటీ కొలెస్ట్రాల్

యాంటీ కొలెస్ట్రాల్

ఆరెంజ్ లో ఉండే యాంటీ కొలెస్ట్రాల్ లక్షణాలున్నాయి. ఇవి శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా ఎల్ డిఎల్ లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నివారిస్తాయి. అందువల్ల ఆరెంజ్ పీల్ డైట్ వల్ల కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గించుకోవచ్చు.

క్యాన్సర్ ను నివారిస్తాయి:

క్యాన్సర్ ను నివారిస్తాయి:

రక్తకణాలు ఆక్సిజన్ తీసుకోవడంతో పాటు, రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరెంజ్ తొక్కలో ఉండే క్యాన్సర్ సెల్స్ ఏర్పకుండా నివారిస్తాయి

హార్ట్ బర్న్ :

హార్ట్ బర్న్ :

దీర్ఘకాలిక హార్ట్ బర్న్ సమస్యను నివారిస్తుంది . గుండెలో మంటకు ఆరెంజ్ తొక్క నేచురల్ గా తగ్గిస్తుంది! ఆరెంజ్ తొక్కలో ఉండే కెమికల్స్ హార్ట్ బర్న్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి .

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు

ఆరెంజ్ తొక్కలో ఎక్కువగా డైటరీ ఫ్రైబర్ ఉంటుంది. 100గ్రాముల ఆరెంజ్ తొక్కలో 10.6గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది .ఇర్రిసెస్టిబుల్ బౌల్ సిండ్రోమ్ ను నివారించడంలో ఆరెంజ్ తొక్క చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఆరెంజ్ పీల్ ను టీ తయారుచేసి తీసుకోవచ్చు.

శ్వాససంబంధిత సమస్యలు:

శ్వాససంబంధిత సమస్యలు:

ఆరెంజ్ తొక్కలో విటమిన్ సి పుష్యలంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఆరెంజ్ తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వివిధ రకాల శ్వాససంబంధిత (జలుబు, దగ్గు, ఫ్లూ, ఆస్తమా, మరియు లంగ్ క్యాన్సర్ )సమస్యలను నివారిస్తుంది.

అజీర్ణం:

అజీర్ణం:

ఆరెంజ్ తొక్కలో నేచురల్ హీలింగ్ ప్రొపర్టీస్ ఉన్నట్లు గతంలోనే కనుక్కొన్నారు . ఆరెంజ్ తొక్క నుండి తయారుచేసే ఎక్స్ ట్రాక్ట్ లో వివిధ రకాల ఔషధ విలువలున్నట్లు దీన్ని అజీర్ణంకు ఉపయోగిస్తున్నట్లు నిర్ధారించాయి . ఇందులో ఉండే డైటరీ ఫైబర్ బౌల్ మూమెంట్ ను క్రమబద్దం చేస్తుంది. దాంతో జీర్ణవాహిక ఆరోగ్యంగా ఉంటుంది.

ఆరెంజ్ పీల్ లోని ఇతర ప్రయోజనాలు

ఆరెంజ్ పీల్ లోని ఇతర ప్రయోజనాలు

ఆరెంజ్ తొక్కలో కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, ఇందులో వివిధ రకాలో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆరెంజ్ సెంట్స్ పెర్ఫ్యూమ్స్ లో కూడా ఆరెంజ్ తొక్కను విరివిగా ఉపయోగిస్తున్నారు

ఆరెంజ్ తొక్కలోని కొన్ని సృజనాత్మక ప్రయోజనాలు కనుగొన్నారు. అవి ఏవిధంగా పనిచేస్తాయో చూద్దాం...

ఎయిర్ ఫ్రెషనర్:

ఎయిర్ ఫ్రెషనర్:

ఆరెంజ్ తొక్కను రూమ్ యొక్క ఎయిర్ ఫ్రెషనర్ గా ఉపయోగింస్తున్నారు. ఇంట్లో చెడు వాసన రాకుండా నివారించడంలో రూమ్ హెయిర్ ఫ్రెషనర్స్ లో ఆరెంజ్ తొక్కను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. మీకు నచ్చిన ఆరోమాటిక్ పదార్థాలు అంటే గందం, లేక దాల్చిన చెక్క తీసుకొని, పోర్టిపోరి తయారుచేసుకవోవాలి. ఈ మూడింటి కాంబినేషన్ వంద శాతం ఎకో ఫ్రెండ్లీ మరియు చాలా చౌకైనది!

దంతాలను తెల్లగా మార్చుతుంది:

దంతాలను తెల్లగా మార్చుతుంది:

ఇది చాలా చౌకైనది పసుపు రంగు దంతాలను నివారించడంలో ఆరెంజ్ తొక్కను గ్రేట్ గా ఉపయోగించుకోవచ్చు . దీన్ని మీరు పేస్ట్ లా తయారుచేసుకోవచ్చు లేదా దంతాలకు నేరుగా అప్లై చేసి రుద్దుకోవాలి . చాలా మంది, ఇది సున్నితమైన దంతాలను బ్రైట్ గా మార్చుతుందని నమ్ముతారు. నిజానికి ఇది దంతాల సున్నితత్వాన్ని నివారిస్తుంది. దంతాలను స్ట్రాంగ్ గా మార్చుతుంది. !

క్లీనింగ్ ఏజెంట్:

క్లీనింగ్ ఏజెంట్:

బాగా మురికి పడ్డ షింక్ ను శుభ్రం చేయడానికి ఆరెంజ్ తొక్క గ్రేట్ గా సహాయపడుతుంది. ఆరెంజ్ నూనె ఒక నేచురల్ క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అక్కడ ఉండే మురికిని తొలగిస్తుంది. ఆప్రదేశంలో మంచి వాసన కలిగి ఉంటుంది.

కంపోస్ట్ :

కంపోస్ట్ :

ఆరెంజ్ తొక్క ఒక గ్రేట్ కంపోస్ట్ మెటీరియల్. ఎందుకంటే ఇందులో నైట్రోజెన్ పుష్కలంగా ఉంటుంది. ఆరెంజ్ తొక్కలో న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి . వీటిని మొక్కలకు ఎరువుగా వేయడం మంచిది. అయితే ఎక్కువగా వేయకూడదు . ఎందుకంటే మొక్కలకు హైలెవల్ నైట్రోజెన్ వ్యతిరేఖ ప్రభావాలను చూపుతుంది. దాంతో ఆకులు ముడుచుకుపోతాయి.

మొటిమలను నివారించి చర్మం తెల్లగా మార్చుతుంది

మొటిమలను నివారించి చర్మం తెల్లగా మార్చుతుంది

యుక్తవయస్సులో ఆడపిల్లల ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో కమలా రసం బాగా ఉపయోగకారి. విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. నారింజ తొక్కను పడేయకుండా... ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే... చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

వంటల్లో :

వంటల్లో :

ఆరెంజ్ తొక్క వంటల్లో చాలా గ్రేట్ ఫ్లేవర్ మరియు ట్యాంగీ టేస్ట్ పొందడానికి గార్నిషింగ్ గా ఉపయోగిస్తున్నారు. ఆరెంజ్ తొక్క నుండి ఎక్కువ న్యూట్రీషినల్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి

క్రిమి కీటకాలను నివారిస్తుంది:

క్రిమి కీటకాలను నివారిస్తుంది:

ఆరెంజెస్ లో నేచురల్ యాసిడ్స్ కలిగి ఉంటాయి, ఇవి దోమలు, ఈగలు మరియు ఇతర కీటకాలు రాకుండా రక్షణ కల్పిస్తాయి? అందుకు మీరు ఆరెంజ్ తొక్కను బాగా నీటిలో ఉడికించి తర్వాత నీటిని స్ప్రే బాటిల్లో పోసి గదిలో స్ప్రే చేయాలి.

హెచ్చరిక

హెచ్చరిక

ఆరెంజ్ ను కొనేటప్పుడు పురుగు మందులు వాడని ఎంపిక చేసుకోవాలి. నేచురల్ గా పండిన ఆరెంజ్ తొక్కను ఉపయోగించుకోవచ్చు . ప్రస్తుత రోజుల్లో ఆరెంజ్ ను పండించడానికి ఎక్కువగా కెమికల్స్ ఉపయోగిస్తున్నారు . ఈ కెమికల్ తొక్కలోని జొప్పించకపోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

Desktop Bottom Promotion