For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ క్యాన్సర్ నిరోధించాలంటే ఫాలో అవ్వాల్సిన డైట్

By Nutheti
|

క్యాన్సర్ అంటే ఇప్పుడు అత్యంత భయంకరమైన వ్యాధిగా మారింది. సరైన పద్దతి, మందులు, కీమోతెరపీ ద్వారా క్యాన్సర్ ని నివారించవచ్చు. మొదట్లోనే రొమ్ము క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయితే.. నివారించడానికి చాలా పద్ధతులున్నాయి. క్యాన్సర్ నివారించడానికి కొన్ని ఆహారపు అలవాట్లు సహాయపడతాయి. అయితే హెల్తీ డైట్ ఫాలో అవడం వల్ల క్యాన్సర్ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చు.

అనుమానం పెనుభూతం.. బ్రెస్ట్ క్యాన్సర్ పై అపోహలు, వాస్తవాలుఅనుమానం పెనుభూతం.. బ్రెస్ట్ క్యాన్సర్ పై అపోహలు, వాస్తవాలు

ఎక్కువ కూరగాయలు, ఫ్రూట్స్ తీసుకుంటూ, రోజుకి 30 నిమిషాలు వ్యాయామం చేసే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సీ ఫుడ్, ఒమేగా త్రీఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు బ్రెస్ట్ క్యాన్సర్ ని నిరోధిస్తాయి. ఇవే కాదు మరికొన్ని ఆహారాలు డైట్ చేర్చుకోవడం తప్పనిసరి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ని నివారించవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ పేషంట్స్ డైట్ లో తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి ఆహారాలు బ్రెస్ట్ క్యాన్సర్ ని నిరోధిస్తాయో ఒకసారి చూద్దాం..

పసుపు

పసుపు

పసుపును ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ ని నిరోధించవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంపై ఎలాంటి హాని కలుగకుండా కాపాడతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి

బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడటంలో వెల్లుల్లి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా వెల్లుల్లి అరికడుతుంది.

బ్రొకోలి

బ్రొకోలి

క్యాన్సర్ నివారించే ఆహారాల్లో బ్రొకోలి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. క్యాన్సర్ కి కారణమయ్యే ట్యూమర్స్ పెరుగుదలను నివారించడానికి బ్రొకోలి సహాయపడుతుంది.

దానిమ్మ

దానిమ్మ

ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్న దానిమ్మలో బ్రెస్ట్ క్యాన్సర్ ని నివారించే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

యాపిల్స్

యాపిల్స్

యాపిల్స్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ని నివారించవచ్చు. అయితే తొక్కతో పాటు తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు. యాపిల్ తొక్కలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి.

వాల్ నట్స్

వాల్ నట్స్

క్యాన్సర్ నిరోధించడానికి ఫాలో అయ్యే డైట్ లో వాల్ నట్స్ ని ఖచ్చితంగా చేర్చుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ కి కారణమయ్యే ట్యూమర్స్ ని అరికట్టడానికి వాల్ నట్స్ బాగా సహాయపడతాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో వాల్ నట్స్ చేర్చుకోవడం చాలా అవసరం.

చేపలు

చేపలు

బ్రెస్ట్ క్యాన్సర్ నిరోధించడానికి చేపలు చాలా ముఖ్యమైనవి. ఇందులో లీన్ ప్రొటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్ ని నిరోధిస్తాయి. కాబట్టి డైట్ లో కంపల్సరీ ఫిష్ లను చేర్చుకోవాలి.

English summary

Foods To Prevent Breast Cancer Recurrence

There is no magic cure for cancer. You have to go through a proper medication and chemotherapy to beat your enemy. In case of breast cancer, if it is diagnosed at an early stage, cancer can still be cured.
Desktop Bottom Promotion