For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్జీ నుండి ఉపశమనం కలిగించే యాంటీబయోటిక్ ఫుడ్స్

|

అలర్జీ అనేది ప్రతి ఒక్కరూ ఏదో ఒకరూపం అనుభం పొంది ఉంటారు. అయితే ఈ అలర్జీలే మనల్ని ఏరూపంలో మనల్ని అటాక్ చేస్తాయో తెలియదు. వాతావరణ కాలుష్యం వల్ల, శరీరానికి సరిపడని పదార్థాలు, అతిగా మందులు వాడటం, ఎక్కువసేపు నీటిలో నానడం, కలుషితమైన నిల్వ ఆహారం లేదా ఇతర కారణాల వల్ల ఈ అలెర్జీ తలెత్తుతుంది. అంతే కాదు అలర్జీలకు వివిధ కారణాలు కూడా ఉన్నాయి. కారణాలతో పాటు కొన్ని లక్షణాలు, స్కిన్ రాషెష్, చర్మం దురద, చిరాకు పెట్టడం, తుమ్ములు, కళ్ళు ఎర్రగా మారడం, ముక్కులో కారడం ఇలా అనేక లక్షణాలను కలిగి ఉంటాయి. అంతే కాదు కొన్ని అలర్జీల వల్ల ప్రేగుల్లో క్రాంప్స్, విరేచనాలు మరియు వాంతులు వంటి లక్షణాలు కూడా బహిర్గితం అవుతాయి.

కొంత మంది డైరీ ప్రొడక్ట్స్ అంటే పడవు, కొంత మందికి వేరుశెనగలు అంటే పడవు, మరికొంత మందికి జున్ను, మష్రుమ్ వంటి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తిన్నప్పుడు ఫుడ్ అలర్జీ కలుగుతుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వాతావరణంలోని కాలుష్యం కూడా అలర్జీలకు కారణం అవుతుంది. అలర్జీ ఒక వ్యక్తి నుండి మరోవ్యక్తి చాలా తేలికగా వ్యాప్తి చెందుతాయి. కొంతమందికేమో ఏం చేసినా ఎలాంటి ఫుడ్స్ తిన్నా ఎలాంటి అలర్జీలుండవు.

స్కిన్ అలర్జీ లేదా చర్మం దురదను నివారించే హోం రెమెడీస్

అలర్జీ అంటానే చర్మం దురలు మరియు ముక్కు నుండి నీరు కారడం ప్రధాణ లక్షణాలుగా చూపెడుతున్నది. ఈ అలర్జీలకు గల కారణాలను తెలుసుకొని వాటికి దూరంగా ఉండటం మంచిది. అంతే కాదు అలర్జీలను నివారించడానికి కొన్ని ఆహారాలు కూడా సహాయపడుతాయి. అలర్జీలకు వ్యతిరేఖంగా పోరాడుతాయి . అదే విధంగా అలర్జీల నుండి ఉపశమనం కలిగిస్తాయి . అలర్జీల నుండి ఉపశమనం కలిగించే కొన్ని ఆహారాలు ఈ క్రింది లిస్ట్ లో ....

ఆపిల్స్:

ఆపిల్స్:

ఆపిల్స్ లో క్యిరిసిటిన్ ఉంటుంది. ఇది హిస్టమిన్ ను విడుదల చేస్తుంది. దాంతో అలర్జీకి కారణం అయ్యే కణాలతో పోరాడి అలర్జీ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలర్జీలను నివారించడంలో ఇది ఒక ఉత్తమ ఆహారం.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

అలర్జీలను నివారించడంలో వాటర్ మెలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. వాటర్ మెలోన్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది . ఇది శరీరంలో అన్ని రకాల టాక్సిన్స్ మరియు అలర్జీలను నివారించడంలో చాలా గ్రేట్ గా సమాయపడుతుంది. మరియు ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధకతను పెంచుతుంది.

పసుపు:

పసుపు:

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ అలర్జిక్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల అలర్జీలను ఎందుర్కొంటుంది. ఒక గ్లాస్ వేడి పాలలో కొద్దిగా పసుపు వేసి రోజుకు రెండు సార్లు తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది మరియు అలర్జీల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మరియు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో టాక్సిన్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . అలర్జీలను నివారించడానికి రెండు మూడు గ్లాసుల లెమన్ జ్యూస్ ను త్రాగాలి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి . ఇందులో ఉండే ఎపిగలోకాటచిన్ గల్లేట్ అలర్జీని నివారిస్తుంది. గ్రీన్ టీ శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది . తేనె మిక్స్ చేసిన లెమన్ టీ రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వ్యాధినిరోధకతను పెంచుతుంది మరియు ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది అలర్జీలను తగ్గించడం మాత్రమే కాదు ఇది యాంటీబయోటిక్ గా మరియు అలర్జీలను నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. . ప్రతి రోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల అలర్జీల నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

అల్లం:

అల్లం:

అల్లం రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు అలర్జీికి కారణం అయ్యే హెస్టిమైన్ ను ఉత్పత్తిని తగ్గిస్తుంది. అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి అది ఆస్తమాను నివారిస్తుంది.

పెరుగు:

పెరుగు:

ఇది ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండే అలర్జిక్ ఫుడ్. ఇది అలర్జీని నేచురల్ గా తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో పెరుగును తప్పనిసరిగా చేర్చుకోవాలి.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటోలో పొటాషియం, మెగ్నీషియం, మరియు విటమిన్ బి6 పుష్కలంగా ఉండి. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధతకను పెంచుతుంది.

English summary

Foods That Cure Allergy

Allergy can be very annoying as it causes skin itching or sneezing. We have to find out the trigger that causes allergy and then stay away from it. This can be the only solution to prevent from allergic response. However there are some best foods that offer protection against allergy and can treat allergy as well. These foods are natural remedies to combat allergies.
Story first published: Thursday, June 11, 2015, 18:23 [IST]
Desktop Bottom Promotion