For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘లవంగం టీ’లోని ఆశ్చర్యకరమైన ఎఫెక్టివ్ హెల్త్ బెనిఫిట్స్

|

లవంగం టీలోని ఆరోగ్యం ప్రయోజనాలు ఏమి? తెలుసుకోవాలనుందా? మనం రెగ్యులర్ గా టీని తీసుకుంటాం. కొంత మందికి టీ త్రాగనిది ఆ రోజంతా ఏదో వెలితిగా అనిపిస్తుంది. మరికొంత మంది ఒత్తిడిగా ఫీలవుతారు. కాబట్టి, ఏదో ఒక ఫీలింగ్ తో టీ తప్పని సరిగా త్రాగుతుంటారు. రోజు మొదలవడానికి ఒక కప్పు టీతో ప్రారంభించి డే పూర్తవడానికి ఒక కప్పు టీతో ముగిస్తుంటారు. అప్పుడు వారి సంతృప్తిగా ఫీలవుతుంటారు.

‘టీ'మన జీవితంలో తప్పనిసరి అయినప్పుడు, దానికి మరొక హెల్తీ పదార్థం జోడించి, జబ్బులను నివారించే ద్రవంగా మనం ఎందుకు తీసుకోకూడదు. అందువల్ల మనం మనం అల్లం టీ మరియు గ్రీటీలను తీసుకోవడం జరుగుతుంటుంది.

READ MORE: తేనె & దాల్చిన చెక్కలోని ఆసక్తికరమైన ఆరోగ్య ప్రయోజనాలు

అలాంటి హెల్తీ టీలలో ఒకటైనదే క్లోవ్ టీ(లవంగం టీ). లవంగంతో తయారుచేసిన టీ యొక్క ప్రయోజనాలను గురించి తెలుసుకోవడమే ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం . సాధారణంగా మనం మన ఇండియన్ వంటల్లో చాలా వరకూ లవంగాలను ఉపయోగిస్తుంటాము . కానీ మనం టీలో ఎప్పుడూ ప్రయత్నించలేదు.

లవంగం టీ ఎలా తయారుచేయాలో మీకు తెలుసా? ముందుగా కొన్ని లవంగాలు నీటిలో వేసి, కొన్ని నిముషాలు గా మరిగించాలి . మరియు కొంత టీపౌడర్ ను జోడించడమే మిగిలిన ప్రొసెస్ మొత్తం.

ఈ లవంగం టీని తయారుచేసిన వెంటనే తీసుకోవచ్చు లేదా చల్లారిన తర్వాత తీసుకోవచ్చు. ..తీసుకొనే ముందు ఇందులోని లాభనష్టాలు గురించి తెలుసుకుందాం...

సైనస్:

సైనస్:

లవంగం టీని ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల సైనస్ వంటి సమస్యలను నివారించుకోవచ్చు . లవంగంలో ఉండే యూజినోల్ ముక్కులో అడ్డుకొన్న గల్లను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది.

దంత సమస్యలు:

దంత సమస్యలు:

దంత సమస్య వల్ల దంతాలలో వాపు ఉన్నట్లైతే లవంగాల టీ ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. దంతక్షయం లేదా దంతాల నొప్పి నివారించుకోవడానికి నీటిలో లవంగాలు వేసి బాగా మరిగించి ఆ నీరు గోరువెచ్చగా మారిన తర్వాత నోట్లో పోసుకొని పుక్కలించాలి . ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే నోట్లో చేరిన బ్యాక్టీరియా క్రమంగా తగ్గిపోతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

లవంగం టీ వల్ల ఇది మరో ఆరోగ్య ప్రయోజనం. భోజనానికి ముందు లవంగాల టీ త్రాగడం వల్ల ఇది నోట్లో లాలాజల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇంకా లవంగం టీ జీర్ణవ్యవస్థ ఉద్దీపన మరియు ఎసిడిటిని తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది.

చర్మ సంరక్షణ:

చర్మ సంరక్షణ:

లవంగాల్లో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . అందువల్లే లవంగాలు టీ చర్మ సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది . చర్మ సమస్యలను మరియు చర్మ ఇన్ఫెక్షన్ ను నివారించడానికి లవంగాల టీని, బాహ్యంగా ఉపయోగించుకోవచ్చు.

జ్వరం:

జ్వరం:

లవంగాల్లో మెగ్నీషియం ఉంటుందన్న వాస్తవం మీకు తెలుసా ? అంతే కాదు, ఇందులో విటమిన్ ఇ మరియు కె లు కూడా పుష్కలంగా ఉన్నాయి . మీరు జ్వరంతో బాధపడుతున్నప్పుడు, లవంగం టీ త్రాగితే బాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుంది . మరియు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

మజిల్ పెయిన్ :

మజిల్ పెయిన్ :

లవంగాలు అనాలజిసిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. మజిల్ పెయిన్ మరియు జాయింట్ పెయిన్ నివారించడానికి కోల్డ్ కంప్రెజర్ ను ఉపయోగించుకోవచ్చు. ఆ నీటిలో లవంగాలను వేసి మరిగించి, చల్లారిన తర్వాత పెయిన్ ఉన్న ప్రదేశంలో ప్రెజర్ ఇవ్వాలి .

ఆర్ధరైటిస్ :

ఆర్ధరైటిస్ :

ఆర్ధరైటిస్ నొప్పితో బాధపడే వారు నొప్పి ఉన్న ప్రదేశంలో క్లో కంప్రెస్ ను ట్రై చేయవచ్చు. దానికి చల్లని లవంగం టీని ఉపయోగించుకోవచ్చు.

పరాన్న జీవులు:

పరాన్న జీవులు:

ప్రేగులో పరాన్న జీవులతో బాధపడుతున్నవారికి లవంగం టీ చాలా మంచిది. లవంగాలు పరాన్న జీవులను తొలగిస్తుంది. కడుపు నొప్పిని నివారిస్తుంది . లవంగం టీ లాభాలలో ఇది ఒకటి.

శానిటైజర్:

శానిటైజర్:

లవంగా టీ లేదా లవంగాలు ఉడికించిన నీటితో చేతులను శుభ్రం చేసుకోవచ్చు. ఇది సానిటైజర్ గా పనిచేస్తుంది. క్లోవ్ వాటర్ తో చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల చేతుల్లో ఉండే బ్యాక్టీరియా మరియు మురికిని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Health Benefits Of Clove Tea

What are the benefits of clove tea? Well, all of us consume tea on a daily basis. Most of us start the day with a cup of tea and end the day by unwinding on a cup of tea. When tea has become an integral part of our lives, why not make it a healing drink by adding the right ingredients to it? Well, this is how ginger tea and green tea have come into existence.
Desktop Bottom Promotion