For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రక్తం బొబ్బలు కట్టకుండా ఉండడానికి 10 గృహ వైద్యాలు

By Super
|

రక్త నాళాలు, కణజాలాలు దెబ్బతిన్నపుడు చర్మం కింద రక్త౦ బొబ్బలు ఏర్పడతాయి. బైటికి దెబ్బలు, పగుళ్ళు ఏర్పడి రక్తం కారదు కానీ లోపల రక్తస్రావం (చర్మం లోపల) ఔతుంది.

రక్త ఉంటే లోపల రక్తపు బొబ్బలు ఏర్పడి, ఇతర శరీర ద్రవాలు కూడా అక్కడ చేరతాయి. ఒకవేళ అక్కడ దెబ్బ తగలడ౦ లేదా పంక్చర్ అవ్వడం గానీ జరిగితే అక్కడ ముదురు రంగు స్రావం బైటికి వస్తుంది. శరీరం లోపలి భాగంలో చేతులు లేదా పాదాలకు దెబ్బతగిలితే లోపల రక్తస్రావం వల్ల అక్కడ నెప్పి పుడుతుంది.

చేతులు, పాదాలు లేదా ఇతర శరీర భాగాల బైటవైపు దేబ్బతగిలినపుడు లేదా కొన్ని పరికరాల వల్ల చర్మంపై గాయం ఏర్పడినపుడు, పాదంతో దేన్నైనా తన్నినపుడు లేదా చేతిని వెనక్కు బాగా తిప్పినపుడు, కారు తలుపులో వేలి గోళ్ళు పడినపుడు, ఎక్కువ బరువులు మోసినపుడు, చర్మాన్ని గట్టిగా వత్తడం జరిగినపుడు రక్తపు బొబ్బలు ఏర్పడతాయి. అవి వాటంతటవి తగ్గిదానికి సహజంగా 30 రోజులు పడుతుంది. అయితే, అవి త్వరగా నయమవడానికి, వాటినుండి ఉపశమనం పొందడానికి ఇక్కడ కొన్ని గృహ వైద్యాలు ఇవ్వబడ్డాయి. ఈ బొబ్బలను గట్టిగా అస్సలు పగల గోట్టవద్దు ఎందుకంటే దానివల్ల ప్రమాదకర చర్మ వ్యాధులు, నొప్పి కలుగుతాయి.

READ MORE: రక్తం గడ్డకట్టకుండా గుండెను కాపాడే విటమిన్ కె

మీరు రక్తం బొబ్బల బారిన పడ్డారా? వాటిని అస్సలు పగలగోట్టకండి. అవి పగిలితే యాంటీ సెప్టిక్ క్రీమ్ వాడండి. రక్త బొబ్బల తో సమస్యలు ఏంటంటే సరైన శ్రద్ధ తీసుకోకపోవడం లేదా ఆరోగ్యకరంగా ఉండకపోవడం వల్ల అంటురోగం త్వరగా ఏర్పడి, ప్రమాదకరమైన చర్మ వ్యాధులు వస్తాయి.

ఈరోజు, బోల్డ్ స్కై వారు రక్తపు బొబ్బల కు ఇంట్లో తయారుచేసే కొన్ని ప్రభావవంతమైన వైద్యాలను మనకు తెలియచేస్తారు. వాటిపై దృష్టి పెట్టండి.

విచ్ హాజెల్

విచ్ హాజెల్

టానిన్లలో సమృద్ధిగా ఉండే విచ్ హాజిల్ రక్తపు బొబ్బలపై ఉన్న ఇన్ఫెక్షన్ ను చంపుతుంది. ఇది నొప్పిని, రక్తపు బొబ్బల వల్ల కలిగే వాపును తగ్గిస్తుంది. ఇది బొబ్బలను పొడిచేసి, నయమవడానికి సహాయపడుతుంది. మీరు విచ్ హాజెల్ సారాన్ని మరిగించిన నీటిద్వారా తయారుచేయవచ్చు. ఆ సావంలో కాటన్ ని ముంచి, దానిని కొద్దిసేపు బొబ్బపై ఉంచండి. ఆ బొబ్బ మాయమయ్యే వరకు ఇలా కొన్ని వారాలపాటు చేయండి.

కలబంద

కలబంద

రక్తపు బొబ్బలపై కొద్దిపాటి కలబంద రసాన్ని అప్లై చేయండి. ఇది నొప్పి, దురదల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది యాస్త్రిన్జేంట్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ను చంపి తద్వారా గాయం త్వరగా నయమవడానికి సహాయపడుతుంది.

ఐసు గడ్డ

ఐసు గడ్డ

కొన్ని బైటి వత్తిడుల వల్ల మీ చర్మం దెబ్బతింటే, వెంటనే ఐస్ ప్యాక్ లేదా ఐస్ క్యూబ్ క్లాత్ లో చుట్టి బొబ్బ ఉన్న చోట పెట్టాలి. ఇది రక్తపు బొబ్బలు ఏర్పడకుండా కాపాడుతుంది.

చందనం

చందనం

ఇది బొబ్బలపై మృదువుగా కూడా పనిచేస్తుంది. నీటిలో చందనాన్ని ఒక మిశ్రమం లా తయారుచేయండి. రక్తపు బొబ్బలపై దీనిని అప్లై చేసి, కనీసం 20 నిమిషాల పాటు అంటే అది ఆరేవరకు ఉంచాలి. దానిని తడిగా ఉన్న కాటన్ తో సున్నితంగా తుడవాలి.

గాలితగిలేట్లు ఉంచి నిర్మూలించడం

గాలితగిలేట్లు ఉంచి నిర్మూలించడం

ఒకసారి రక్తపు బొబ్బ కనిపిస్తే, అది చేతి మీద లేదా కాలిమీదా ఎక్కడైనా ఆ ప్రాంతాన్ని గాలితగిలేట్లు ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆ రక్తపు బొబ్బ పెద్దది కాకుండా నిర్మూలించవచ్చు. పెద్ద సైజు బొబ్బ చాలావరకు పగిలే ప్రమాదం ఉండి, దానివల్ల చర్మానికి ఇన్ఫెక్షన్ వస్తుంది.

టీ బాగ్స్

టీ బాగ్స్

టీ లో టాన్నిన్స్ ఉంటాయి, కొన్నిరకాల టీలలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి బొబ్బాలపై ఉన్న ఇన్ఫెక్షన్ ను కిల్ చేసి, వాపును తగ్గించి, నొప్పినుండి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. బొబ్బలు పూర్తిగా పోయేవరకు చల్లటి టీ బాగ్ లను కనీసం నెలలో ఒకరోజు అనేకసార్లు వీటిని ఉపయోగించాలి.

దానిని మూసి ఉంచకుండా చూడండి

దానిని మూసి ఉంచకుండా చూడండి

మీ బొబ్బలను మూసి ఉంచకండి, అలాచేస్తే ఒకవేళ పాదం, అరికాలు పై బొబ్బలు వంటివి అయితే వాటి ప్రభావంతో తరచుగా వస్తాయి. మీ పాదం, అరికాలి పై ఉన్న బొబ్బను ఒక బాండేజ్ తో కప్పి ఉంచండి, లేకపోతే అవి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

కీరదోస

కీరదోస

ఇది రక్తపు బొబ్బలపై చల్లదనాన్ని కలిగించి నొప్పిని తగ్గిస్తుంది. ఇది బొబ్బల వల్ల కలిగే వాపును కూడా తగ్గిస్తుంది. బొబ్బలు చిన్నవయ్యే దాకా మీరు కొన్ని కీరదోస ముక్కలను కొన్నివారాలపాటు రోజులో కనీసం అనేక సార్లు ఆ బొబ్బాలపై ముక్కలను ఉంచండి. మీరు వాపు తగ్గడానికి కీరదోస రసాన్ని కూడా తాగండి.

పరిశుభ్రంగా ఉంచడం

పరిశుభ్రంగా ఉంచడం

రక్తపు బొబ్బలు ప్రమాదాలకు ఎక్కువ గురౌతాయి. అందువల్ల బాండేజ్ మార్చడం, ఆ బొబ్బను కవర్ చేయడానికి డ్రస్సింగ్ చేయడం, మీరు దానిని తాకితే మీ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయడం చాలా ముఖ్యం.

 మౌత్ వాష్

మౌత్ వాష్

ఇది యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉండి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది. మీరు రక్తపు బొబ్బలపై కొద్దిగా మౌత్ వాష్ ని అప్లై చేయండి. ఇది ఇన్ఫెక్షన్ ని తొలగించి, మీ గాయాన్ని త్వరగా నయం చేస్తుంది. ఇది బొబ్బలపై చల్లదనంతో కూడిన ప్రభావాన్ని చూపి నొప్పిని తగ్గిస్తుంది.

Desktop Bottom Promotion