For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైబ్లడ్ ప్రెజర్, హైపర్ టెన్షన్ తగ్గించే ఎఫెక్టివ్ రెమెడీస్

|

బ్లడ్ ప్రెజర్ గురించి వినే ఉంటారు. బ్లడ్ ప్రెజర్ ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యానికి ప్రమాదమే. అందుకే బ్లడ్ ప్రెజర్ కు కంట్రోల్లో ఉంచుకోవాలిని డాక్టర్లు సలహాలిస్తుంటారు. బ్లడ్ ప్రెజర్ అంటే రక్తం గుండె నుండి శరీరంలోని ఇతర అవయవాలకు మరియు అవయవాల నుండి తరిగి గుండెకు ప్రసరణ జరుగుతుంది. దీన్ని బ్లడ్ ప్రెజర్ అంటారు. శరీరంలో అన్ని అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగినప్పుడు శరీరంలో జీవక్రియలు మెరుగ్గా పనిచేస్తాయి. హైబ్లడ్ ప్రెజర్ ఉన్నప్పుడు, రక్తం ఎక్కువగా గుండెకు పంప్ చేయబడుతుంది, ఆ సమయంలో ధమనుల్లో ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది.

హైపర్ టెన్షన్ మరియు హైబ్లడ్ ప్రెజర్ కొన్ని తీవ్రమైన పరిస్థితుల కారణం వల్ల ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం సేవించడం, వ్యాయామం చేయకపోవడం, బర్త్ కంట్రోల్ పిల్స్, పెయిన్ కిల్లర్స్, కిడ్నీ సమస్యలు మరియు అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ మరియు హైబ్లడ్ ప్రెజర్ కు గురికావల్సి ఉంటుంది.

READ MORE:హైబిపి వల్ల ఆరోగ్యానికి కలిగే 15 ప్రమాధకరమైన దుష్ర్పభావాలు

హై బ్లడ్ ప్రెజర్ మరియు హైపర్ టెన్షన్ తగ్గించుకోవడానికి లేదా కంట్రోల్ చేసుకోవడానికి మన ఇంట్లోనే కొన్ని రెమెడీస్ ఉన్నాయి. బ్లడ్ ప్రెజర్ ను మరియు హైపర్ టెన్షన్ తగ్గించుకోవడానికి క్లీనిక్స్, డాక్టర్స్ వరకూ వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ తోనే హైబ్లడ్ ప్రెజర్ తగ్గించుకోవచ్చు. అయితే సరైన సమయంలో బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయకపోతే స్ట్రోక్, హార్ట్ అటాక్, కంటిచూపు మందగించడం, హార్ట్ అటాక్, మరియు కిడ్నీ ఫెల్యూర్ వంటి ప్రాణాంతక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. READ MORE: పిల్స్ వాడకుండా హైబిపి ని కంట్రోల్ చేయడానికి టిప్స్

మరి ఈ ప్రాణాంతక వ్యాధుల భారీన పడకుండా ఉండటానికి హైపర్ టెన్షన్, హైబీపి తగ్గించుకోవడానికి కొన్ని నేచులర్ మరియు ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా....

మందారం:

మందారం:

మందారం ఆకులు మరియు పువ్వుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే, మందారం టీని రెగ్యులర్ గా తీసుకోమని అనేక మంది డాక్టర్లు సలహాలిస్తుంటారు. ముఖ్యంగా హైబ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో మందారం ఒక గొప్ప హోం రెమెడీ. మందారం టీ వల్ల కొన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది . కొన్నిమందారం పువ్వులను డ్రై చేసి తర్వాత నీటిలో వేసి బాయిల్ చేయాలి. తర్వాత అందులో తేనె, నిమ్మరసం మరియు దాల్చిన చెక్క వేసి ఉడికించాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి గోరువెచ్చగా అయిన తర్వాత త్రాగాలి.

కోకనట్ వాటర్:

కోకనట్ వాటర్:

కోకనట్ వాటర్ మన శరీరంలోని కండరాల ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. హైపర్ టెన్షన్, హైబ్లడ్ ప్రెజర్ తగ్గడానికి రక్తప్రసరణను క్రమబద్దం చేస్తుంది.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ లో సిట్రులిన్ అనే ఆర్గానిక్ కాంపౌడ్ ఉంటుంది. ఇది గుండెకు రక్తాన్ని ప్రసరింప చేయడానికి సహాయపడుతుంది . కాబట్టి, ఈ సీజన్ లో దొరికే వాటర్ మెలోన్ ను ప్రతి రోజూ ఉదయం పరకడున తీసుకోవాలి . వాటర్ మెలోన్ మాత్రమే కాదు, అందులో ఉండే విత్తనాలు కూడా రక్త కేశనాళికల విస్తరించడంలో సహాయం చేస్తుంది, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది మరియు అధిక రక్తపోటును తగ్గిస్తుంది

అరటిపండ్లు :

అరటిపండ్లు :

హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో అరటిపండ్లు గ్రేట్ గా సమాయపడుతాయి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఎందుకంటే అరటిపండ్లలో పొటాసియం అధికంగా ఉంటుంది. ఇది సోడియంను ఎక్కువ తీసుకోనివ్వకుండా, దాని ప్రభావాలు శరీర ఆరోగ్యం మీద పడకుండా సహాయపడుతుంది. అరటిపండ్లతో పాటు, ఆకుకూరలు, వింటర్ క్వాష్, ఆరెంజ్ జ్యూస్ మరియు ద్రాక్షను కూడా తీసుకోవాలి.

కొత్తిమీర:

కొత్తిమీర:

కొత్తిమీర ఒక హెల్తీ హెర్బ్ . ముఖ్యంగా హైబ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది హార్ట్ కు మరియు ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెకు ప్రసరించే రక్తాన్ని క్రమబద్దం చేస్తుంది. బ్లడ్ ప్రెజర్ కు కారణం అయ్యే స్ట్రెస్ హార్మోనులను తగ్గిస్తుంది..

English summary

Home Remedies For High Blood Pressure

Blood pressure means the force of pressure with which the blood is pumped from the heart to the arteries. During high blood pressure the blood is pumped in a greater force which leads the arteries to get damaged.
Story first published: Friday, May 29, 2015, 11:14 [IST]
Desktop Bottom Promotion