For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్ఞానదంతాల నొప్పి నివారించేందుకు కొన్ని ఉత్తమ చిట్కాలు

By Super
|

జ్ఞానదంతాల నొప్పి అనేది సాధారణంగా 17 నుండి 25 ఏళ్ళలో వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కొంత మంది జీవితంలో 25ఏళ్ల తర్వాత దశలో కూడా జ్ఞానదంతాల నొప్పిని కలిగి ఉంటారు. దీన్ని థర్డ్ మోలార్స్ అని కూడా పిలుస్తారు, అది చివరిగా దంతాలు మరియు ఈ దంతాలు నోట్లో చివరలో ఉంటాయి. ఇవి నాలుగు భాగాలుగా కనబడుతుంటాయి.

జ్ఞానదంతం చివరగా వస్తుంటాయి, దంతాలన్ని వచ్చిన తర్వాత ఇవి మొలవడం వల్ల, ఇవి నోట్లో పెరగడానికి వాటికి సరైన స్థలం సరిపోకపోవడం వల్ల జ్ఞానదంతం వచ్చేటప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది . స్థలంను సమకూర్చుకోవడానికి పక్కపళ్ళను లేదా లోపలికండరాలను ముందుకు, వెనకకు నెట్టుకుంటూ పెరగడం వల్ల ఈ నొప్పి ప్రతి ఒక్కరిలోనూ సహజంగా వస్తుంటుంది. దీని ఫలితంగా జ్ఞానదంతాల నొప్పి, వాపుకు కారణం అవుతుంది.

ఈ నొప్పితో పాటు, చెడు శ్వాస, నమలడంలో మరియు ఆహారాన్ని మ్రింగడంలో కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది. ఇంకా, తలనొప్పి, మరియు దంతాల మద్య నొప్పి కలిగి ఉంటుంది.

జ్ఞానదంతాల నొప్పి అనుకోకుండా ఎలాంటి లక్షణాలు లేదా సంకేతాలు లేకుండా నొప్పికి గురిచేస్తుంటుంది. లేదా క్రమంగా నొప్పి పెడుతూనే ఉంటుంది. ఈ జ్ఞానదంతాల నొప్పిని భరించలేకున్నంతగా మరియు మీ దినచర్యలు దినదినానికి మరింత తీవ్రంగా కష్టంగా మార్చేస్తుంది. ఈ జ్ఞానదంతాల నొప్పిని నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల నొప్పిని నివారించుకోవచ్చు. అదేవిధంగా, నొప్పి తిరిగి పునరావ్రుతం అవుతుంటే, ఆ దంతాన్నిడెంటిస్ట్ ద్వారా తొలగించడం ఒక ఉత్తమ మార్గం. అయితే, డెంటిస్ట్ ను కలవాడనికి ముందుగా జ్ఞానదంతాల నొప్పిని నివారించడానికి కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి....

లవంగాలు

లవంగాలు

ఇతర దంతాలతో పోల్చిన జ్ఞానదంతాల నొప్పి నివారించడంలో లవంగాలు గ్రేట్ గా సహాయపడుతాయని నిరూపించబడినది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి. మరియు ఇందులో ఉండే యాంటీసెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ ను నివారిస్తాయి . జ్ఞానదంతాల నొప్పిని నివారించడానికి లవంగాలు మరియు లంగం నూనె రెండూ ఉపయోగించవచ్చు.

లవంగం నూనె

లవంగం నూనె

చాలా నొప్పిపెడుతున్నజ్ఞానదంతానికి లవంగం నూనెలో అద్దిన కాటన్ బాల్ తో మర్దన చేయాలి. నొప్పి ఉన్న దంతానికి చుట్టూ కూడా లవంగం ఆయిల్ ను అప్లై చేయాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేయవచ్చు. లవంగం నూనె మరీ ఘాటుగా అనిపిస్తే, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసుకోవచ్చు.

ఇంకా మీరు రెండు లేదా మూడు లవంగాలను మీ నోట్లో వేసుకొని నొప్పి కలిగిస్తున్న దంతం మీద నాలుకతో తోసి, ఉండేలా చేయవచ్చు. లవంగాలు, అందులో ఉండే నూనెను విడుదల చేయడం ప్రారంభమైతుంది, అప్పుడు జ్ఞానదంతాల నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది . మీకు అవసరం అయినప్పుడు ఈ చిట్కాను అనుసరించవచ్చు.

మరో చిట్కా ఒక వెల్లుల్లి రెబ్బను పేస్ట్ చేసి, కొద్దిగా రాళ్ళ ఉప్పు మిక్స్ చేసి , దానికి రెండు మూడు చుక్కల లవంగం నూనె మిక్స్ చేసి ఈ పేస్ట్ ను నొప్పి ఉన్న దంతాల మీద అప్లై చేయాలి . 10 నిముషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను రోజుకు ఒకటి రెండు సార్లు అనుసరించాలి.

ఉప్పు

ఉప్పు

జ్ఞానదంతాల నొప్పినివారణకు మరో హోం రెమెడీ ఉప్పు. ఇది దంతాలు , చిగుళ్ల యొక్క వాపును, తగ్గిస్తుంది మరియు ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.

ఒక గ్లాసు వేడి నీళ్ళలో ఒక చెంచా ఉప్పు మిక్స్ చేయాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని అనేక సార్లు పుక్కలించాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నివారించి , ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది.

ఉప్పు

ఉప్పు

అలాగే మిరియాలపొడి మరియు ఉప్పు సమంగా తీసుకొని, కొద్దిగా నీళ్ళుపోసి, పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను నొప్పి ఉన్న దంతాల మీద అప్లై చేసి కొన్ని నిముషాలు అలాగే ఉంచి, తర్వాత నోరు శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను రోజులో రెండు మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్, యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఇతర ఔషధగుణాలు కలిగి ఉండటం వల్ల, ఇది జ్ఞానదంతాల నొప్పిని నివారిస్తుంది. మరియు ఇది నోట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా నివారిస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

ఒక చిన్న వెల్లుల్లి రెబ్బను రఫ్ గా నమిలిన నొప్పిఉన్న దంత మీద అలాగే కొద్ది సమయం ఉంచుకోవాలి , ఇలా చేయడం వల్ల జ్ఞానదంతాల నొప్పిని నివారించుకోవచ్చు.

ఇంకా ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను నమలడం వల్ల కూడా జ్ఞానదంతాల నొప్పిని నివారించుకోవచ్చు.

ప్రత్యామ్నాయంగా , ఒకటి,రెండు వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసి అందులో బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి, నొప్పి ఉన్నప్రదేశంలో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. దీన్నికొన్నినిముషాలు అలాగే ఉంచి తర్వాత ఉమ్మివేయాలి . ఈ చిట్కాలను రోజులో ఒకటి లేదా రెండు సార్లు అనుసరించాల్సి ఉంటుంది.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు

ఉల్లిపాయలో యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్, మరియు యాంటీ మైక్రోబైల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల జ్ఞానదంతాల నొప్పిని నివారిస్తుంది మరియు ఇన్ఫెక్షన్ కు కారణం అయ్యే సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది .

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు

పచ్చి ఉల్లిపాయ ముక్కను అప్పడప్పుడు నములుతుండాలి.

జ్ఞానదంతాల నొప్పి లేదా వాపు వల్ల మీకు నమలడానికి కష్టంగా ఉంటే, పచ్చిఉల్లిపాయ ముక్కను నొప్పిఉన్న దంతాల మీద కొద్ది సమయం ఉంచాలి.

ఈచిట్కాలను నొప్పి తగ్గే వరకూ ఎన్ని సార్లైనా ప్రయత్నించవచ్చు.

జామ ఆకు

జామ ఆకు

జామ ఆకు జ్ఞానదంతాల నొప్పి నుండి అద్భుతంగా ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే, ఇందులో బయో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో ఉండే యాంటీస్పాస్మోడిక్ లక్షణాల వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. ఇంకా ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ మరియు అనాలజీస్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

జామ ఆకు

జామ ఆకు

పచ్చగా మరియు తాజాగా ఉండే జామ ఆకులు ఒకటి లేదా రెండు ఆకులను నోట్లో వేసుకొని నమలడం ద్వారా జ్ఞానదంతాల నొప్పినుండి ఉపశమనం పొందవచ్చు.

మరో చిట్కా ఒక కప్పునీటిలో 4,5 జామఆకులను వేసి 5నిముషాలు బాగా మరిగించాలి. తర్వాత నీరు వడగట్టుకొని, చల్లారనివ్వాలి. ఈ నీటిని మౌత్ వాష్ కోసం రోజుకు రెండుసార్లు ఉపయోగించడం వల్ల జ్ఞానదంతాల నొప్పిని నివారించుకోవచ్చు.

పుదీనా

పుదీనా

పుదీనా మరో ఎఫెక్టి హోం రెమెడీ . ఈ హెర్బ్ లో అనస్తిటిక్ లక్షణాలు పుష్కలంగా ఉండి, జ్ఞానదంతాల నొప్పినుండి ఉపశమనం కలిగిస్తాయి. మరియు, నోట్లో బ్యాక్టీరియాను నివారించడంలో సహాయపడుతాయి.

జ్ఞానదంతాల నొప్పి ఉన్నప్రదేశంలో కొద్దిగా పుదీనా ఆయిల్ ను అప్లై చేయాల్సి ఉంటుంది. కొద్ది నిముషాలు అలాగేవదిలేసి, తర్వాత గోరువెచ్చని ఉప్పునీటితో శుభ్రం చేసుకోవాలి.

పుదీనా

పుదీనా

ఒక కప్పు వేడి నీళ్ళలో కొన్ని ఎండిన పుదీనా ఆకులను వేసి, ఆవిరిలో బాగా నాననివ్వాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని30 సెకండ్లు అలాగే ఉంచి, తర్వాత ఉమ్మివేయాలి. ఇలా నీరు కాలీ అయ్యేవరకూ చేయవచ్చు.ఈ చిట్కాను రోజులో రెండు మూడు సార్లు అనుసరించవచ్చు.

ఇంగువ

ఇంగువ

ఇది ఒక పురాత హోం రెమెడీజ్ఞానదంతాల నొప్పికి చాలా విరివిగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ మరియు యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ దంతాలనొప్పి నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

ఇంగువ

ఇంగువ

నొప్పి ఉన్న దంతాల మీదకొద్దిగా ఇంగువను అప్లై చేయాలి.

రెండు చెంచాల నిమ్మరసంలో కొద్దిగా ఇంగువను మిక్స్ చేసి , లైట్ గా వేడి చేసి,కాటన్ బాల్ ను అందులో డిప్ చేసి నొప్పి ఉన్నచిగుళ్లు మరియు దంతాల మీద అప్లై చేయాలి.నొప్పి తగ్గే వరకూ రోజులో ఎన్నిసార్లైనా ఇలా చేయవచ్చు.

సేజ్

సేజ్

సేజ్ ఒక సహజనొప్పినివారిణి మరియు జ్ఞానదంతాల నొప్పిని చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఈ హెర్బ్ లో యాంటీ బయోటిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలు కలిగి ఉన్నాయి. ఇది దంతాలనొప్పిని నివారిస్తుంది, దంతక్షయాన్ని అరికడుతుంది, దంతస్రావాన్ని నివారిస్తుంది.

సేజ్

సేజ్

1. ఎండబెట్టి, పొడిచేసిన సేజ్ ను 2చెంచాలను, 1చెంచా ఉప్పును ఒక గ్లాసులో వేయాలి.

2. తర్వాత అందులో విస్కీ లేదా వోడ్కాను పోయాలి.

3. 5నిముషాలు అలాగే ఉంచాలి.

4. ఈ మిశ్రమాన్నినోట్లో పోసుకొని కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత ఉమ్మివేయాలి.

5. దీన్ని తిరిగి నొప్పి తగ్గేవరకూ చేయవచ్చు.

వెనీలా ఎక్సట్రాక్ట్

వెనీలా ఎక్సట్రాక్ట్

వెనీలా ఎక్సట్రాక్ట్ లో తక్కువగా ఆల్కహాల్ ఉంటుంది మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞానదంతాల నొప్పిని నివారిస్తాయి.

వెనీలా ఎక్సట్రాక్ట్

వెనీలా ఎక్సట్రాక్ట్

1. వెనీలా ఎక్సట్రాక్ట్ ను రెండు మూడు చుక్కలను కాటన్ బాల్స్ మీద వేయాలి.

2. నొప్పి ఉన్న ప్రదేశంలో దీన్ని పెట్టాలి.

3. నొప్పి తగ్గేవరకూ రోజులో రెండు మూడు సార్లు దీన్ని ఉపయోగించవచ్చు.

గోధుమ గడ్డి

గోధుమ గడ్డి

గోధుమ గడ్డి మరో నేచురల్ హోం రెమెడీ. జ్ఞానదంతాల నొప్పినివారించడంలో సహాయపడుతుంది. ఇందులో నేచులర్ యాంటీ బయోటిక్, బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది మరియు నోట్లోని టాక్సిన్స్ ను నివారిస్తుంది. నొప్పిని అరికడుతుంది.

గోధుమ గడ్డి

గోధుమ గడ్డి

కొద్దిగా గోధుమ గడ్డిని నోట్లో వేసుకొని నమలాలి, తర్వాత వాటిని ఉమ్మివేయాలి . అవసరం అయినప్పు ఇలా చేస్తుంటే నొప్పిని తగ్గించుకోవచ్చు.

ప్రత్యామ్నాయంగా ,గోధుమ గడ్డి జ్యూస్ ను మౌత్ వాష్ కోసం కూడా ఉపయోగించి, నొప్పిని తగ్గించుకోవచ్చు.

మరికొన్ని చిట్కాలు

మరికొన్ని చిట్కాలు

దవడలకు ఐస్ ప్యాక్ ను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పి నివారించడబడుతుంది

ఆయిల్ పుల్లింగ్ మంచి ఉపాయం.ఓరల్ హెల్త ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది

యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ ను నివారించండి . ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ఘనాహారాలను తీసుకోకూడదు

ఘనాహారాలను తీసుకోకూడదు

రెగ్యులర్ గా దంతాలు మరియు నాలుకను శుభ్రం చేసుకోవాలి. ప్రతి రోజూ పాచిని తొలగించుకోవాలి

షుగర్ క్వాంటిటీ తగ్గించాలి దాంతో ఇన్ఫెక్షన్స్ నివారించవచ్చు.

ప్రతి రోజూ తగినన్ని నీరు తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పిని తగ్గించుకోవచ్చు.

English summary

Home Remedies for Wisdom Tooth Pain


 Wisdom teeth usually appear between the ages of 17 and 25, sometimes even later in life. Called third molars, they are the last or back teeth in each of the four quadrants of your mouth. As wisdom teeth are the last to come in, they may not have enough room in the mouth to grow properly. They may push or get stuck against other teeth and grow at an angle under the gum. This can result in what is known as an impacted wisdom tooth, causing pain, swelling in the gums and irritation.
Desktop Bottom Promotion