For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూత్రపిండాలను సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్నిచిట్కాలు

By Super
|

చాలా మందికి కిడ్నీ వ్యాధులు సైలెంట్ కిల్లర్స్ అన్న విషయం తెలియదు. కిడ్నీ వ్యాధులున్నప్పుడు, పరిస్థితి చాలా తీవ్రతరం అయ్యేంతవరకూ వ్యాధి యొక్క ఎటువంటి లక్షణాలు బయటపడవు.మూత్రపిండాలు రక్తం శుద్ధి అనే కీలక విధులను నిర్వహించడానికి,శరీరంలో విషాన్ని మరియు ఇతర వ్యర్ధాలు తొలగించుకోవటానికి సహాయం చేస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడుట వలన వాటి విధులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. యూరిక్ ఆమ్లం,పాస్పరస్,కాల్షియం మరియు అక్సాలిక్ ఆమ్లం వంటి రసాయనాలు పేరుకుపోవడం వలన రాళ్ళు ఏర్పడటానికి అత్యంత సాధారణ కారణంగా చెప్పవచ్చు.

నేటి రోజులలో ఈ ప్రశ్న చాలా మందిని వేధిస్తూనే వున్నది. మీ కిడ్నీలు శరీరంలో చాలా ప్రధాన అవయవాలు. ఇవి లేకుండా మానవులు జీవించ లెరు. మీకు కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే, ఒక్కసారి భయంకరమైన డయాలసీస్ చేసే పరిస్థితిని ఊహించుకొండి. కనుక కిడ్నీలకు హాని రాకుండా వాటి పోషణ మరియు సంరక్షణ ప్రధానం .మంచి పోషకాలుకల ఆహారం కిడ్నీల ఆరోగ్యానికి సహకరిస్తున్ది. ఈ ఆరోగ్యకరమైన కిడ్నీ ఆహారాలు కిడ్నీ లను ధృడ పరుస్తాయి. మీ కిడ్నీలు ప్రధానంగా శరీరంలో బ్లడ్ ను శుభ్ర పరుస్తాయి. అవి శరీరంలోని మలినాలను జల్లెడ పట్టి బయటకు పంపుతాయి. కనుక మీరు మీ కిడ్నీ లను శుభ్రంగా వుంచుకొవాలి. మరి కిడ్నీ లను శుభ్రం చేసుకోవడానికి ద్రవ పదార్ధాలను అధికంగా తీసుకోవటం మంచి మార్గం.

కనుక తగినంత నీరు తాగటం ఈ ప్రశ్నకు సరైన సమాధానం. కొన్ని చెడు అలవాట్లను వదలివేయటం కూడా కిడ్నీ ల ఆరోగ్యానికి మంచిది. స్మోకింగ్ చేయుట, ఆల్కహాల్ తీసుకొనుట, అధిక ఒత్తిడికి గురి అగుట కిడ్నీలపై అనవసర ఒత్తిడి కలిగిస్తుంది. కనుక కిడ్నీల సంరక్షణకు ఈ అలవాట్లను వదలాలి. మీరు కనుక మీ కిడ్నీ లను ఎలా సంరక్షిన్చుకోవాలో తెలుసు కోవాలంటే దిగువ కల అంశాలను పరిశీలించండి.


నివారణ:
1. మూత్రవ్యవస్థకు ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు రోగి ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి.

2. ఎక్కువగా నీరు, తదితర ద్రవ పదార్థాలను తీసుకోవాలి. క్రాన్ బెర్రీ జ్యూస్ బాగా పనిచేస్తుంది .

How to care for your kidneys

3. రక్తపోటు నియంత్రణ అధిక రక్తపోటు వల్ల పక్షవాతం, గుండెపోటు వస్తుందని చాలా మందికి తెలుసు. కానీ దీని వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయన్నది అంతగా తెలియదు. సాధారణంగా రక్తపోటు 120/80 ఉండాలి. మీ రక్తపోటు ఈ స్థాయి నుండి 129/89 ఉంటే ‘ప్రీ హైపర్‌టెన్సివ్‌' ఉన్నట్లు. అంటే మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతోపాటు, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. రక్తపోటు 140/90, అంతకంటే ఎక్కువుంటే దీని వల్ల కలిగే ప్రమాదాలు గురించి వైద్యునితో చర్చించాలి. రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి.

4. డైట్ కంట్రోల్: మీరు తీసుకొనే ఆహారం మీ చేతుల్లోనే ఉంది, ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి ఆరోగ్యానికి మేలైనవి ఎంపిక చేసుకొని తీసుకొని, తినాల్సి ఉంటుంది. అలాగే ఈ ఆహారాలను తయారుచేసేప్పుడు ఎటువంటి ఫ్లేవర్స్ జోడించకుండా ఫ్రెష్ గా తీసుకోవాలి . అలాగే ముందుగా తయారుచేసి ప్యాక్ చేసిన ఆహారాలను తినడం నివారించుకోవాలి.

How to care for your kidneys

5. స్మోకింగ్ వదలండి సిగరెట్ లలో కాడ్ మియం అనే మెటల్ వుంటుంది. అది మీ కిడ్నీల లైనింగ్ లో డిపాజిట్ అవుతుంది . కిడ్నీల పనిని ఇది మందగిస్తుంది. రీనల్ ఫెయిల్యూర్ కు కూడా దోవ తీస్తుంది.

How to care for your kidneys

6. బాగా నిద్రించండి అలసిన మీ శరీర కణాల పునరుజ్జీవానికి చక్కటి శరీర విశ్రాంతి అవసరం. కనుక బాగా నిద్రించండి. మీ ఇతర శరీర అవయవాల వలెనె, కిడ్నీ లు కూడా అధిక పని చేస్తే అలసి పోతాయి. కనుక ప్రతి రోజూ 8 గంటల పాటు తప్పక నిద్రించండి. దాంతో పాటు బరువును కంట్రోల్ చేసుకోవాలి.
How to care for your kidneys

7. చురుగ్గా ఉండడం శారీరకంగా ఫిట్‌గా ఉండడం.. అంటే క్రమం తప్పకుండా రోజూ 30 నుంచి 45 నిమిషాలు ఏదో ఒక వ్యాయామం చేయడం. దీని వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఫలితంగా మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించొచ్చు.యోగ అభ్యాసం యోగ లోని కొన్ని భంగిమలు కిడ్నీ లు సవ్యంగా పని చేసేలా చెస్తాయి. మీ కిడ్నీల మంచి పని తీరుకు క్రేన్, క్రేసేంట్ లున్గే భంగిమలు రెండూ బాగా పని చేస్తాయి.
How to care for your kidneys

8. సముద్రపు ఉప్పు సముద్రపు ఉప్పు మీ కిడ్నీ లకు మంచిది. దానిలో మినరల్స్ అధికమ్. టేబుల్ సాల్ట్ లో కంటే సి సాల్ట్ లో సోడియం క్లోరైడ్ తక్కువ. కనుక మీరు కనుక కిడ్నీ రాళ్ళతో బాధ పడుతూంటే, సీ సాల్ట్ ఉపయోగించటం చాలా మంచిది.
How to care for your kidneys

9. కొత్తిమీర ఆకులు కొత్తిమీర వాస్తవంలో మీ కిడ్నీలను శుభ్ర పరచేందుకు సహకరిస్తున్ది. కోరియందర్, పార్సిలీ , సిలాన్త్రో లు ఒకే జాతికి చెందినవి. ఇవి కిడ్నీల ఫిల్టర్ లను శుభ్ర పరుస్తాయి. ప్రతిరోజూ ఎండలో 10 నిముషాలు ఉండటం వల్ల శరీరానికి సరిపడా విటమిన్ డి అందుతుంది, ఇది మోనోపాక్ కు దూరంగా ఉండేందుకు సహాయపడుతుంది.
How to care for your kidneys

Desktop Bottom Promotion