For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉబ్బిపోయిన పెదవికి తక్షణ ఉపశమనమెలా?

By Super
|

వాచిన పెదవి వల్ల నొప్పితో పాటు ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. దానికి తోడు రక్తస్రావం, కట్స్ వల్ల తినడం, త్రాగడం చాలా కష్టంగా ఉంటుంది. కనీసం నోరు తెరవడం కూడా కష్టమే.

సాధారణంగా, పెదవికి సంబంధించిన కొన్ని సున్నితమైన టిష్యూలకు గాయాలవడం వల్ల వాపు ఏర్పడుతుంది. అతి తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల కూడా పెదవులు పొడిబారే అవకాశాలు కలవు. పోషకాహార లోపాలు, వైరల్ ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్, కీటకాల కాటు, అలెర్జీలు, నాణ్యత లేని లిప్ కేర్ ప్రోడక్ట్స్ వల్ల కూడా పెదవి వాపు ఏర్పడుతుంది.

పెదవి వాపుకి చికిత్సగా సూచించబడిన మందులను వాడవచ్చు. అయితే, కొన్ని రకాల అద్భుతమైన హోం రెమెడీస్ ని పాటించడం వల్ల త్వరగా సమస్య నుంచి బయటకు వస్తారు. అవేంటో చూద్దాం...

ఒకవేళ, అలెర్జీ, ఆరోగ్య పరిస్థితి, లేదా ఏదైనా తీవ్ర గాయం వల్ల పెదవి వాపు ఏర్పడితే మీరు తక్షణం వైద్యున్ని సంప్రదించాలి.

త్వరగా పెదవి వాపు సమస్యనుంచి బయటపడడం ఎలా?

ఇక్కడ సూచించబడిన పద్దతుల ద్వారా పెదవి వాపు సమస్య నుంచి తక్షణమే బయటపడవచ్చు

కోల్డ్ కంప్రెస్ పద్దతి

కోల్డ్ కంప్రెస్ పద్దతి

పెదవి వాపుని మీరు గమనించిన వెంటనే కోల్డ్ కంప్రెస్ పద్దతిని పాటించండి. నిజానికి, వాచిన పెదవికి తక్షణ చికిత్సగా ఇది సహాయపడుతుంది. పేపర్ టవల్ లో గాని లేదా ఏదైనా బట్టలో కాని కొన్ని ఐస్ క్యూబ్స్ ను వేసి చుట్టివేయాలి. చల్లబడిన బఠానీలను అలాగే చల్లటి స్పూన్ ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. వాచిన ప్రదేశంపై పది నిమిషాల పాటు మీరు ఐస్ క్యూబ్స్ తో సిద్ధం చేసుకున్న టవల్ తో ఒత్తండి. మళ్ళీ కాసేపు విరామం తీసుకుని ఇదే పద్దతిని రిపీట్ చేయండి. వాపు, నొప్పి తగ్గి మీకు ఉపశమనం కలిగేంత వరకు ఇలా పాటించండి. గమనిక: నొప్పి కలగకుండా ఉండేందుకు ఐస్ ను నేరుగా పెదవిపై అప్లై చేయకండి.

ఆలో వెరా

ఆలో వెరా

ఆలో వెరా జెల్ లో వివిధ రకాలైన యాంటి-ఇన్ఫ్లామాటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ మంటను తగ్గించడంతో పాటు వాపుని తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. కీటకం కాటు లేదా దోమ కాటు వల్ల అలాగే అలర్జీల వల్ల కలిగిన వాపుని తగ్గించడానికి ఈ రెమిడీ అత్యుత్తమంగా పనిచేస్తుంది. తాజాగా సేకరించిన అలోవెరా జెల్ ను వాపుకు గురైన పెదవిపై అప్లై చేయండి. పెదవిలోకి జెల్ ఇంకిపోయేంత వరకు జెల్ తో సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయండి.

బ్లాక్ టీ బ్యాగ్

బ్లాక్ టీ బ్యాగ్

టానిన్స్ అనబడే కాంపౌండ్స్ బ్లాక్ టీ లో లభ్యమవుతాయి. ఇవి శ్రేష్టమైన రక్తస్రావ నివారిణులు. ఈ లక్షణం వల్ల ఇవి పెదవిలోని సున్నితమైన టిష్యూల వాపుని తగ్గిస్తాయి. కనీసం పది నిమిషాల వరకు వెచ్చని నీటిలో బ్లాకు టీ బ్యాగ్ ను నానబెట్టాలి. నీళ్ళ లోంచి బ్యాగ్ ను తీసేసి కాసేపు చల్లారనివ్వాలి వాచిన పెదవిపై దానిని పదినిమిషాల వరకు అప్లై చేయాలి తక్షణ ఫలితాల కోసం ఈ పద్దతిని రోజులో అనేక సార్లు పాటించాలి

తేనె

తేనె

తేనెలోనున్న సహజమైన ఔషద గుణాలు అలాగే యాంటిబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వాచిన పెదవికి ప్రభావితమైన చికిత్సగా పనికివస్తాయి. పెదవులకు తగినంత తేమను అందిస్తూ, ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. తద్వారా వాపు, నొప్పి, మంటను తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ తేనెలో కాటన్ బాల్ ను ముంచాలి. గాయానికి గురైన పెదవిపై దీనిని అప్లై చేయాలి. దాదాపు 20 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లని నీటితో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. ఇలా రోజులో మూడు నాలుగు సార్లు చేయాలి

పసుపు

పసుపు

పెదవి వాపును నయం చేయడానికి యాంటిసెప్టిక్ అలాగే ఔషధ గుణాలున్న పసుపు చక్కగా ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్ గు గురవకుండా ఉండేందుకు యాంటి సెప్టిక్ గుణం సహాయపడుతుంది. పసుపుతో హెర్బల్ ఆయింట్మెంట్ ను కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఒక టీస్పూన్ ముల్తానీ మట్టికి కొంచెం పసుపుని కలిపి కొద్దిగా చల్లటి నీటిని జోడించి పేస్ట్ లా చేసుకోండి. ప్రభావిత ప్రాంతంపై దీనిని అప్లై చేయండి. కాసేపు ఆరనిచ్చి ఆ తరువాత గోరువెచ్చని నీటితో పెదవులను శుభ్రపరచండి. వాపుని, నొప్పిని తగ్గించేందుకు రోజులో రెండు సార్లు ఈ పద్దతిని పాటించండి.

 బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

అలర్జీ వల్ల, జ్వరం పొక్కు వల్ల లేదా దోమకాటు వల్ల ఉబ్బిపోయిన పెదవికి బేకింగ్ సోడా రెమెడీ అత్యంత సిఫార్సు చేయదగినది. నొప్పిని అలాగే మంటని తగ్గించడంలో బేకింగ్ సోడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక టీస్పూన్ నీళ్ళలో మూడు టీస్పూన్స్ బేకింగ్ సోడాను మిక్స్ చేసి మందపాటి పేస్ట్ గా తయరుచేయాలి. ఈ పేస్ట్ ను ప్రభావిత పెదవిపై అప్లై చేయాలి. కొద్ది నిముషాలు అలాగే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో కడగాలి. పెదవి వాపు తగ్గేంతవరకు ఇలా కొద్ది సార్లు చేయాలి.

ఉప్పు

ఉప్పు

ఏదైనా గాటు వల్ల పెదవి వాచితే, ఉప్పుని వాడడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు. ఉప్పు సహజసిద్ధమైన క్రిమిసంహారిణి కావడం వల్ల గాటులలో క్రిములు చేరి ఇన్ఫెక్షన్ రాకుండా నివారిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని ఒక కప్పుడు కొద్దిగా వెచ్చని నీటిలోని కలపాలి. ఒక కాటన్ బాల్ ను అందులో ముంచి గాటు పై అప్లై చేయాలి. మొదటగా కొంచెం మంటగా అనిపించినా, ఈ రెమిడీ గాట్లను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. వాపుని తగ్గించడంలో ప్రభావితంగా పనిచేస్తుంది. రోజులో ఒకసారి ఈ పద్దతిని పాటించాలి.


Desktop Bottom Promotion