For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి సీజన్ లో జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడం ఎలా?

|

వేసవి కాలం వచ్చిందంటే చాలా వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టు ముడుతాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్, డయోరియా, మరియు జీర్ణ సమస్యలు. వేసవి సీజన్ మనం తీసుకొనే ఆహారం, మరియు జీవనశైలి మన జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఈ వేడి వాతావరణంలో మీరు చాలా తక్కువగా తినడం మరియు ఎక్కువ వాటర్ త్రాగుతుంటారు.

వేసవి సీజన్ లో వాతావరణం ఎక్కువ వేడిగా ఉండటం వల్ల తర్వాత జబ్బుపడుతుంటారు.

READ MORE: జీర్ణక్రియకు హాని కలిగించి, హార్ట్ బర్న్, ఎసిడిటికి గురిచేసే10 ఆహారాలు

కాబట్టి, మీరు తీసుకొనే ఆహారాల మీద కొంత శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం. మీరు తీసుకొనే ఆహారంలో మీ శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్స్ మరియు న్యూట్రీషియన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ చురుకుగా పనిచేస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలుండవు.

అయితే, ఇప్పటికే మీరు సమ్మర్ హీట్ తో బాధపడుతున్నట్లైతే, మొదటగా గురి అయ్యేది డీహైడ్రేషన్ సమస్య. కాబట్టి, మీ శరీరానికి అవసరం అయినంత నీరు, ద్రవాలు అందిస్తే తప్ప మీ జీర్ణవ్యవస్థను తిరిగి బాగుచేసుకోలేరు.

READ MORE: మీ జీర్ణశక్తిని సహజంగా మెరుగు పరచుకునే౦దుకు 10 ఉపాయాలు..!

కాబట్టి, వేసవిలో జీర్ణ సమస్యను చురుకుగా ఉంచుకొనేందుకు కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ...

శరీరంను ఎల్లప్పుడు తేమగా ఉంచాలి:

శరీరంను ఎల్లప్పుడు తేమగా ఉంచాలి:

వేసవిలో శరీరంను తగినంత హైడ్రేషన్లో ఉంచుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి . కాబట్టి, జ్యూస్ లేదా నీళ్ళు త్రాగుతుండాలి.

ప్రోటీన్ సైజ్:

ప్రోటీన్ సైజ్:

మీరు రెగ్యులర్ గా తీసుకొనే ప్రోటీన్ ఫుడ్స్ వేసవిలో మితంగా తీసుకోవడం వల్ల మంచిది. ఒకే సారి కాకుండా రోజులో మూడు నాలుగు సార్లు తీసుకోవడం వల్ల ఆకలి అరికడుతుంది.

హెల్తీ బ్యాక్టీరియా:

హెల్తీ బ్యాక్టీరియా:

జీర్ణ వ్యవస్థ హెల్తీగా ఉండాలంటే, వేసవిలో సాధ్యమైనంత వరకూ పెరుగు, మజ్జిగ, లస్సీ వంటి చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యను నివారించుకోవచ్చు.

హెర్బ్స్ :

హెర్బ్స్ :

వేసవి కాలంలో మీరు తీసుకొనే రెగ్యులర్ డైట్ లో కొత్తిమీర, సోంపు, కొత్తిమీర మరియు అల్లం వంటి వాటిని తప్పని సరిగా చేర్చుకోవాలి. ఇవి మీ జీర్ణవ్యవస్థను, జీర్ణక్రియలను మెరుగుపరుస్తాయి.

 వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వేసవిలో శరీరంకు అవసరం అయ్యే నీరు మరియు చల్లదనం అందించే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి వాటిలో వాటర్ మెలోన్, ఆపిల్స్ మరియు టమోటోలు తీసుకోవాలి. వీటిలో నీటి శాతం అధికంగా ఉండటం మాత్రమే కాదు, వీటిలో న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి, ఇవి వేడి గాలుల నుండి మీ శరీరాన్ని రక్షిస్తాయి. వేసవిలో ఇలాంటి హైడ్రేటింగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

ఫ్రైడ్ ఫుడ్ నివారించాలి:

ఫ్రైడ్ ఫుడ్ నివారించాలి:

ఫ్రై చేసిన ఆహారాలను నివారించాలి. ముఖ్యంగా వేసవిలో ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ , ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ తినడం తగ్గించాలి . ఇలా చేయగలిగితే వేసవిలో జీర్ణ సమస్యలుండవు.

కారం :

కారం :

అలాగే వేసవిలో సాధ్యమైనంత వరకూ కారం (స్పైసీ ఫుడ్స్ ను)తినడం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి.

English summary

How To Improve Digestion In Summer

wellness, digestion, summer, foods, health, వెల్ నెస్, జీర్ణవ్యవస్థ, వేసవి, ఆహారం, ఆరోగ్యంMost of us do suffer poor digestion in summer. If you closely observe your lifestyle in summer, you may realise the fact that you tend to eat less and drink more due to the thirst and the hot weather.
Story first published: Wednesday, April 29, 2015, 17:08 [IST]
Desktop Bottom Promotion