For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోనోపాజ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు

By Super
|

మోనో పాజ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొనేటువంటి శారీరక మరియు మానసిక మార్పు. మోనోపాజ్ స్త్రీలలో మరియు పురుషుల్లో కూడా ఉంటుంది. మహిళల్లో కొన్ని సంవత్సరాల తర్వాత మోనోపాజ్ దశలో రుతి విరతి,( ముట్లు ఆగిపోడం లేదా పీరియడ్స్ నిలిచిపోడం) జరుగుతుంది. మోనోపాజ్ కు ఇది ఒక ప్రధాన లక్షణం. ఈ విషయం మీరు తెలుసుకొన్నాక ఆశ్చర్యం కలగక మానదు.

ఒక సాధారణ మహిళలు, శక్తివంతంగా మరియు చూడటానికి బలంగా కనపడినా, మహిళ మోనోపాజ్ దశ చేరుకొన్న తర్వాత ఆమెలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. మరియు మోనోపాజ్ దశ చేరగానే గర్భం పొందడం కష్టంగా భావిస్తారు. అందుకే మహిళ్లలో ఒక వయస్సు రాగానే పెళ్ళిళ్లు చేస్తుంటారు. సరైన సమయంలో పిల్లలు కలగాలని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదుర్కోకూడదని పురాతకాలం నుండి పెద్దలు అనుసరిస్తున్న పద్దతి ఇది.

READ MORE:మోనోపాజ్ దశలో మీరు తినకూడని కొన్ని ఆహారాలు

స్త్రీలలో మోనోపాజ్ వల్ల వచ్చే సమస్యలు అందరిలో ఒకేలాగా ఉండకపోవచ్చు. ఓ యాభై శాతం మంది మహిళల్లో మోనోపాజ్ సైతం ఎలాంటి ఇబ్బందుల్ని ఏర్పరచదు. అయితే మిగిలిన వారిలో మాత్రం మోనోపాజ్ దశలోకి ప్రవేశించగానే వివిధ రకాల మానసిక, శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

మెనోపాజ్ లక్షణాలు అనేక విధాలుగా కనపడతాయి.దీనిలో ఎక్కువగా గుర్తించదగిన లక్షణం రుతుస్రావం కొద్దికొద్దిగా అవుతూ ఆగిపోతుంది. ఏదిఏమైన, ఇది మొదలైన నాటినుండి చాలా లక్షణాలు మరియు గుర్తులు కనపడుతూ మెనోపాజ్ దగ్గరలోనే ఉన్నదని తెలుస్తుంది. అవి ఏమిటంటే ఇక్కడ వివరిస్తున్నాము.

శరీరం నుండి వేడి ఆవిర్లు:

శరీరం నుండి వేడి ఆవిర్లు:

ఇది చాలా సాధారణ లక్షణం, ఈ వేడి ఆవిర్లు రుతుక్రమం ఆగిపోవటానికి ఒక సంకేతం. ఈ వేడి ఆవిర్లు హఠాత్తుగా రక్తం ముఖంలోకి లేదా ఛాతీ వేగవంతంగా వోచ్చినట్లుగా ఉంటుంది. ఇది చూపులకు ఎరుపుగా మరియు చెమటగా ఉండి, ముట్టుకుంటే చాలా వేడిగా అనుభూతి చెందుతాం.

తలనొప్పి:

తలనొప్పి:

హార్మోనల్ హెచ్చుతగ్గులు ఈ తలనొప్పులకు కారణమై ఉండవొచ్చు, అందువలన మెనోపాజ్ దశలో మీరు తలనొప్పితో కూడా బాధపడతారు. మీరు ఇంతకుముందే తలనొప్పులతో బాధపడుతున్నట్లైతే, అవి మెనోపాజ్ దశలో ఎక్కువ అవవొచ్చు లేదా మార్పు రావొచ్చు.

నిద్రలేమి:

నిద్రలేమి:

వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు పట్టడం మరియు హార్మోన్ స్థాయిలు అసమతుల్యత వల్ల నిద్రలేమికి కారణం అవుతుంది. అందుకు ప్రతి రోజూ నిద్రపోవడానికి ఒకే టైమ్ లో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రపోవడానికి ముందు టీవీ చూడటం లేదా భోజనం చేయకూడదు. నిద్రించడాకి రెండు గంటల ముందుగానే భోజనం ముగించాలి. వీటితో ఫలితం లేకపోతే, మీలో అలర్జీలు, థైరాయిడ్ సమస్యలు, నిద్రసమస్యలు మరియు ఇతర మరికొన్న సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకు మెడిటేషన్ , టై చి మరియు యోగా వంటివి చేయడం వల్ల కొంత వరకూ సహాయపడుతుంది.

జ్ఞాపకశక్తి తగ్గించేస్తుంది. మెదడు చురుకు పనిచేయకపోవచ్చు

జ్ఞాపకశక్తి తగ్గించేస్తుంది. మెదడు చురుకు పనిచేయకపోవచ్చు

మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతారు లేదా దీర్ఘంగా ఆలోచిస్తుంటారు. ఇది పాక్షికంగా నిద్రలేమి వల్లే కావచ్చు మరియు నిద్రలో మెలుకవల్ల కూడా కావచ్చు. హాట్ ఫ్లాషెస్ కూడా రాత్రుల్లో చెమట పట్టుటకు కారణం కావచ్చు.

మనాసిక స్థితిలో మార్పులు

మనాసిక స్థితిలో మార్పులు

మానసిక మార్పులు తరచుగా PMS తో పాటు ఉంటాయి, ఇవి మెనోపాజ్ తో సంబంధం కలిగి ఉంటాయి. మీరు ఈ సమయంలో చిరాకు, అమితసంతోషం లేదా మానసికంగా క్రుంగిపోవటం వంటి అనుభూతులను పొందుతారు. మీ మానసిక స్థితి ఏదైనప్పటికీ, ఈ మెనోపాజ్ సమయంలో స్పెక్ట్రం యొక్క ఒక చివరి నుండి మరొక చివరికి కదలుతున్నట్లుగా, ఈ అనుభూతులు ఉంటాయి.

వైజినల్ డ్రైనెస్ కు కారణం కావచ్చు:

వైజినల్ డ్రైనెస్ కు కారణం కావచ్చు:

యోని గోడలు సహజంగా కందెన వేసినట్లుగా ఉండి, లైంగిక ప్రేరేపణలో ఎక్కువగా ఉంటుంది. కాని మెనోపాజ్ దశలో ఎండిపోయినట్లుగా ఉంటుంది. హార్మోన్ స్థాయిల మార్పులు మరియు ఈస్ట్రొజెన్ పరిమాణం శరీరంలో తగ్గటం, యోని పొడిగా అవటం వంటి లక్షణాలు అసౌకర్యంగా ఉంటుంది.

లైంగిక వాంఛ లేకపోవడం

లైంగిక వాంఛ లేకపోవడం

హార్మోన్ స్థాయిలు పడిపోయినప్పుడు కామాతురత తగ్గుతుంది. సెక్స్ యొక్క ఆలోచనలు తక్కువగా ఉంటాయి.

ఒక ఇబ్బంది కరమైన లీకేజ్ కు కారణం కావచ్చు

ఒక ఇబ్బంది కరమైన లీకేజ్ కు కారణం కావచ్చు

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడవచ్చు. అంటే మోనోపాజ్ దశలో మహిళ్లో యూరిన్ ట్రాక్ మీద కంట్రోల్ తప్పుతుంది. అది శరీరంలో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల యురెత్రా లైనింగ్ వల్ల వల్ల అలా జరగవచ్చు.

చర్మంలో మార్పులు:

చర్మంలో మార్పులు:

మీ చర్మంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా చర్మం ఎలాసిటి తగ్గిపోతుంది మరియు ముడుతలకు కారణం అవుతుంది. మీచర్మం గతంలో కంటే, మోనోపాజ్ దశలో చర్మం మరింత డ్రైగా మారుతుంది. తక్కువ ఈస్ట్రోజన్ వల్ల చర్మం యొక్క మందం మరియు చర్మలోపలి కొల్లాజెన్ తగ్గుతుంది.

జుట్టు పల్చబడుతుంది:

జుట్టు పల్చబడుతుంది:

మోనోపాజ్ దశలో జుట్టు పల్చబడుతుంది. లేదా ఎక్కువగా జుట్టు రాలడం జరుగుతుంది. అలాగే అవాంచిత ప్రదేశాల్లో లేదా అప్పర్ లిప్ మీద హెయిర్ ను మీరు గమనించవచ్చు.

Desktop Bottom Promotion