For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరమైన ఆహారానికి ఆసక్తికరమైన కొత్త నియమావళి !!

By Super
|

ఆరోగ్యంగా తినడానికి వచ్చేసరికి, జనం పాటించే కొన్ని పురాతన చిట్కాలు వున్నాయి. కానీ, కొన్ని కొత్త మార్పుల వల్ల, పరిశోధనల వల్ల ఆరోగ్యకరమైన కొన్ని కొత్త నియమాలు పుట్టాయి. మీరు తెలుసుకోవలసిన కొన్ని ఆసక్తికరమైన కొత్త నియమాలు ఇవిగో ఇక్కడ ఇచ్చాము.

కారెట్లను తోలుతో సహా తినాలి !!

కారెట్లను తోలుతో సహా తినాలి !!

కారెట్ల నుంచి మరిన్ని పోషకాలు అందాలంటే వాటిని తినే ముందు తోలు వలిచే బదులు శుభ్రంగా కడగండి. కారెట్ తోలు లో కారెట్ లోపల ఉన్నన్ని పోషకాలు వుంటాయి.

చేదుగా వుండే ఆహారాలు తినడానికి అలవాటు పదండి !!

చేదుగా వుండే ఆహారాలు తినడానికి అలవాటు పదండి !!

చేదుగా వుండే వస్తువులు ఏవీ చాలా మంది తినరు. కానీ చేదుగా వుండే కూరగాయలు, పళ్ళు మరిన్ని పోషకాలతో, మరింత రుచితో ఉంటాయని అంటారు. ఉదాహరణకు, కాకరకాయ చేదుగా వున్నా చాలా పోషకాలు కలిగి వుంటుంది, దాంట్లో చాలా విటమిన్లు, ఖనిజాలు కలిగి వుంటుంది.

ఆకుకూరలు దాచే ముందు దాన్ని ముక్కలు చేయండి.

ఆకుకూరలు దాచే ముందు దాన్ని ముక్కలు చేయండి.

మీకు తెలియని ఇంకో చిట్కా ఇదిగో – ఆకుకూరలు తరువాత వాడదామని దాచే ముందు దాన్ని ముక్కలు చేసి వుంచండి అందువల్ల అది మరిన్ని పోషకాలు కలిగి వుంటుంది. ఆకుకూరలు మీ ఇంటికి చేరేసరికి ఇంకా జీవించే ఉంటాయన్న విషయాన్ని చాలా మంది మర్చిపోతారు. ఆకుల్ని దూస్తే అది ఒక రక్షణాత్మక వైఖరి తీసుకుని మామూలు కన్నా నాలుగు రెట్ల అధిక యాంటి ఆక్సిడెంట్ పదార్ధాలను విడుదల చేస్తుంది. దీంతో ఆకుకూరలు మరింత పోషకంగా తయారు అవుతాయి.

ముదురు రంగు లో వుండే కూరలు వాడండి !!

ముదురు రంగు లో వుండే కూరలు వాడండి !!

ముదురు రంగులో వుండే ఆకుకూరలు, పళ్ళు తినడం లేత రంగు వాటి కన్నా మంచి ఎంపిక. ముదురు రంగు వాటిలో ఆంతోసియానిన్ అనే పదార్ధం వుంటుంది, అది మిగతా వాటి కన్నా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.

English summary

Interesting New Rules Of Healthy Eating: Health Tips in Telugu

Interesting New Rules Of Healthy Eating: Health Tips in Telugu. When it comes to eating healthy, there are some age-old tips that many people follow. But new developments and research has led to the creation of new rules of healthy eating. Here are some of the interesting new rules that you should know about.
Story first published: Saturday, July 18, 2015, 12:36 [IST]
Desktop Bottom Promotion