For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి సులభ మార్గాలు

By Super
|

ఆరోగ్యంగా జీవించడానికి మార్గం ఏమిటి? ప్రతి ఒక్కరిలో ఉదయించే పెద్ద ప్రశ్న ఇది. ఆ ప్రశ్నకు సమాధానమే సరైన పౌష్ఠికాహారం. చక్కటి ఆరోగ్యాన్ని ఆశించనివారు ఉండరు. ఆరోగ్యంగా, అందంగా ఉండడం అంత పెద్ద కష్టమేమీ కాదు కాని కాస్త శ్రద్ధ చూప వలసి ఉంటుంది. ఆరోగ్యమే మహా భాగ్యం అనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. ఈ నాటి ఆధునిక యుగంలో, ప్రతి ఒక్కరు ధనార్జనే ధ్యేయంగా పరుగులు తీస్తున్నారు.

ఈ పరుగులలో ఏంతో ముఖ్యమైన ఆరోగ్యం కోసం తీసుకోవలసిన చిన్న చిన్న జాగ్రత్తలని కూడా విస్మరిస్తున్నారు. ఎవరో ఒకరు పక్కన ఉండి మనకి ఆరోగ్యం గురించి శ్రద్ద వహించమని గుర్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎంత సంపాదించినా అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలి. అందుకే, ఆరోగ్యమే మహా భాగ్యం. జీవన శైలిలో కొన్ని మార్పులతో వయసు మరియు లింగభేధాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యం గా ఉండడానికి ఈ క్రింది సూచనలను పాటించండి. ఈ సూచనలతో పాటు రోజువారి జీవితంలో ఆహారపదార్థాలు కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఈ ఆహారపదార్థాలు పోశాకాలతో నిండి ఉన్నాయి మరియు ఇవి మిమ్మలిని తీవ్రమైన వ్యాధుల బారినపడకుండా ఉంచడమే కాకుండా మీ వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టం చేస్తాయి మరియు మీ చర్మం మరియు జుట్టుపట్ల శ్రద్ధ వహించటానికి కూడా పనిచేస్తాయి. మరి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మన దినచర్యలో అనుసరించాల్సిన మార్గాలేంటో ఒకసారి చూద్దాం..

 బ్రెయిన్ : చేపలు

బ్రెయిన్ : చేపలు

సీఫుడ్స్ వల్ల జ్ఝాపకశక్తిని పెంపొందించుకోవచ్చు. అంతే కాదు, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. సీఫిష్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి బ్రెయిన్ సంకోచతను తగ్గిస్తుంది. ఇది మూడు పదుల వయస్సులో మానసిక స్థితి అరోగ్యంగా ఉంటుంది.

స్నేహితులకు దగ్గరగా:

స్నేహితులకు దగ్గరగా:

మంచి స్నేహితులను కలిగి ఉండటం వల్ల కూడా చిరకాలం జీవించవచ్చు అని, కొన్ని పరిశోధలను కూడా నిరూపించాలి. స్నేహితులు భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా కొంత ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అని పరిశోధనల ద్వారా తెలిసింది. స్నేహితులతో ఉన్నప్పుడు, శరీరంలో మంచి రసాయనాలు, సెక్స్ హార్మోన్లు మరియు ఆక్సిటోసిన్ వంటివి ఎక్కువగా విడుదలవుతాయని నిర్ధారించి . ఇవి బ్రెయిన్ డెవలప్ మెంట్ కు మరియు వయస్సును అరికట్టుటకు సహాయపడుతాయని నిర్ధారించారు.

రోజుకు రెండు యాపిల్స్:

రోజుకు రెండు యాపిల్స్:

ఆపిల్స్ తింటే డాక్టర్ల అవసరం ఉండదంటారు. అది అక్షరాల నిజం. ఎందుకంటే యాపిల్స్ తినడం వల్ల, మనస్సు యవ్వనంగా ఉంటుంది. ఆల్జైమర్స్ కోసం జరిపిన పరిశోధనల ద్వారా దీన్ని నిర్ధారించడం జరగింది.

పజిల్స్

పజిల్స్

సుడోకు మరియు క్యాస్ వర్డ్స్ వల్ల మెదడకు పని పెట్టడం వల్ల జ్ఝాపకశక్తి పెరుగుతుంది. చురుకైన మెదడుకు సహాయపడుతుంది

చర్మం కోసం : రైంబో కలర్ ఫుడ్స్ తీసుకోవాలి:

చర్మం కోసం : రైంబో కలర్ ఫుడ్స్ తీసుకోవాలి:

ముదురు రంగు ఆహారాలు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ అనేకం ఉన్నాయి. అందులో ఎల్లో, గ్రీన్, పర్పుల్ మరియు రెడ్ వంటి ఆహారాల్లో అనేక ప్రోటీనులు, న్యూట్రీషియన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి చర్మంలో ముడుతలు ఏర్పకుండా కాపాడుతాయి. యాంటీఆక్సిడెంట్స్ వ్రుద్యాప్య ఛాయలను నివారిస్తాయి. ఎవరైతే ఎల్లో మరియు ఆరెంజ్ వెజిటేబుల్ తీసుకుంటారో వారి యొక్క చర్మం హెల్తీగా మరియు ఆకర్షణియంగా ఉంటుంది!

 వారానికి రెండు సార్లు రతిలో పాల్గొనాలి

వారానికి రెండు సార్లు రతిలో పాల్గొనాలి

వివాహిత జంటలు హెల్తీ సెక్స్ లైఫ్ ను పొందాలి . కనీసం వారంలో రెండు రోజులో రతిలో పాల్గొనడం ద్వారా, మరిన్ని ఎక్కువ రోజులు యంగ్ గా కనబడుతారు. దీని ద్వారా ఒక్క ఒత్తిడి మాత్రమేకాదు, మానసిక,శారీరక సమస్యలను నివారించుకోవచ్చు.

సెక్స్ ఆర్గాన్స్ కొరకు : పాలు

సెక్స్ ఆర్గాన్స్ కొరకు : పాలు

ఒక రోజుకు ఒక గ్లాసు పాలు త్రాగడం వల్ల మహిళల్లో వంద్యత్వం నివారించవచ్చుని హార్వార్డ్ యూనివర్సిటీ పరిశోధన ద్వారా నిర్ధారించబడినది డ్రైరీ ప్రొడక్ట్స్ ఓవేరియన్ ఫంక్షన్స్ కు గొప్పగా సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్ గా ప్రతి రోజు ఒక గ్లాసు పాలు లేదా పెరుగు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం, చీజ్ వంటివి తీసుకోవడం వల్ల ఇన్ ఫెర్టిలిటి సమస్యను నివారించుకోవచ్చు.

ఒత్తిడి తగ్గించుకోవాలి:

ఒత్తిడి తగ్గించుకోవాలి:

మహిళల్లో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండటం వల్ల పీరియడ్స్ లో సమస్యలు ఏర్పడుతాయి. అంతే కాదు, పురుషుల్లో స్మెర్మ్ ఉత్పత్తిలో అవకతవలు మరియు సెక్స్ మీద కోరికలు తగ్గతాయి. ఈ ప్రభావం నుండి బయటపడాలంటే, ఒత్తిడి తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి . మీకు నచ్చిన బుక్స్ చదవడం లేదా టీవీ చూడటం వంటి చేయాలి.

బెల్లీ : మ్యూజిక్

బెల్లీ : మ్యూజిక్

కెనడియన్ పరిశోధనల ప్రకారం మ్యూజిక్ ఎక్కువగా వినేవారిలో విననివారికంటే బరువు తగ్గించుకోవచ్చని నిర్దారించాలి. ఎక్కువ ఎనర్జీ నిచ్చే పాటలు, మ్యూజిక్ వినడం ద్వారా మిమ్మల్ని, మీరు చేసే పనులన్ని ప్రోత్సహిస్తుందని పరిశోధనల ద్వారా వెల్లడైంది. మీరు జిమ్ లో ఉన్నా లేదా వాక్ చేస్తున్నా, మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి.

పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు:

పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు:

శరీరంలో ద్రవాలను సమతుల్యం చేయడానికి ఈ మినిరల్స్ చాలా బాగా సహాయపడుతాయి . కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. కాబట్టి, పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లు, మామిడిపండ్లు, ఆకుకూరలు, టమోటోలు, నట్స్ మరియు ఆస్పరాగస్ వంటి వాటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . వీటిలో ఇంకా అమినో యాసిడ్స్ ఉండటం వల్ల మన శరీరంలో అదనపు ద్రవాలను బయటకు నెట్టివేస్తాయి.

విశ్రాంతి:

విశ్రాంతి:

హార్వార్డ్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం విశ్రాంతి తీసుకొనే టెక్నిక్స్ ను కనుగొన్నారు, యోగ లేదా మెడిటేషన్ వంటివి ఎక్కువ క్యాలరీలను కరిగించవు. కానీ, రన్నింగ్, వాకింగ్ లేదా జిమ్ ద్వారా బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. వరీరంలో కార్టిసోల్ తగ్గడం వల్ల స్ట్రెస్ హార్మోనులు ఎక్కువ ఆకలిని కలిగిస్తాయి. కాబట్టి, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

 పాదాలు: బాల్ థెరఫీ

పాదాలు: బాల్ థెరఫీ

టెన్నీస్ బాల్ మీద కాలు పెట్టి రోల్ చేయడం వల్ల పాదాలకు ఒక మసాజ్ వంటిది . ఇది బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది మరియు పాదాల వద్ద కండరాలను వదులు చేసి, నొప్పిని తగ్గిస్తుంది . ముఖ్యంగా స్ట్రెచ్చింగ్ గోల్ఫ్ బాల్స్ మరియు కూర్చొని చేసే వ్యాయామాలకంటే, నిల్చొని చేసే వ్యాయామల ద్వారా ఎక్కువ ఫలితం పొందవచ్చు.

కళ్ళు: వింటర్లో కూడా కళ్ళ అద్దాలను వేసుకోవాలి

కళ్ళు: వింటర్లో కూడా కళ్ళ అద్దాలను వేసుకోవాలి

కళ్ళకు ఎక్కువ యూవీకిరణాలు ఎక్స్ ఫోజ్ కావడం వల్ల, కళ్ళకు ఎక్కువ హాని కలుగుతుంది. దాంతో రెటీ దెబ్బతింటుంది . దాంతో వయస్సు పెరిగేకొద్ది కళ్ళ సమస్యలు అధికం అవుతాయి. ముఖ్యంగా కాటరాట్స్, వయస్సుతో కూడిన మాస్కులరా డీజనరేషన్ వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. మీకు అవసరం అయినప్పుడు, అవసరం అయిన ప్రదేశాలల్లో సన్ గ్లాస్ ఉపయోగించడం చాలా అవసరం.

 రోజూ కంటి వ్యాయామాలు చేస్తుండాలి

రోజూ కంటి వ్యాయామాలు చేస్తుండాలి

కంటి వ్యాయామాలను రెగ్యులర్ గా చేస్తుండం వల్ల కళ్ల వద్ద కండరాలు వదులవుతాయి. దాంతో కళ్ళ క్రింద చారలు, వలయాలు, ఉబ్బు తగ్గుతుంది. కళ్ళకు ఎక్కువ ఒత్తిడి కలిగించకూడదు. కాబట్టి, వర్కౌట్స్ లో కంటి వ్యాయామాలకు కూడా ప్రాధాణ్యత ఇవ్వాలి.

ముక్కు:

ముక్కు:

బ్లాక్ అయిన ముక్కు మరియు సైనస్ సమస్యలను నివారించుకోవాలి. ఒక వేలితో మీ కనుబొమ్మ మధ్య నొక్కడం తరువాత , మీ నోటి కప్పు వ్యతిరేకంగా మీ నాలుక నెట్టడం ప్రత్యామ్నాయంగా చేయాలి. ఇలా చేయడం వల్ల నాలుక పట్టుకోల్పోవడంతో నాసల్ ప్యాసేజ్ ద్వారా నాసికాంతర ఎముక ముందుకు వెనుకకు రాసుకుంటుంది ఇలా 20సెకండ్లు చేయడం ద్వారా ముక్కు యొక్క రంధ్రాలు ఫ్రీ అవుతాయి. బ్లాకేజ్ ను నివారించుకోవచ్చు.

చెవులు:

చెవులు:

వయస్సు పెరిగే కొద్ది, కంటి చూపు వలే , చెవుకు సంబందించిన సమస్యలు కూడా ఎదురవుతాయి. లోపలి చెవి నుండి మెదడుకు, సౌండ్ మెసేజ్ లు పంపడంలో చెవుడు ఏర్పడుతుంది. అందువల్ల ఎక్కువ సౌండ్ ను వినకుండా అలవాటు చేసుకోవాలి.

దంతాలు: గ్రీన్ టీ

దంతాలు: గ్రీన్ టీ

ప్రతి రోజూ రెగ్యులర్ గా గ్రీన్ టీ త్రాగడం వల్ల , నోట్లో బ్యాక్టీరియాను నివారిస్తుంది. దంతాలను, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.

రోజు పాచి తొలగించుకోవాలి

రోజు పాచి తొలగించుకోవాలి

ప్రతి రోజూ నోట్లో పాచిని తొలగించడం వల్ల నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దంతక్షయం లేదా దంత సమస్యలను నివారించుకోవచ్చు. మరియు ఇతరులు వద్ద ఎటువంటి సమస్యలుండవు.

గుండె: త్వరగా నిద్రపోవాలి

గుండె: త్వరగా నిద్రపోవాలి

హార్వార్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధన ప్రకారం, ప్రస్తుత రోజుల్లో చాలా మంది 7గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోతున్నారు, ఇలా చేయడం వల్ల శరీరంలో బ్లెడ్ ప్రెజర్ లెవల్ తగ్గుతుంది . కాబట్టి, కనీసం 8నుండి ఎనిమిదిన్న గంటల సేపు నిద్రపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలను హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ లను నివారించుకోవచ్చు.

కాళ్ళు

కాళ్ళు

మీ కాళ్ళను ఫ్లెక్సిబుల్ గా మరయు స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. ప్రతి రోజూ ఉదయం పాదాలను స్ట్రెచ్ చేయడం బ్యాలెన్స్ చేయడం చేయాలి . ఇది చాలా సింపుల్ మూమెంట్ . ఇలా చేయడం వల్ల కాళ్ళను బలోపేతం చేయవచ్చు మరియు సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు .

 మోకాళ్ళు:

మోకాళ్ళు:

మోకాళ్ళ నొప్పులు మరియు వాపులు చాలా తీవ్రమైనవి. ఇవి కీళ్ళనొప్పులకు దారితీస్తాయి . ఇన్ఫ్లమేషన్ తో పోరాడే ఆహారాలను తీసుకోవడం ద్వారా ఫ్రీరాడికల్స్ తో పోరాడవచ్చు . అందుకు రెగ్యులర్ డైట్ లో గ్రీట్ టీ, ఫ్యాటీ ఫిష్, ఆలివ్ ఆయిల్, ఆపిల్స్, రెడ్ గ్రేప్స్, వెల్లల్లి, ఆరెంజ్, ఎల్లో ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను, పసుపు, అల్లం చేర్చుకోవాలి.

Desktop Bottom Promotion