For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి సీజన్ లో బెంబేలెత్తించే వడదెబ్బ లక్షణాలు

|

సన్ స్ట్రోక్ (వడదెబ్బ )ఎండకాలంలో సంభవించే వ్యాధి. పరిసరాలలోని అధిక ఉష్ణోగ్రతకు గురికావడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ సరిగా పనిచేయక చెమటలు పోయడం ఆగి, ఉష్ణోగ్రత అధికమై ఇతర లక్షణాలతో బాటు మూర్ఛ, మరణం సంభవిస్తాయి. అందుకు దీన్ని ప్రమాధకర వ్యాధి లేదా ప్రాణాంతక వ్యాధిగా చెబుతుంటారు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం వడదెబ్బ తగిలిన వెంటనే చికిత్స నందించాలని చెబుతుంటారు. సరైన సమయంలో వెంటనే చికిత్సను అందివ్వకుంటే ప్రాణానికే ప్రమాధం. శరీరంలో అధిక వేడి వల్ల కొన్ని అవయవాలు డ్యామేజ్ అయ్యి. జీవక్రియలు పనిచేయకుండా ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది

వేసవిలో ఉష్ణోగ్రత తీవ్రతవల్ల చాలామంది వడదెబ్బ, తలనొప్పి, మూత్రకోశ వ్యాధులు, చర్మవ్యాధులతో బాధపడుతుంటారు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరంలోని నీరు చెమట రూపంలో బైటికిపోయి ఆవిరైపోవడం దీనికి కారణం. దీనితోపాటు నాడీ మండల వ్యవస్థ, రక్తనాళాలు
తమ సహజ స్థితిని కోల్పోతాయి. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడి వ్యాధులకు గురికావలసి వస్తుంది.

వడదెబ్బ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. హీట్ వల్ల అలసట, తిమ్మిర్లు మరియు మూర్ఛవంటి వేడి గాయాలు వంటివి ఎదుర్కొంటుంటారు . కాబట్టి, ఈ వేసవి కాలంలో ఎండకు ఎక్స్ పోజ్ అవ్వడం చాలా ప్రమాధకరం. అదే సమయంలో మీ శరీరానికి తగినంత హైడ్రేషన్ అందకపోతే అది మరింత ప్రమాధకరంగా మారుతుంది. మరి వడదెబ్బ గురించి తెలుసుకొన్నారు కాదా! సన్ స్టోక్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం...

1. చెమటలు పోయడం:

1. చెమటలు పోయడం:

వడదెబ్బకు గురైన వ్యక్తి శరీరం పొడిబారిపోతుంది మరియు చెమటలు పట్టడం ఆగిపోతుంది . వేడి వాతావరణం శరీరం వేడెక్కుతుంది . డీహైడ్రేషన్ కు గురి అవుతుంది . శరీరం మొత్తం నీరు లేకుండా డ్రై అయిపోతుంది.

2. తలనొప్పి:

2. తలనొప్పి:

హీట్ స్ట్రోక్ వల్ల ప్రధానంగా తలనొప్పికి కారణం అవుతుంది . వేసవి కాలంలో అధిక వేడి వల్ల తలనొప్పి అధికంగా ఉంటుంది.

3. శరీరం యొక్క ఉష్ణోగ్రత:

3. శరీరం యొక్క ఉష్ణోగ్రత:

సన్ స్ట్రోకు కు గురి అయిన వారిలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటితే అది చాలా ప్రమాధకరంగా గుర్తించాలి.

4. చర్మ సమస్యలు:

4. చర్మ సమస్యలు:

ఎవరైతే సన్ స్ట్రోక్ కు గురి అవుతారో అలాంటి వారు కొన్ని చర్మ సమస్యలను కూడా ఎదుర్కొంటారు . చర్మం ఎర్రగా మారుతుంది. మరియ శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది.

5. హీట్ రేట్:

5. హీట్ రేట్:

వేసవికాలంలో వడదెబ్బకు గురైన వారిలో హార్ట్ స్ట్రగుల్ అవుతుంది . శరీరంను కంట్రోల్లో ఉంచడానికి చాలా కష్టపడుతంది . హార్ట్ రేట్ క్రమంగా పెరుగుతుంది. గుండె విపరీతంగా కొట్టుకోవడం వల్ల మూర్చపోతుంటారు.

6. వికారం:

6. వికారం:

సన్ స్ట్రోక్ లక్షణాల్లో వికారం కూడా ఒకటి. ముఖ్యంగా పెద్దవారిలో వాంతులకు కూడా దారితీస్తుంది. వేడి కారణంగా వాంతులు అవువడం, తలతిరిగినట్లు అనిపించడం. పరిస్థితి దాటితే కొందరు సొమ్మసిల్లి మూర్చపోతారు.

7. శ్వాసతీసుకోవడంలో సమస్యలు:

7. శ్వాసతీసుకోవడంలో సమస్యలు:

సన్ స్ట్రోక్ గురైన వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు . హీట్ స్ట్రోక్ కు ఇది ఒక లక్షణం.

English summary

Symptoms Of Sun Stroke

A sun stroke is nothing but the inability of the human body to take the heat of the sun. In fact, it is very dangerous and could be life threatening.
Story first published: Tuesday, April 21, 2015, 11:31 [IST]
Desktop Bottom Promotion