For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీహైడ్రేషన్ తగ్గించటానికి 10 ఆరోగ్యకరమైన వేసవి పానీయాలు

By Super
|

వేసవి సమయంలో చెమట రూపంలో ద్రవాల నష్టం జరిగినప్పుడు డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. మీరు బయట పనులు చేసినప్పుడు చెమట అధికంగా పడుతుంది. అంతేకాక వేసవిలో మీరు ఈత మరియు ట్రెక్కింగ్ తో ఆనందించే సమయం. కానీ మీరు మీ శరీరంలో ఒక ఆరోగ్యకరమైన విధానంలో నీటి నిల్వలను మరియు ఎలెక్ట్రోలైట్స్ నిర్వహించాలి.

మీరు వేసవి సీజన్లో ఎక్కువ దప్పికతో శీతల పానీయాలు లేదా కార్బోనేటేడ్ పానీయాల వంటి అనారోగ్య పానీయాలను ఆశ్రయిస్తారు. ఈ పానీయాలు మీకు కేలరీలను జోడించవచ్చు. కానీ చాలా అనారోగ్యంగా ఉంటాయి. మీరు వేసవిలో దాహం తీర్చుకోవటం కొరకు వివిధ ఆరోగ్యకరమైన వేసవి పానీయాల గురించి తెలుసుకోవాలి. ఈ పానీయాలు మీ శరీర ద్రవాలను నింపటమే కాకుండా చెమట రూపంలో కోల్పోయిన వివిధ ఎలెక్ట్రోలైట్స్ ను సరఫరా చేస్తాయి.

READ MORE:సమ్మర్ డీహైడ్రేషన్ నుండి తప్పించుకోవడం ఎలా...

కాబట్టి ఈ పానీయాలను ఇంటిలో ఎలా సిద్దం చేసుకోవాలి? మేము మీకు కొన్ని ఉత్తమ వేసవి పానీయాలను భాగస్వామ్యం చేస్తున్నాం. ఇక్కడ ఇంటిలో తయారుచేసుకొనే కొన్ని ఉత్తమ పానీయాలు ఉన్నాయి. ఒక లుక్ వేయండి.

1. పుల్లటి వాటర్

1. పుల్లటి వాటర్

ఒక గ్లాస్ నీటిలో దోసకాయ ముక్క, కొన్ని పుదీనా ఆకులు మరియు నారింజ ముక్కలను ఉంచండి. ఈ నీటికి పుల్లటి రుచి వస్తుంది. అలాగే విటమిన్ సి కూడా సమృద్దిగా ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన పానీయంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన వేడి దద్దుర్ల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

2. నిమ్మకాయ మరియు పుదీనా పానీయం

2. నిమ్మకాయ మరియు పుదీనా పానీయం

ఒక గ్లాస్ నీటిలో కొన్ని పుదీనా ఆకులు మరియు నిమ్మ ముక్కలు ఉంచి 15 నిమిషాలు మరిగించాలి. అది చల్లారిన తర్వాత తేనే కలపాలి. ఇది వేసవి వేడి మరియు నిర్జలీకరణం నుండి మిమ్మల్ని రక్షించడానికి ఉత్తమ పానీయాలలో ఒకటి.

3. ఆరెంజ్ జ్యూస్

3. ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ నుంచి జ్యూస్ తీసి దానికి చిటికెడు ఉప్పు కలపాలి. ఈ పానీయంలో విటమిన్ సి మరియు ఎలెక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఇది మిమ్మల్ని నిర్జలీకరణ నుండి రక్షిస్తుంది. ఇది ఉత్తమ ఆరోగ్యకరమైన వేసవి పానీయాలలో ఒకటి

4.వెన్నతీసిన పాలు

4.వెన్నతీసిన పాలు

ఈ పానీయంలో ప్రోటీన్లు సమృద్ధిగా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ వేడి వేసవి రోజుల్లో ఇది మీ దాహం మరియు మీ ఆకలి సంతృప్తిని కలిగిస్తుంది. వేసవిలో వేడిని ఓడించటానికి చల్లని వెన్నతీసిన పాలను తీసుకోవాలి.ఇది నిర్జలీకరణ కోసం ఒక సమర్థవంతమైన వేసవి పానీయా రెసిపీగా ఉంది.

5. పెరుగు పానీయం

5. పెరుగు పానీయం

ఒక కప్పు పెరుగులో కొన్ని నీళ్ళు,జీలకర్ర, అల్లం ముక్కలు మరియు చిటికెడు ఉప్పు వేయండి. ఈ పానీయంను తయారు చేయడానికి బాగా కలపాలి. దీనిలో మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్), ఆక్సీకరణ మరియు ఎలెక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది వివిధ రకాల వేసవి అంటువ్యాధుల నుండి మీ శరీరంను రక్షిస్తుంది. అలాగే నిర్జలీకరణము నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

6. పుచ్చకాయ పానీయం

6. పుచ్చకాయ పానీయం

పుచ్చకాయ జ్యూస్ చేయడానికి రెండు స్పూన్ల నిమ్మ రసం మరియు చిటికెడు ఉప్పు కలపాలి. ఇది వేసవిలో అవసరమైన అన్ని ఖనిజాలను మీ శరీరంనకు సరఫరా చేస్తుంది. ఇది మీకు ఒక పరిపూర్ణ వేసవి పానీయంగా ఉంటుంది. ఇది నిర్జలీకరణ కోసం ఒక ఉత్తమ శక్తి పానీయంగా చాలా బాగా పనిచేస్తుంది.

7. రోజ్ పానీయం

7. రోజ్ పానీయం

నీటిలో కొంచెం కుంకుమ పువ్వు మరియు తాజా గులాబీ రేకులు వేసి కొంచెం సేపు మరిగించాలి. రాత్రి పూట అలా ఉంచి మరుసటి ఉదయం కొంచెం తేనే కలపండి. ఈ సీజన్ లో ఉత్తమ వేసవి పానీయా వంటకాలలో ఒకటి.

8. గ్రీన్ టీ

8. గ్రీన్ టీ

వేసవిలో మీ శరీరం నిర్జలీకరణకు గురి అయినప్పుడు టీ త్రాగితే దానిలో కెఫిన్ ఉంటుంది. కానీ గ్రీన్ టీకి మినహాయింపు ఉంది. వేసవిలో గ్రీన్ టీలో నిమ్మరసం కలపటం ద్వారా ఆనందించవచ్చు. మీరు దీనిని చల్లగా త్రాగాలని అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.

9. ఐస్ తో బటర్ మిల్క్

9. ఐస్ తో బటర్ మిల్క్

ఇది మీ దాహం తీర్చటం కొరకు మరియు వేసవిలో అనేక విధాలుగా మీ శరీరానికి ప్రయోజనం కలిగించే ఉత్తమ వేసవి పానీయాలలో ఒకటి. కొంత పెరుగు తీసుకుని దానికి ఉప్పు, కొద్దిగా తేనె, స్ట్రాబెర్రీ గుజ్జు మరియు కొన్ని ఎండిన పుదీనా ఆకులు కలపాలి. వేసవి సమయంలో చల్లగా కావాలని అనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.

10. దోసకాయ మరియు కస్తూరి పుచ్చకాయ పానీయం

10. దోసకాయ మరియు కస్తూరి పుచ్చకాయ పానీయం

ఒక జ్యుసర్ లో దోసకాయ మరియు కస్తూరి పుచ్చకాయ ముక్కలను వేసి జ్యూస్ తీయాలి. దీనికి అర స్పూన్ తేనే మరియు చిటికెడు ఉప్పు కలపాలి. అంతేకాక దానికి కొంచెం జీలకర్ర మరియు తాజా పుదీనా ఆకులను కూడా కలపవచ్చు. ఈ పానీయం మీ శరీరంనకు స్వస్తత మరియు అధిక చెమట పట్టుటను నిరోధిస్తుంది.

English summary

10 Healthy Summer Drinks To Prevent Dehydration

Summer is a time when your body gets exhausted and dehydrated due to the loss of body fluids in the form of sweat. There is an excessive perspiration when you get involved in outdoor activities. Summer is also a time when you enjoy swimming and trekking.
Desktop Bottom Promotion