For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీట్ రూట్ యొక్క 10 తీవ్రమైన దుష్ప్రభావాలు

By Super
|

ప్రకాశవంతమైన రంగులో మార్కెట్లో లభ్యమవుతున్న ఈ కూరగాయ తో చాలా లాభాలున్నాయి.బీట్ రూట్ అనగానే మనం మొదట దాని రంగే చూస్తాము, కానీ ఈ ప్రకాశవంతమైన రంగే కాకుండా దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

బీట్ రూట్ ని అనేక రకాలుగా అనేక ప్రయోజనాలకోసం వాడవచ్చు. బీట్ రూట్ జూస్ ని శక్తి స్థాయిలు పెంచి క్రీడా సామర్ధ్యం మెరుగుపడటానికి వాడతారు. చక్కటి కంటి చూపు కోసం కూడా దీనిని వాడతారు.బీట్ రూట్స్ లో విటమిన్లు,మెగ్నీషియుం మరియు బయో ఫ్లేవనాయిడ్లుంటాయి.

READ MORE: ఆశ్చర్యం కలిగించే బీట్ రూట్ చర్మ సౌందర్య రహస్యాలు

శరీరం లో ట్రై గ్లిజరాయిడ్ల శాతం తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ట్రై గ్లిజరాయిడ్లు తగ్గటం వల్ల రక్తం లోని కొవ్వు కూడా తగ్గుతుంది.శరీరం లో సహజం గా హార్మోనులు ఉత్పత్తి కావడానికి బీట్ రూట్ సహకరిస్తుంది.ఒక్క మాటలో చెప్పాలంటే అనేక రకాల వ్యాధుల నివారణ లో బీట్ రూట్ ని వాడతారు.ఇన్ని సుగుణాలున్నా ఇది కొంచెం ప్రమాదకరం కూడా.

READ MORE: బీట్ రూట్ లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
బీట్రూట్ యొక్క 10 తీవ్రమైన దుష్ప్రభావాలు :

"మెరిసేదంతా బంగారం కాదు".బీట్ రూట్ అధ్భుతం గా ఉన్నా మన ఆరోగ్యానికి మెలే చెయ్యాలన్న నియమం లేదు.దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బీట్ రూట్ దుష్ప్రభావాలు కింద ఇచ్చాము చూడండి.

శరీరం లో ఐరన్ మరియు కాపర్

శరీరం లో ఐరన్ మరియు కాపర్

హెమో క్రొమాటోసిస్ లేదా విల్సన్ వ్యాధి తో బాధ పడేవారు బీట్ రూట్ నీ తిగా తినకూడదు. అతిగా తీసుకోవడం వల్ల శరీరం లో ఎక్కువ స్థయిలో కాపర్ మరియు ఐరన్ నిల్వలు పేరుకుపోతాయి. హెమో క్రొమాటోసిస్ వ్యాధి అంటే శరీరం లో అధిక స్థాయిలో ఐరన్ నిల్వలు పేరుకుకుంటే,విల్సన్ వ్యాధి లో శరీరం కాపర్ ని ఎక్కువగా కోల్పోనివ్వదు.బీట్ రూట్ లో ఐరన్ మరియు కాపర్ పుష్కలం గా ఉండటం వల్ల పైన చెప్పిన రెండూ వ్యాధులనీ ఇది మరింత దిగజారుస్తుంది.

బీటురియా:

బీటురియా:

బ్రిటీష్ మెడికల్ జర్నల్ ప్రకారం జనాభాలో కొంత శాతం మంది మూత్రం ఎర్రగా రావడం మరియు రక్తం ఇంకా ఎర్ర పడటం తో బాధపడతారు.బీట్రూట్ తినడం వల్ల ఇలా జరుగుతుంది.రక్తం మరింత ఎర్రగా మారడాన్ని "బీటూరియా" అంటారు.ఇది పెద్ద ప్రమాదకరం కాకపోయినా దీని సైడ్ ఎఫెక్ట్స్ కొంత మందికి కంగారు పుట్టిస్తాయి.మీ మూత్రం ఎర్రగా వస్తే కంగారు పడకండి, మీ శరీరం లో ఉన్న బీట్రూట్ వల్ల ఇలా జరుగుతుంది.

వికారం మరియు డయేరియా

వికారం మరియు డయేరియా

బీట్ రూట్ వల్ల కొంతమందిలో వికారం మరియు డయేరియా కూడా కలగవచ్చు. బీట్ రూట్ యొక్క గాఢ సారాన్ని బీటైన్ అంటారు.ఇది చాలా సార్లు సైడ్ ఎఫెక్ట్స్ కలగచేస్తుంది.

కిడ్నీ సమస్యలు

కిడ్నీ సమస్యలు

కిడ్నీ వ్యాధి తో బాధ పడేవారు బీట్ రూట్ వాడకాన్ని పూర్తిగా మానెయ్యాలి,బీట్ రూట్ లో ఉన్న బీటైన్ శరీరం లోని కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుంది.కిడ్నీ వ్యాధి గ్రస్తులు బీటైన్ ని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం వల్ల బీటైన్ వల్ల కలిగే ఉపద్రవాలని నివారించవచ్చు.

ప్రెగ్నెన్సీ

ప్రెగ్నెన్సీ

గర్భవతులు బీటైన్ ని తీసుకునె ముందు జాగ్రత్తలు పాటించాలి. ఇది తల్లీ మరియు బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది."మయో క్లినిక్" ప్రకారం ప్రెగ్నెన్సీ సమయం లో గర్భవతులు దీని తీసుకోవడానికి "సీ"(C) రేటింగ్ ఇచ్చారు.అనగా జంతువుల మీద జరిపిన పరిశోధన ప్రకారం ఎదిగే పిండం మీద బీటైన్ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.అనవసర అనర్ధాలు వద్దనుకుంటే ప్రెగ్నెన్సీ సమయం లో బీట్ రూట్ ని పరిమితం గా వాడండి.

రక్తపోటు స్థాయిలని తగ్గిస్తుంది

రక్తపోటు స్థాయిలని తగ్గిస్తుంది

రక్తపోటు స్థాయిలని తగ్గించడం అనే గుణం బీట్ రూట్ యొక్క సహజ లక్షణం. అధిక రక్తపోటు ఉన్న వారికి ఇది వరమే కానీ ఇది అధిక రక్త పోటు ని నియంత్రించే మందులతో కలిసి శరీరం లో రక్తపోటు స్థ్యాయిలని ప్రమాద కర స్థాయికి తగ్గించెస్తుంది.ఒక వేళ మీరు కనుక అధిక రక్త పోటు మందులు వాడుతుంటే కనుక బీట్ రూట్ ని జాగ్రత్తగా తీసుకోండి.

కిడ్నీ లో రాళ్ళు

కిడ్నీ లో రాళ్ళు

బీట్ రూట్ లో ఉన్న అధిక ఆక్సలేట్ కిడ్నీ లో రాళ్ళు ఏర్పడటానికి ఆస్కారమిస్తుంది.మీకు కనుక ఇంతకుమునుపు కిడ్నీ లో రాళ్ళు ఏర్పడిన చరిత్ర ఉన్నట్లయితే కనుక బీట్ రూట్ ని అధికం గా తీసుకోవద్దు.ఇది మీ ఆరోగ్యానికి హానికరం.

కాల్షియం స్థాయిలు

కాల్షియం స్థాయిలు

బీట్ రూట్ రసం శరీరం లో కాల్షియం స్థాయిలని తగ్గిస్తుంది.ఇది అనేక రకాల వ్యాధులకి దారితీస్తుంది.బీట్ రూట్ రసం అధికం గా తాగడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది.కాల్షియం స్థాయిలు తగ్గడం వల్ల అనేక రకాల ఎముకకి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.అందువల్ల ప్రతీసారి నిపుణుడైన వైద్యుడిని సంప్రదించాలి.

స్వర తంత్రి(వోకల్ కార్డ్) సమస్యలు:

స్వర తంత్రి(వోకల్ కార్డ్) సమస్యలు:

బీట్ రూట్ రసం తాగడం వల్ల గొంతులో ఒక రకమిన బిగువు గా అనిపించి మాట్లాడటం కష్టమవ్వచ్చు.బీట్ రూట్ ని అధికం గా తీసుకోవడం వల్ల ఈ సమస్య రావచ్చు.స్వర తంత్రి సమస్య ని నివారించాలంటే బీట్ రూట్ ని ఇతర కూరగాయ ల రసాలతో కలిపి తీసుకోవాలి.

ఇతర సమస్యలు

ఇతర సమస్యలు

బీట్రూట్ రసం తాగిన తరువాత కొంతమందిలో జ్వరం, వణుకు మరియు దద్దుర్లి వస్తాయి. ఈ దుష్ప్రభావాలు చూస్తే భయానకం గా అనిపించవచ్చు కానీ బీట్ రూట్ వల్ల కలిగే లాభాలముందు ఇవన్నీ సముద్రం లో నీటి చుక్క లాంటివి. అందువల్ల బీట్ రూట్ ని మనసారా ఆస్వాదించండీ.ఒకవేళ మీకు కనుక పైన చెప్పిన దుష్ప్రభావాల్లాంటివి ఏమైనా కనిపిస్తే మాత్రం కంగారు పడకుండా వైద్యుడిని సంప్రదిస్తే అంతా సర్దుకుంటుంది. మీకెప్పుడైనా బీట్రూట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలిగాయా?? మీ అనుభవాలని కింద కామెంట్స్ రూపం లో పంచుకోండి.

English summary

Ten Serious Side Effects Of Beetroots : Health Tips in Telugu

10 Serious Side Effects Of Beetroots : Health Tips in Telugu. This bright red vegetable dotting the market has so much to offer! But the first thing that strikes us when we see a beetroot is its color! But, hidden inside that bright color are many health benefits.
Desktop Bottom Promotion