For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయాన్నే ఎలాంటి అలవాట్లు హానికరం

By Nutheti
|

కొన్ని సందర్భాల్లో ఉదయాన్నే కొన్ని పనులు చేస్తుంటాం. నిద్రలేచిన తర్వాత ఏమీ తినకుండా డైరెక్ట్ గా నిమ్మరసం, లవంగం, వెల్లుల్లి తీసుకుంటూ ఉంటాం. ఇలాంటి పనుల వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలున్నాయి. కానీ కొన్నిసందర్భాల్లో నిద్రలేస్తూనే ఖాళీ కడుపుతో చేసే పనులు తీవ్ర అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి. నిద్రపోయే సమయంలో జీర్ణక్రియ జరుగుతుంది. కాబట్టి ఉదయం పొట్టలో ఏమీ ఉండదు. అలాంటప్పుడు కొన్ని పదార్థాలు హాని చేస్తాయి.

READ MORE: ఉదయాన్నేఖాళీ పొట్టతో నీరుత్రాగితే పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

అన్ హెల్తీ హ్యాబిట్స్ వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు మొదలవుతాయి. రోజుని ప్రారంభించే దాన్ని బట్టే రోజంతా మీ మూడ్ ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ఉదయాన్నే తీసుకున్న ఆహారంపైనే ఎనర్జీ లెవెల్స్ డిపెండ్ అయి ఉంటాయి. అందుకే ఉదయాన్నే అల్పాహారం చాలా అవసరం. జ్యూస్ లు వంటివి తీసుకుని శరీరానికి పోషకాలు అందించడం చాలా అవసరం. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో చేయకూడని పనులు ఏంటో చూద్దాం..

మెడిసిన్స్

మెడిసిన్స్

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాతే మెడిసిన్స్ తీసుకోవాలి. ఖాళీ కడుపుతో మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, పొట్టలో గ్యాస్, మంట వంటి సమస్యలు వస్తాయి.

సోడా

సోడా

పరకడుపున సోడా, కూల్ డ్రింగ్స్ తీసుకుంటే ఎసిడిటి లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల వాంతులు, పేగుల్లో ఇరిటేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్

ఉదయాన్నే స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండాలి. తేలిక పాటి ఆహారం తీసుకోవడం వల్ల ఈజీగా జీర్ణమవుతుంది. ఉదయాన్నే స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల అల్సర్ వచ్చే అవకాశముంది.

ఆల్కహాల్

ఆల్కహాల్

పరకడుపునే ఆల్కహాల్ సేవించడం వల్ల పొట్టలో సమస్యలు వస్తాయి. దీని ప్రభావం చాలా వేగంగా చూపిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు దెబ్బతింటాయి.

కాఫీ

కాఫీ

అందరికీ అలవాటే ఇది. ప్రతి ఒక్కరు నిద్రలేవగానే బెడ్ కాఫీకి అలవాటు పడతారు. కానీ ఇది మంచిది కాదు. ఖాళీ కడుపుతో ఉదయాన్నే కాఫీ, టీ తాగడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒత్తిడికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టమోటా

టమోటా

ఉదయాన్నే పరగడుపున టమోటాలు తినకూడదు. వీటిలో ఉండే యాసిడ్స్ పొట్టలో ఉండే యాసిడ్స్ కలిసి అనారోగ్య సమస్యలు తీసుకొస్తాయి.

జిమ్

జిమ్

వర్కవుట్ కి ముందు స్నాక్స్ అయినా తీసుకోవాలి. ఏమీ తినకుండా వర్కవుట్ చేయడం వల్ల బరువు తగ్గడమేగానీ, కండరాల నొప్పులు వస్తాయి.

అరటిపండు

అరటిపండు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి పరకడుపునే అరటిపండ్లు తినకండి.

English summary

Things You Shouldn't Do On An Empty Stomach

We often try to follow certain healthy practices like drinking lemon water on empty stomach or eating a clove of garlic in the morning. Such practices may offer certain health benefits but in this post, let us discuss about what not to do on an empty stomach. During your sleep, your food gets digested and when you wake up, your stomach tends to be vulnerable.
Story first published: Saturday, November 28, 2015, 15:57 [IST]
Desktop Bottom Promotion