For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణాంతక క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ అటాక్ సమస్యల భరతం పట్టే బొప్పాయ సీడ్స్

|

బొప్పాయిలోని ఔషధగుణాల గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే బొప్పాయి కొన్ని వేల సంవత్సరాల నుండి మనకు ఆరోగ్య ఔషధిగా సుపరిచితమైనది. బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు తగుమోతాదులోనున్నాయి.

తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. ఆ జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు వైద్యులు. ఉదరంలోని పేగులు శుభ్రమైతే శరీరం పూర్తిగా శుభ్రంగానున్నట్లే లెక్క. దీంతో శరీరం ఉల్లాసంగా తయారై తనపని తాను చేసుకుంటూ పోతుంటుంది.

READ MORE: బొప్పాయి జ్యూస్: వండర్ ఫుల్ బెనిఫిట్స్

మరి బొప్పాయి కాయలో ఉండే ఔషధగుణాలు విత్తనాల్లో లేవా అంటే ? ఖచ్చితంగా ఉన్నాయనే చేబుతున్నారు, పోషకాహార నిపుణులు. చాలా మందికి ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా ఇది నిజం!విత్తనాలు కూడా తినగలిగినవే. అదేలా అంటే? విత్తనాలను తీసి, ఎండలో ఎండబెట్టి, పొడి చేసి, నిల్వ చేసుకొని, అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు చెప్పలేనన్ని సంఖ్యలో ఉన్నాయి. బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే హార్ట్, కిడ్నీ, లివర్ హెల్త్ కు చాలా మేలు చేస్తాయి. మరిన్ని ప్రయోజనాలను తెలుసుకోవాలంటే...

 లివర్ సిర్రోసిస్:

లివర్ సిర్రోసిస్:

బొప్పాయి విత్తనాలు లివర్ సిర్రోసిస్ వ్యాధికి నేచురల్ రెమెడీ. ఇది లివర్ ను డిటాక్సిఫై చేస్తుంది. బొప్పాయి విత్తనాలను జ్యూస్ రూపంలో రెండు నెలపాటు తీసుకుంటే చాలా ఎఫెక్టివ్ గా లివర్ సిర్రోసిస్ సమస్యను నయం చేస్తుంది.

వైరల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

వైరల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

బొప్పాయి విత్తనాలు కూడా యాంటీ వైరల్ ఏజెంట్ గా పనిచేసి, చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి.

యాంటీ క్యాన్సర్ గుణాలు:

యాంటీ క్యాన్సర్ గుణాలు:

బొప్పాయి విత్తనాల్లో ఉండే శరీరంలో క్యాన్సర్ సెల్స్ మరియు క్యాన్సర్ ట్యూమర్స్ ఏర్పడకుండా నివారిస్తాయి . బొప్పాయి విత్తనాలు కోలన్, బ్రెస్ట్, లుకేమియా, లంగ్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ తో పోరాడుతాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా ఆపుతాయి.

 కిడ్నీ ఫెయిల్యూర్

కిడ్నీ ఫెయిల్యూర్

కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా కాపాడుతుంది: బొప్పాయి సీడ్స్ కిడ్నీ వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు రీనల్ ఫెయిల్యూర్ ను నివారిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

బొప్పాయవిత్తనాల్లోని పెపైన్ అనే ఎంజైమ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి . జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు ప్రోటీన్ జీర్ణం అవ్వడానికి గొప్పగా సహాయపడుతుంది.

ఆర్ధరైటిస్ నయం చేస్తుంది:

ఆర్ధరైటిస్ నయం చేస్తుంది:

బొప్పాయి విత్తనాల్లోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్ధరైటిస్ ను మరియు జాయింట్ డిసీజ్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కడుపు నొప్పి నివారిస్తుంది:

కడుపు నొప్పి నివారిస్తుంది:

గింజల్లో యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంథెల్‌మింటిక్‌ గుణాలు మెండు. అందుకే కడుపునొప్పికీ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకీ వీటిని మందుగా వాడతారు.

బరువ తగ్గిస్తుంది:

బరువ తగ్గిస్తుంది:

మయాన్ నాగరికతలో జనం, బొప్పాయిచెట్టును ఓపవిత్రవృక్షంగా భావించి, పూజించేవారు. అప్పట్లో దాని పేరు 'ద ట్రీ ఆఫ్ లైఫ్ ' యు ఎస్- ఏ లోని అత్యంతసంపన్నులు, ఉదయం పూట అల్పాహారానికి బొప్పాయిని వాడుకునేవారు. నడుము సన్నగా ఉండాలనుకునేవారు బొప్పాయిపండును తీసుకునేవారట. అంటే ఇది డైటింగ్ ఫ్రూట్‌గా పేరు పడింది. బొప్పాయి విత్తనాలతో తయారుచేసిన పౌడర్ వేడినీటిలో వేసి పరడగపున త్రాగడ వల్ల కూడా బరువును తగ్గించుకోవచ్చు.

మలబద్దకం:

మలబద్దకం:

మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. బొప్పాయి సీడ్స్ లోని పపైన్‌ను ట్యాబ్లెట్‌గా రూపొందించి జీర్ణసంబంధ సమస్యలకు మందుగా వాడుతున్నారు.

ప్రేగులోని ప్యారాసైట్స్ (పరాన్నజీవులను)నిర్మూలిస్తుంది:

ప్రేగులోని ప్యారాసైట్స్ (పరాన్నజీవులను)నిర్మూలిస్తుంది:

బొప్పాయ విత్తనాల్లో ఉండే ఆల్కలాయిడ్ కార్పైన్ అనే కంటెంట్ ప్రేగుల్లోని వార్మ్స్(నులిపురుగులను) నిర్మూలిస్తుంది.

Story first published: Tuesday, October 20, 2015, 15:50 [IST]
Desktop Bottom Promotion