For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూపర్ ఫుడ్స్ : క్యాన్సర్ తో పోరాడుతాయి మరియు నివారిస్తాయి

|

క్యాన్సర్ మానవులు మరణానికి ప్రధాన కారణాలలో ఒకటి. క్యాన్సర్ వ్యాధి వస్తే ప్రాణాలు పోవడం ఖాయమనే భావన చాలామందిలో ఉంది. అయితే వ్యాధిని ముందుగా గుర్తిస్తే దాని నుంచి బయటపడటం సాధ్యమేనని అంటున్నారు వైద్యులు. క్యాన్సర్ అంటే ఒకప్పుడు చికిత్సే లేని రాచపుండు. కానీ ఇప్పుడు క్యాన్సర్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. చిన్నపాటి జాగ్రత్తలతో అసలు రాకుండా కూడా నివారించడం సాధ్యమే అవుతుంది. సిగట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం, మద్యం తీసుకోవడం మానేయడం, మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే క్యాన్సర్ రిస్కు ఎంత ఉన్నా దాన్ని చాలావరకు జయించినట్టే.

క్యాన్సర్ ఇప్పుడు గతంతో పోలిస్తే అంత ప్రమాదకరమైన వ్యాధి కానేకాదు. అయినప్పటికీ ఏ వ్యాధికైనా చికిత్స కంటే నివారణ ఎంతో మేలు. పైగా క్యాన్సర్ విషయంలో నివారించుకునే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా నివారించుకోవడం చాలావరకు సాధ్యమే.

పండ్లు... ఆకుకూరలు... ఆహారపదార్థాలు... ఇలా మనం రోజూ తినే పదార్థాలతోనే క్యాన్సర్లను నివారించుకోవడం సాధ్యమా? చాలా సులభంగా సాధ్యమనే అంటున్నారు ఆహారనిపుణులు. ఫలానా ఆహారంలోని నిర్దిష్టమైన పోషకాలు శరీరంలోని వివిధ అవయవాలకు చెందిన క్యాన్సర్ల నివారణకు ఎలా పనిచేస్తాయన్న అంశంపై ‘వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్' ఆధ్వర్యంలో ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన పరిశోధనల్లో కూడా రెగ్యులర్ డైట్ లో పండ్లు మరియు తాజా కూరగాయలు చేర్చుకోవడం వల్ల 5-12శాంతం అన్ని రకాల క్యాన్సర్ల నుండి విముక్తి పొందవచ్చని వెల్లడి చేశారు.

డైట్ ద్వారా క్యాన్సర్ ను నివారించుకోగలమా?ఈ రోజు క్యాన్సర్ కణాలను నాశనం చేసి, క్యాన్సర్ రాకుండా మన శరీరానికి రక్షణ కల్పించే ఆహారాల గురించి ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం..

1. క్యారెట్:

1. క్యారెట్:

శరీరంలో క్యాన్సర్ సెల్స్ ను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. క్యారెట్ లో బీటాకెరోటీన్ పుష్కలంగా ఉంటుంది. మరియు ఇది కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది.

2. కేల:

2. కేల:

ఇది ఒక సూపర్ ఫుడ్ గా భావిస్తాము. ఎందుకంటే ఇందులో నైట్రోజన్ కాంపౌడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ సెల్స్ ను నిరోధిస్తాయి. ఇంకా ఐసియోసినేట్స్, ఫైటోకెమికల్స్ వంటివి ఈ కాలేలో కనుగొనబడినవి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి.

3. బ్రొకోలీ:

3. బ్రొకోలీ:

క్రూసిఫెరస్ వెజిటబుల్స్ జాతిగా పేరుపడ్డ క్యాబేజీ, బ్రకోలీ వంటి శాకాహారాలతో దీన్ని సమర్థంగా నివారించవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్‌లోని యాండర్సన్ క్యాన్సర్ సెంటర్‌లో తేలిన అంశాలను బట్టి విటమిన్-ఇలోని ఆల్ఫాటోకోఫెరాల్ అనే రసాయనం... బ్లాడర్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. మిరియాలు, పాలకూర, బాదంలతో పాటు పొద్దుతిరుగుడునూనె, కుసుమ నూనెలోనూ విటమిన్-ఇ ఎక్కువ.

4. మష్రుమ్:

4. మష్రుమ్:

క్యాన్సర్ తో పోరాడా శక్తి సామర్థ్యాలు మష్రుమ్ లో ఉన్నాయి. అందుకు అవసరం అయ్యే వ్యాధినిరోధకశక్తిని అందిస్తాయి . ఈ మష్రుమ్ లో ఫాలీశాచ్చిర్డ్స్ (ముఖ్యంగా లెంటినాన్)ఇవి చాలా ఫర్ ఫుల్ కాంపోనెండ్స్, వీటి వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది. అలాగే ఇందులో ల్యాక్టిన్ అనే ప్రోటీన్స్ క్యాన్సర్ సెల్స్ ను అటాక్ చేస్తుంది.

5. సీవీడ్స్ :

5. సీవీడ్స్ :

క్యాన్సర్ సెల్స్ ను నివారించే ఒక బెస్ట్ హోం రెమెడీ సీవీడ్స్. సీవీడ్స్ లో బీటాకెరోటీన్, ప్రోటీన్, విటమిన్ బి12, ఫైబర్, మరియు క్లోరోఫిల్ మరియు క్లోరో ఫినాల్స్ మరియు ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉన్నాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ కు విరిద్దుగా పనిచేస్తాయి.

6. స్వీట్ పొటాటో:

6. స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో యాంటీ క్యాన్స్ లక్షణాలు, బీటా కెరోటీన్ వంటివి ఉండటం వల్ల బ్రెస్ట్, గాల్ బ్లాడర్, కిడ్నీ లుకేమియా, లివర్ మరియు లంగ్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

7. అవొకాడో:

7. అవొకాడో:

అవొకాడోలో ఫ్యాట్ ఉంటాయని, ఇవి మరింత బరువును పెంచుతుందని, చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. అయితే, ఈ పండ్లలో క్యాన్సర్ ను నివారించే లుటిన్ ఉండటం వల్ల, ఇది మౌత్ క్యాన్సర్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

8. చిల్లీ పెప్పర్:

8. చిల్లీ పెప్పర్:

వీటిలో క్యాపసైసిన్ అనే కాంపౌడ్ క్యాన్సర్ కు కారణం అయ్యే కణాలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది . ముఖ్యంగా ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

9. ఫింగ్:

9. ఫింగ్:

యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. రోజూ కేవలం రెండు డ్రై ఫిగ్స్ తినడం వల్ల. ఇది యాంటీయాక్సిడెంట్స్ యాక్టివిటి శరీరంలో పెంచుతుంది. ఇది క్యాన్సర్ సెల్స్ తో పోరాడుతుంది.

10. దాక్ష:

10. దాక్ష:

రెడ్ గ్రేప్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, వీటిని రెస్వర్టోల్ అని పిలుస్తారు. ఈ పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గ్రేప్ జ్యూస్ మరియు రెడ్ వైన్ లో కూడా ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు గ్రేట్ గా సహాయపడుతుంది.

11. సిట్రస్ పండ్లు:

11. సిట్రస్ పండ్లు:

నిమ్మ మరియు ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లలో ఐసోమినోన్ అనే అంశం క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తాయి.

12. బొప్పాయి:

12. బొప్పాయి:

బొప్పాయిలో కూడా విటమిన్ సి పుష్లకంగా ఉంది. ఇది యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మరియు క్యాన్సర్ కు కారణం అయ్యే మట్టిలోని లేదా ప్రొసెస్డ్ ఫుడ్స్ నుండి న్యూట్రోసమిన్స్ గ్రహించడాన్ని తగ్గిస్తుంది. ఇంకా బొప్పాయిలోని ఫొలాసిన్ (ఫోలిక్ యాసిడ్)క్యాన్సర్ ను తగ్గిస్తుంది.

13. రాస్బెర్రీ:

13. రాస్బెర్రీ:

అవొకాడోలో ఫ్యాట్ ఉంటాయని, ఇవి మరింత బరువును పెంచుతుందని, చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. అయితే, ఈ పండ్లలో క్యాన్సర్ ను నివారించే లుటిన్ ఉండటం వల్ల, ఇది మౌత్ క్యాన్సర్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

14. టమోటో:

14. టమోటో:

లైకోపిన్ అనే పోషకం ఎక్కువగా ఉండే టొమాటోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. అలాగే పాలీఫీనాల్స్ ఎక్కువగా ఉండే గ్రీన్-టీ, దానిమ్మ కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల వ్యాప్తిని సమర్థంగా అదుపు చేస్తాయి. ఇక క్రూసిఫెరస్ జాతి శాకాహారాలైన బ్రొకోలీ, కాలీఫ్లవర్‌తో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించవచ్చుని చాలా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

15. గోధుమలు:

15. గోధుమలు:

గోధుమల్లో యాంటీక్యాన్సర్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్స్ తో పాటు, ఫైబర్, మరియు ఫైటో ఈస్ట్రోజెన్స్ వంటి కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా తగ్గిస్తాయి.

16. ఫ్లాక్ సీడ్స్:

16. ఫ్లాక్ సీడ్స్:

ఫ్లాక్ సీడ్స్ లో లిగ్నన్స్ కలిగి ఉంటుంది. ఇవి యాంటీఆక్సిడెంట్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది. ఫ్లాక్ సీడ్స్ లో ఫ్యాటీ యాసిడ్స్ కోలన్ క్యాన్సర్ మరియు హార్డ్ డిసీజ్ నుండి రక్షణ కల్పిస్తుంది.

17. డ్రై ఫ్రూట్స్:

17. డ్రై ఫ్రూట్స్:

పాలీఫీనాల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే బ్లూబెర్రీ, విటమిన్-ఇ పుష్కలంగా ఉండే బాదం వంటి ఆహార పదార్థాలతో పాటు... నూనెల్లో పొద్దుతిరుగుడు, కుసుమనూనెలు కాలేయ క్యాన్సర్ నివారణకు దోహదపడతాయి.

18. గార్లిక్:

18. గార్లిక్:

వెల్లుల్లి జాతికి చెందిన ఆహారాలతో పాటు ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్‌నట్, లిన్‌సీడ్ ఆయిల్‌తో మెదడు క్యాన్సర్‌లను నివారించవచ్చు. పైన పేర్కొన్న పదార్థాలు మనిషిలో సాధారణ రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.

19. రోజ్మెర్రీ:

19. రోజ్మెర్రీ:

ఈ మసాలా దినుసు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల డిటాక్సిఫైయింగ్ ఎంజైమ్ ను పెంచుతుంది . రోజ్మెరీ ఎక్స్ ట్రాక్ట్ కార్నసోల్ బ్రెస్ట్ మరియు స్కిన్ ట్యూమర్స్ డెవలప్ మెంట్ ను నివారిస్తుంది.

20. సోయా ప్రొడక్ట్స్:

20. సోయా ప్రొడక్ట్స్:

సోయా ప్రొడక్ట్స్ మరియు టోఫు వివిధ రకాల ఫైటోఈస్టోజెన్ వంటివి బ్రెస్ట్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ ను తొలగిస్తుంది.

21. గ్రీన్ టీ:

21. గ్రీన్ టీ:

గ్రీన్ టీలో లిక్విడ్స్ మరియు కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫిలోఫినాల్స్ క్యాన్సన్ సెల్స్ డెలప్ కాకుండా నివారిస్తుంది.

English summary

Top 21 Foods That Fight And Prevent Cancer

Cancer has become so common in this modern life and every measures are made to curb the disease. This is because we are resorting to more processed foods than organic ones, stress is also a factor. Not taking proper healthy diet including fresh green leafy vegetables and addiction to smoking, drinking alcohol, eating tobacco.
Story first published: Friday, February 20, 2015, 16:51 [IST]
Desktop Bottom Promotion