For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

|

కొలెస్ట్రాల్ .... ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం. గుండె జబ్బులకు మాత్రమే కాకుండా అనేక వ్యాధులకు ఇది కారణమవుతుంది. మరి కొలెసా్ట్రల్‌ తగ్గించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..?
సాధారణంగా ప్రతి ఒక్కరికీ రోజూ 20 గ్రాముల ఫ్యాట్‌ అవసరం అవుతుంది. ఇది రోజూ వంట నూనెలో లభిస్తుంది. ఇది శరీరానికి సరిపోతుంది. కాబట్టి ఇతర ఆహార పదార్థాల్లో అదనంగా లభించే ఫ్యాట్‌ను తగ్గించుకోవడంపై దృష్టి సారించాలి.

సాధారణంగా స్థూలకాయం ఉన్నవారు పొట్ట, నడుం చుట్టూ చేరిన కొవ్వును తగ్గించుకునేందుకు పడరాని కష్టాలు పడుతుండడం మనం చూస్తూనే ఉంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పొట్టలో కొవ్వు వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండెకు సంబంధించినవి, చక్కెర వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. పొట్టలో కొవ్వు చేరడానికి ప్రధాన కారణాలలో హార్మోన్ల అసమతుల్యత, అతిగా తినడం, అధికంగా మద్యం తీసుకోవడం, స్వీట్లు, చాకలెట్లు ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం.

READ MORE: కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 బెస్ట్ ఫుడ్స్!

ఇవి కాక కొవ్వు చేరేందుకు ప్రధాన కారణం ఒత్తిడి కూడా. ఒత్తిడి వల్ల కార్టిసాల్‌ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. కార్టిసాల్‌ అతిగా విడుదలైనప్పుడు అది పొట్ట చుట్టూ కొవ్వు చేరడాన్ని ఉత్తేజితం చేస్తుంది. మరొక ప్రధాన కారణం జీర్ణ ప్రక్రియ సవ్యంగా లేకపోవడం. జీర్ణ ప్రక్రియ సరిగా లేనప్పుడు వాయు సంబంధిత సమస్యలు వచ్చి పొట్ట ఉబ్బరంగా అవుతుంది. వయసు పెరిగే కొద్దీ కాలరీలు ఖర్చు చేయడం తగ్గిపోయి పొట్ట చుట్టూ కొవ్వు చేరడం జరుగుతుంది.

శరీరంలో అధిక కొలెస్ట్రాలె చేరడానికి ప్రధాన కారణం ఒకటి డైట్ మరియు అధిక బరువు. కొలెస్ట్రాల్ ఎవరిలో నైనా అధికం కావచ్చు. అందుకు వయస్సు తో పనిలేదు. చిన్న పెద్ద అందరిలోనూ కొలెస్ట్రాల ఉంటుంది. అది మోతాదుకు మించితే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. కాబట్టి. ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉండాలన్నా, అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలన్నా ఈక్రింది ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి...

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

వంటనూనె ఒకే రకమైనది కాకుండా మార్చుకుంటుండాలి. ఒకసారి రైస్‌బ్రౌన్‌ అయిల్‌ తీసుకుంటే మరొకసారి గ్రౌండ్‌నట్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఇలా మార్చుకుంటూ వాడుకోవాలి.

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

వెల్లుల్లిలో ఐసిన్‌ అనే యాంటి అక్సిడెంట్‌ ఉంటుంది. ఇది చెడు కొలెసా్ట్రల్‌ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో క్లాట్స్‌ ఏర్పడకుండా కాపాడుతుంది.

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

వారంలో రెండు రోజులు చేపలు తినాలి. చేపల్లో ఒమెగా 3 అనే ఫ్యాటీ యాసిడ్‌ లభిస్తుంది. ఇది రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మంచి కొలెసా్ట్రల్‌ పెరిగేలా చేస్తుంది. రక్తనాళాల్లో క్లాట్స్‌ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది.

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

ఆలివ్‌ ఆయిల్‌లో మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇవి చెడు కొలెసా్ట్రల్‌ను తగ్గిస్తాయి. గుండె సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి.

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

గోధుమలో ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా లభిస్తాయి. ఇది చెడు కొలెసా్ట్రల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్‌ కొలెసా్ట్రల్‌తో బైండ్‌ అయి శరీరం నుంచి బయటకు పంపించి వేస్తుంది. ఫైబర్‌ గోధుమలోనే కాకుండా ఓట్స్‌, బార్లీ, రాగి, జోవర్‌లలో కూడా సమృద్ధిగా లభిస్తుంది.

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. పాల ఉత్పత్తులో ఫ్యాటీ యాసిడ్స్‌ యాంటీ అక్సిడెంట్లు, పాలిఫెనాల్స్‌ ఉంటాయి. పాలిఫెనాల్స్‌ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

రోజూ ఒక ఆపిల్‌ తినడం అలవాటు చేసుకోవాలి. ఆపిల్‌లో ఐరన్‌, ఫాస్పరస్‌, కాల్షియం, పొటాషియం, విటమిన్‌-ఎ, బి, సి ఉంటాయి.

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

టీ: టీలో క్యాన్సర్ తో పోరాడే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, బ్లాక్ టీలో ఒక వారం లోపల మీ లిపిడ్ ప్రొఫైల్ మెరుగుపరచడానికి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

అవొకాడో: అవొకాడో తింటుంటే వయసు మీద పడుతున్నా యవ్వనంగానే కనిపిస్తారు. ఇందులో ఫ్యాట్‌ ఎక్కువని చాలా మంది అపోహపడుతుంటారు కాని, అవొకాడోలో ఉండే ఫ్యాట్‌లో ఎక్కువ భాగం మోనో అన్‌సాచురేటెడ్‌ ఫ్యాట్‌బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. అవొకాడో ఇది ఒక పండు, ఇందులో చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు 250 mg మంచి కొలెస్ట్రాల్ ఉంది.

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి సహజమార్గాలు...

క్రమం తప్పకుండా రోజూ అరగంట పాటు వ్యాయామం చేయాలి.

English summary

Way to Lower Cholesterol Naturally: Health Tips in Telugu

Cholesterol can be both your friend and foe. When the cholesterol is at a normal level, it becomes a vital substance for the body's normal functioning. But when it increases, you welcome trouble. They say too much of anything can be bad for health. When there is an increase in cholesterol, your body becomes weak and so does the immune system.
Story first published: Wednesday, July 29, 2015, 18:40 [IST]
Desktop Bottom Promotion