For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

smoking(స్మోకింగ్) ను వెంటనే నిలిపిస్తే బాడీలో జరిగే ఆశ్చర్యకరమైన మార్పులు...

|

స్మోకింగ్ హ్యాబిట్స్- పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ బాగా తెలుసు. అంతే కాదు సిగరెట్లను తయారు చేసిన కంపనీ కూడా వాటిపై రాసి ఉంటుంది. అయినా పొగత్రాగడాన్ని మాత్రం మానలేకపోతున్నారు. దీనికి కారణం ఈ సిగరెట్లో ఉండే నికోటిన్ అనే పదార్దం. ఈనికోటిన్ గుండెకు రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. నికోటిన్‌ వలన శరీరంలో రక్తనాళాలు కుదించుకు పోయి, రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ నికోటిన్ ను శరీరం నుండి బయటకు పంపితే పొగత్రాగడం మానడం ఖాయం.

READ MORE: స్మోకింగ్ హ్యాబిట్స్: అపోహలు-వాస్తవాలు..!

ప్రపంచంలో ధూమపాన ప్రియులు మిలియన్లకొద్ది ఉన్నారు. వీరిలో చాలామంది తమకున్న ధూమపానం అలవాటును మానేయాలనుకుంటూనే ఉంటారు. కాని మానలేకపోతుంటారు. ఏ ఉపయోగంలేని ధూమపానాన్ని అలవాటు చేసుకోకూడదు. ఒక వేళ ఈ అలవాటు వున్నవారు గట్టి మనో నిర్ణయం చేసుకుని మానివేయాలి. అలవాటు ఎక్కువగా ఉండే వారు ధూమపానం మానేస్తే శరీరంలో ఏం జరగుతుంది....

సిగరెట్ త్రాగడం ఆపేసిన 30నిముషాలకు బ్లడ్ ప్రెజర్ తగ్గిపోయి, నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది.

సిగరెట్ త్రాగడం ఆపేసిన 30నిముషాలకు బ్లడ్ ప్రెజర్ తగ్గిపోయి, నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది.

స్మోకింగ్ నిలిపి వెంటనే, శరీరంలో బ్లడ్ ప్రెజర్ నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది. స్మోక్ నిలిపిన తర్వాత శరీరంలో బ్లడ్ ప్రెజర్ తిరిగి యథాస్థితికి రావడానికి కేవలం 30నిముషాలు పడుతుందని గమనించండి.

9 గంటల్లో, ఆక్జిజన్ లెవల్స్ పెరుగుతాయి:

9 గంటల్లో, ఆక్జిజన్ లెవల్స్ పెరుగుతాయి:

9 గంటల్లో మీ రక్త ప్రవాహంలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ (ఒక విష వాయువు) స్థాయిలు సగానికి పడిపోటం మరియు ఆక్సిజన్ స్థాయిలు సాధారణ స్థితికి చేరుకుంటాయి.

రెండు రోజుల తర్వాత ఏం జరుగుతుంది:

రెండు రోజుల తర్వాత ఏం జరుగుతుంది:

నలభైఎనిమిదది గంటల్లో గుండెపోటు కలిగించే అవకాశాన్ని తగ్గిస్తుంది. మీశరీరంలోని నికోటిన్ మొత్తం శరీరం నుండి బయటకు పంపబడుతుంది. మీరు తినే ఆహారంలో రుచి మరియు వాసన వంటివి మీలో తిరిగి సాధారణ స్థాయి చేరుకుంటాయి.

 30డేస్ తర్వాత:

30డేస్ తర్వాత:

శరీరంలో ఊపిరితిత్తులు మరియు శ్వాసనాళాలు శుభ్రపడి రిలాక్స్ అవుతాయి. దాంతో ఊపిరితిత్తులకు ఎక్కువ ఆక్సిజన్ అందివ్వబడుతుంది . దాంతో శరీరం మొత్తం ఆక్సిజన్ సరఫరాకు సహాయపడుతుంది.

రెండు వారాల తర్వాత:

రెండు వారాల తర్వాత:

రెండు వారాల్లో మీ శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది అలాగే మరో పది వారాల పాటు చాలా మెరుగ్గా కొనసాగుతుంది. దాంతో శరీరంలోని ఇతర అవయవాలకు బ్లడ్ సర్కులేషన్ మరింత మెరుగ్గా జరుగుతుంది. దాంతో అలసట అనిపించదు మరింత ఎనర్జింటిక్ గా కనబడుతారు.

8 నుండి 9 నెలల తర్వాత:

8 నుండి 9 నెలల తర్వాత:

ఎనిమిది నుండి తొమ్మిది నెలల్లో పొగత్రాగడవ వల్ల వచ్చే దగ్గు, శ్వాసలో మరియు శ్వాస సమస్యలు తగ్గించి ఊపిరిత్తుల సామర్థ్యం 15%కు మెరుగుపరుస్తుంది.

ఒక సంవత్సరం తర్వాత:

ఒక సంవత్సరం తర్వాత:

ఒక సంవత్సరంలో గుండెపోటు మరియు స్ట్రోక్ ను కలిగించే ప్రమాదాన్ని మీ నుండి సగానిక తగ్గిస్తుంది. శరీరంలోని రక్తనాళాలు ఆక్సిజన్ ను తిరిగి పొందడానికి నార్మల్ ఫ్లెక్సిబిలిటిని కలిగి ఉంటుంది.

5 ఏళ్ల తర్వాత:

5 ఏళ్ల తర్వాత:

స్మోక్ చేయని వారిలో హార్ట్ మరియు బ్రెయిన్ సురక్షితంగా ఉంటుంది. అదే విధంగా హెల్తీ లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేయడంవల్ల హార్ట్ అటాక్ మరియు స్మోన్ ను క్రమంగా తగ్గించుకోవచ్చు.

10ఏళ్ల తర్వాత:

10ఏళ్ల తర్వాత:

10 ఏళ్లలో లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్, పొగ త్రాగని వాళ్లకు వచ్చే లంగ్ క్యాన్సర్ రిస్క్‌తో సమానంగా ఉంటుంది. అంతే కాదు లంగ్ క్యాన్సర్ రక్షణ కలిగిస్తుంది . కాబట్టి స్మోకింగ్ అలవాటు ఉన్నవారు వెంటనే స్మోక్ నిలిపేసి, హెల్తీ లైఫ్ స్టైల్ తో ఆరోగ్యాన్ని , ఆయుష్యును కాపాడుకోండి.

English summary

What Happens To Your Body When You Stop Smoking

What Happens To Your Body When You Stop Smoking, Health Tips in Telugu, "Quit smoking", is that everyday thing that most smokers are advised from their near and dear ones. To be honest, it is really difficult to quit smoking for some, as they mentally and physically become addicted to it over a period of time. In medical terms this is called "dependence".
Story first published:Wednesday, November 25, 2015, 18:20 [IST]
Desktop Bottom Promotion