For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్సర్ సైజ్ ఎప్పుడు చేయాలి ? ఎప్పుడు చేయకూడదు ?

By Nutheti
|

జీవితంలో నిత్యం చేయాల్సిన పనుల్లో వ్యాయామం చాలా ముఖ్యమైనది. వ్యాయామం వల్ల శరీరం ఫిట్ గా, యాక్టివ్ గా ఉంటుంది. తాజా అధ్యయనాల ప్రకారం వాకింగ్ కి గానీ, జిమ్ కి గానీ సాయంత్రం వెళ్తే మంచిదని సూచిస్తున్నాయి. అయితే ఉదయం చేసే ఎక్స్ సైజ్ మంచిది కాదని అనుకోకండి. అయితే సాయంత్రం చేసే వ్యాయామం వల్ల మరింత లాభాలు పొందుతారని చెబుతున్నాయి.

READ MORE: రెగ్యులర్ గా వ్యాయామం చేయడానికి గల ముఖ్య కారణాలు

పనివేళల తర్వాత వ్యాయామం చేయడం వల్ల శరీరం చాలా ఫిట్ గా ఉంటుంది. వ్యాయామం చేయాలని ప్లాన్ చేసుకునే వాళ్లు సాయంత్రంపూట ప్రణాళిక వేసుకోవడం మంచిది. అంతే కాదు ఎప్పుడు వ్యాయామం చేయాలి ? ఎప్పుడు వ్యాయామం చేయకూడదో తెలుసుకుంటే మంచిది. ఎక్సర్ సైజ్ లు చేయడం మొదలు పెట్టాలనుకునేవాళ్లు ఈ కింది టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి.

మధ్యాహ్నం

మధ్యాహ్నం

మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ స్వెట్ లేదా చెమట బయటకు వస్తుంది.

ఉదయం

ఉదయం

ఉదయం ఏ సమయంలో వ్యాయామం చేయాలా అని కన్ఫూజన్ లో ఉందా ? ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో వ్యాయామం చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ సమయంలో చేయడం వల్ల శరీరం యాక్టివ్ గా, జీవక్రియ సజావుగా సాగుతుంది.

జలుబు

జలుబు

జలుబు చేసినప్పుడు ఎక్సర్ సైజ్ చేయవచ్చా ? అంటే ఖచ్చితంగా చేయకూడదని చాలామంది భావిస్తారు. కానీ జలుబుతో బాధపడుతున్నప్పుడు వ్యాయామం చేయడం వల్ల దానికి కారణమయ్యే ఇన్ఫెక్షన్స్ నిరోధించబడి, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

రుతుక్రమం సమయంలో

రుతుక్రమం సమయంలో

రుతుక్రమం సమయంలో వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పొట్టలో క్రాంప్స్ తగ్గుతాయి.

అలసిపోయినప్పుడు

అలసిపోయినప్పుడు

శరీరం అలసిపోయినప్పుడు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. అదే సరైన సమయం. 30 నిమిషాల వ్యాయామం వల్ల రక్త ప్రసరణ పెరిగి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల అలసట పోయి.. నూతనోత్తేజం వస్తుంది.

కండరాల నొప్పి

కండరాల నొప్పి

ఎప్పుడు, ఏ సమయంలో ఎక్సర్ సైజ్ చేయకూడదో బిగినర్స్ తెలుసుకోవాలి. నొప్పి ఉన్నప్పుడు, వాపు ఉన్నప్పుడు వ్యాయామం చేయకుండా ఉండటం మంచిది. బలవంతంగా వ్యాయామం చేస్తే.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

భోజనం తర్వాత

భోజనం తర్వాత

భోజనం తర్వాత వ్యాయామం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే పేగులపైనా ప్రభావం పడుతుంది.

English summary

When To Exercise & When Not To!: Exercise tips: Exercise rules

Exercising everyday should be an important part of your life. Exercising helps keep your body fit and active. According to a new study, one should go to the gym or take a brisk walk in the evening rather than early hours of the morning.
Story first published: Saturday, November 28, 2015, 15:58 [IST]
Desktop Bottom Promotion