For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: వేసవిలో త్వరగా పాడయ్యే ఆహారాలు

|

ప్రపంచ ఆరోగ్య దినోత్సవను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 7న నిర్వహించబడుతుంది0. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటి సారిగా ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని జరిపింది. ఈ సమావేశంతో 1950 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినం రోజున జరుపుతుంది. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ భయాందోళన చెందుతున్న ప్రాధాన్య రంగాన్ని ఎత్తి చూపడానికి నిర్దిష్ట ఆరోగ్య అంశంపై చైతన్యాన్ని కలిగించడానికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుతున్నారు. ప్రతీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేస్తుంది.

సహజంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎంత సంపాదించినా ఆరోగ్యంగా లేకుంటే అది నిష్ర్పయోజనం. ఆరోగ్యానికున్న ప్రాధాన్యత అలాంటిది మరి. అందుకే ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) హెచ్చరిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సంస్థ అనారోగ్యానికి దారి తీసే ప్రధాన అంశాల మీద అంతర్జాతీయ, దేశీయ, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిల్లో ఏప్రిల్‌ 7న వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రజల ఆరోగ్యంతో పాటు వాటిపై దుష్ర్పభావం చూపే వాటిని నిరోధించే అంశంపై కూడా డబ్యుటిఓ వివిధ దేశాలకు సూచనలు చేస్తుంది.

అలాంటి ప్రపంచ ఆరోగ్యదినోత్సవం రోజును మనం కూడా ఏదైనా చేయాలి. ముఖ్యంగా వేసవి కాలంలో పిక్ నిక్స్, టూర్లు అంటూ చాలా మంది ఎక్కువగా బయట గడపడానికి ఇష్టపడుతారు. అయితే ఇలాంటి ఆహ్లాదకరమైన సమయంలో మన మనస్సును మార్చేసేది, స్పాయిల్ చేసది ఆహారమే. బయటకానీ, ఇంట్లో కానీ మనం తీసుకొనే ఆహారం భాగోలేకపోతే అది మన ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

కాబట్టి, ఈ సమ్మర్ సీజన్ లో రిఫ్రిజరేటర్ లేని వారు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను నివారించాల్సి ఉంటుంది. ఉదా: పాలు. వేసవికాలంలో పాలను బాగా మరిగించి పెట్టినా కూడా సాయంత్రకల్లా పాడైపోతాయి. కాబట్టి, ఇలాంటి హెల్తీ ఫుడ్స్ , మీకు నచ్చిన ఫుడ్స్ ను ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన ఫుడ్స్ ను వేసవికాలంలో ఇష్టంగా తినాలంటే అందుకు రిఫ్రిజరేటర్ ఉంటే బెటర్. అలా కాకుండా వేసవికాలంలో చాలా త్వరగా పాడైపోయేవాటిని, రిఫ్రిజరేటర్ లేనివారు నిల్వ చేయకుండా మరియు అప్పటికప్పుడు ఖాలీ చేయడం లేదా వాటిని తినకుండా నివారించడం ఉత్తమం. ఇలాంటి ఆహారాల్లో మంచి బ్యాక్టీరియాలుండి , అవి హీట్ కు పెరుగుగా మార్చేస్తాయి . కాబట్టి, ఇలాంటి ఆహారాలను చల్లని ప్రదేశాల్లో నిల్వచేయడం వల్ల మంచి బ్యాక్టీరియాను పొందవచ్చు . మరి వేసవిలో అతి త్వరగా స్పాయిల్ అయ్యే ఆహారాలేంటో ఒక సారి ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

1. పాలు:

1. పాలు:

లాక్టోబాసిల్లస్ ' అని పిలువబడు బ్యాక్టీరియా వేసవికాలంలో చాలా చురుకుగా మరియు బహువిధాలుగా త్వరగా ఆహారాలను పెరుగుగా మార్చేస్తుంది . ఈ కారణం చేతనే వేసవికాలంలో చాలా త్వరగా పాలు పాడవుతాయి.

2. బటర్:

2. బటర్:

వేసవికాలంలో చాలా త్వరగా పాడయ్యే మరో ఆహారం బటర్ . మీరు కనుక బటర్ ను చల్లని వాతావరణంలో ఉంచకపోతే పాడైపోతుంది.

3. రోటీస్:

3. రోటీస్:

వేసవిలో త్వరగా పాడైయ్యే ఆహారాల్లో రోటీలు కూడా ఒకటి. రోటీలను తయారుచేసి వెంటనే హాట్ బాక్స్ లో వేయడానికి ముందే వాటిని చల్లారబెట్టి తర్వాత స్టోర్ చేయండి.

4. దాల్ :

4. దాల్ :

వేసవిలో వాతావరణంలో వేడి వల్ల పప్పు చాలా త్వరగా పాడవుతుంది. కాబట్టి, దాల్ తయారుచేసేప్పుడు అందులో ఒక చిన్న ముక్క అల్లం వేయడం వల్ల పప్పు త్వరగా పాడవకుండా ఉంటుంది.

5. వాటర్ మెలోన్:

5. వాటర్ మెలోన్:

సమ్మర్ ఫ్రూట్ గా పిలుచుకొనే పండు పుచ్చకాయ. నీటిశాతం ఎక్కువగా ఉండే ఈ పుచ్చకాయను సరిగా భద్రపరచుకోకపోతే త్వరగా పాడవుతుంది. కాబట్టి, తినగా మిగిలిన భాగంను ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి. బయట ఉంటే త్వరగా పాడవుతుంది.

6. కోకనట్ కర్రీలు:

6. కోకనట్ కర్రీలు:

కొబ్బరి ఉపయోగించిన కర్రీలు, వంటలకు ఇది మంచి ఫ్లేవర్ ను అందించిన, వేసవికాలంలో చాలా త్వరగా కర్రీలు పాడవుతుంది.

7. చట్నీలు:

7. చట్నీలు:

ఉదయం అల్పాహారం దోసె మరియు ఇడ్లీలకు కాంబినేషన్ గా తయారుచేసుకొనే చట్నీలు త్వరగా పాడవుతాయి. వీటిలో కూడా కొబ్బరిని ఉపయోగించడం వల్ల త్వరగా పాడవుతాయి. అందుకే వీటిని తయారుచేసినప్పుడు అవసరం అయ్యేంత పక్కకు తీసి మిగిలినది ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. లేదా చల్లని ప్రదేశంలో పెట్టాలి.

8.నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు:

8.నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు:

కూరగాయల్లో నీటిశాతం ఎక్కువగా ఉన్నవి చాలానే ఉన్నాయి . వీని చల్లని వాతావరణంలో స్టోర్ చేసుకోవాలి. టమోటో, గార్డ్స్, గుమ్మడి వంటివి వేసవిలో త్వరగా పాడవుతాయి.

9. పెరుగు:

9. పెరుగు:

వేసవికాలంలో శరీరం చల్లగా ఉండాలంటే పెరుగును తప్పని సరిగా తీసుకోవాలి. అయితే పెరుగును సరిగా నిల్వచేయకపోతే త్వరగా పడావుతుంది.

10. పాస్ట్రీస్:

10. పాస్ట్రీస్:

వేసవిలో నోరూరించే పాస్ట్రీస్ లో క్రీమ్ అధికంగా ఉండటం వల్ల వేసవికాలంలో వేడికి త్వరగా పాడవుతాయి. కాబట్టి, ఫ్రిజ్ లో ఉంచాలి.

11. చికెన్:

11. చికెన్:

వేసవికాలంలో త్వరగా పాడయ్యే ఆహారాల్లో చికెన్ కూడా ఒకటి . మితంగా వాడుకోవడం మంచిది.

12. ఆరెంజ్:

12. ఆరెంజ్:

వేసవిలో త్వరగా పాడయ్యే ఆహారాల్లో ఒకటి ఆరెంజ్ . ఈ ఫ్రూట్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల త్వరగా పాడవుతాయి.

English summary

World Health Day Spcl: Foods That Spoil Easily In Summer

We all look forward to the summer season as it is the best time of the year to step outdoors for a picnic. However, out of all the good benefits we seek from a nice summer there is one thing which always spoils our mood, which is food!
Desktop Bottom Promotion