పచ్చి అరటి పండ్లు తినడం వల్ల పొందే 10 అద్భుతమైన ప్రయోజనాలు..!!

పచ్చి అరటికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది. పచ్చిఅరటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న

Posted By:
Subscribe to Boldsky

అర‌టి పండును అలుసుగా చూడ‌కండి. అర‌టిలో అనేక పోష‌క విలువ‌లు ఉన్నాయి. ఈ పండు తింటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించ‌వ‌చ్చు అని వైద్యులు చెబుతున్నారు. సంస్కృతంలో కదళి ఫలంగా పిలిచే అరటిపండు ఎన్నో ఉపయోగాలకు పుట్టినిల్లు వంటిది. ఒకప్పుడు ప్రతి పెరడులోను ఈ చెట్టు కనిపించేది. కేవలం పండు మాత్రమే కాదు అరటికాయ కూడా ఒంటికి ఎంతో మేలు చేస్తుంది. అరటి ఆకులో భోజనం చేస్తే తిన్నది చక్కగా అరిగి జీర్ణ సంభందిత వ్యాధులు దగ్గరకి కూడా రావు అని పెద్దలు చెప్పే వారు. అరటి పండులోనే కాదు, పచ్చి అరటికాయలో కూడా అనేక ప్రయోజనాలున్నాయి.

10 Amazing Benefits And Uses Of Green Bananas

సాధారణంగా పచ్చి అరటికాయలను ఉడికించి, లేదా ప్రొసెస్ చేసి లేదా ఫ్రై చేసి తింటుంటారు. పచ్చి అరటి పండ్లతో వివిధ రకాల టేస్టీ డిష్ లను కూడా వండుతుంటారు. అరటికాయ బజ్జీ, అరటితో గ్రేవీలు, కర్రీస్ ను కూడా తయారుచేసుకుంటుంటారు. ఉడికించినవి ఆరోగ్యానికి మరీ మంచిది, పచ్చి అరటికాయతో కేరళాలో చిప్స్ ను తయారుచేస్తుంటారు. ఎల్లో బనానాలు తిన్న విధంగానే పచ్చి అరటిపండ్లు తినడం వల్ల ఎనర్జిటిక్ గా ఉండటమే కాదు.. ఇమ్యునిటీ పెరుగుతుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు

పచ్చి అరటికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది. పచ్చిఅరటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న అరటిని రోజుకి ఒకటైన తినటం అలవాటుగా మార్చుకుంటే ఎన్నో వ్యాధులు రాకుండా చెక్ పెట్టచ్చు. ఉదాహరణకు కొన్ని ప్రయోజనాలు మీకోసం ఈ క్రింది విధంగా...

జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం నివారిస్తుంది:

గ్రీన్ బనానాలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి, బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది. దాంతో మలబద్దక సమస్య ఉండదు. రోజుకు 3.6గ్రాముల ఉడికించిన బనాన తినడం వల్ల జీర్ణవ్యవస్థకు అవసరమయ్యే ఫైబర్ పొందుతారు.

శరీరంలో ఫ్యాట్ చేరకుండా, ఇన్సులిన్ సెన్సివిటి తగ్గిస్తుంది:

పచ్చి అరటి పండ్లలో ఉంటే స్ట్రార్చ్ ప్రేగుల్లో చేరడం వల్ల మెటబాలిజం రేటు చురుగ్గా ఉంటుందని, దాంతో పాజిటివ్ హెల్త్ బెనిఫిట్స్ ను పొందుతారని నిపుణులు వెల్లడింస్తున్నారు. పచ్చి అరటి పండ్లలో ఉండే స్ట్రార్చ్ కంటెంట్ శరీరంలో ఫ్యాట్ నిల్వచేరకుండా, ఇన్సు లిన్ మీద ప్రభావం చూపకుండా సహాయపడుతుంది . ప్లాస్మా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిస్తుంది.

. నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

పచ్చి అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థను చురుగ్గాపనిచేయడానికి , మజిల్ మూమెంట్స్ ను మెరుగుపరచడానికి , కిడ్నీలలో రక్తం ప్యూరిఫై చేయడానికి పొటాషియం చాలా అవసరం అవుతుంది.

న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి:

శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ పచ్చి అరటి పండ్లలో అధికంగా ఉంటాయి. ఇవి శరీరం మొత్తం ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

ప్రోబయోటిక్ బ్యాక్టీరియా:

పచ్చి అరటికాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి మంచి బ్యాక్టీరియాను (ప్రోబయోటిక్స్ )ను అందిస్తుంది. ఈ బ్యాక్టీరియా ప్రేగుల్లో ఉంటాయి. పచ్చి అరటిపండ్లు తినడం ద్వారా పొట్టలో మంచి బ్యాక్టీరియా ఏర్పడటానికి సహాయపడుతుంది. మంచి బ్యాక్టీరియా తిన్న ఆహారంను తేలికగా జీర్ణమవ్వడానికి సహాయపడుతాయి.

విటమిన్స్ కు పవర్ హౌస్ వంటిది:

పచ్చి అరటి కాయలో వివిధ రకాల విటమిన్స్ ఉన్నాయి . ముఖ్యంగా విటమిన్ బి6, విటమిన్ సిలు అధికంగా ఉన్నాయి . హెల్తీ బాడీని మెయింటైన్ చేయడానికి ఈ విటమిన్స్ చాలా అవసరం అవుతాయి.

డయేరియా నివారిస్తుంది:

పచ్చిఅరటిపండ్ల డయేరియా తగ్గించడంలో గ్రేట్ రెమెడీ. వీటిని తినడానికి ముందు బాగా ఉడికించాలి. డయేరియా బ్యాక్టీరియాసిడల్, వైరల్, ప్యారాసిటిక్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. వికారం, వాంతులు, అలసట, పొట్ట ఉదరంలో నొప్పిని తగ్గిస్తుంది.

డయాబెటిక్ డైట్ :

టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు పచ్చి అరటిపండ్లను తినవచ్చు . ఇందులో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ డైట్ లో సెన్సిటివ్ డైట్ ఫుడ్ . కాబట్టి గ్రీన్ బనానను ఉడికించి తీసుకోవచ్చు.

బోన్ హెల్త్ కు:

పచ్చి అరటిపండ్లలో విటమిన్స్, మెగ్నీషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి. అలాగే జాయింట్ పెయిన్స్ నివారిస్తాయి.

ఆకలి తగ్గుతుంది:

పచ్చి అరటిపండ్లు తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల తరచుగా తినాలనే ఫీలింగ్ తగ్గుతుంది. దీనివల్ల బరువు పెరగడాన్ని, ఇతర అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

10 Amazing Benefits And Uses Of Green Bananas

10 Amazing Benefits And Uses Of Green Bananas,Is green banana good for you? With a fancy sounding name, one might expect green bananas to be something exotic. But green bananas are just regular bananas. But don’t dismiss them as they have a host of health benefits.
Please Wait while comments are loading...
Subscribe Newsletter