టైల్ బోన్ లేదా లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్

టైల్ బోన్ లేదా లోయర్ బ్యాక్ పెయిన్ కు కారణం, లక్షణాలు గురించి తెలుసుకోవడం వల్ల వెంటనే చికిత్స తీసుకోవడానికి సహాయపడుతుంది. వెన్నెముక లేదా లోయర్ బ్యాక్ లో పెయిన్ విపరీతంగా ఉంటుంది. ఎక్కువ సలపడం , కొన్ని

Subscribe to Boldsky

ఈ మద్యకాలంలో బ్యాక్ పెయిన్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ముఖ్యంగా డెస్క్ జాబ్స్ చేసేవారు, ఆఫీసుల్లో ఎక్కువ పనిగంటలు పనిచేసేవారిలో ఈ సమస్య కనబడుతుంటుంది. బ్యాక్ పెయిన్ వంటిది మరో బాధకరమైన విషయం టైల్ బోన్ పెయిన్ ?టైల్ బోన్ వెన్నుముక నొప్పి అత్యంత బాధకరమైనది. ఇటువంటి బాధకరమైన టైల్ బోన్ పెయిన్ ఎందుకొస్తుంది, కారణమేమిటి, తీవ్రంగా బాధించే ఈ నొప్పి నుండి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..!

టైల్ బోన్ గాయపడటానికి కారణం?

టైల్ బోన్ గాయపడటానికి లేదా పెయిన్ లోయర్ బ్యాక్ లో వస్తుంది. వెన్నెముక క్రింది బాగంలో ఎక్కువ నొప్పితో బాధిస్తుంటుంది. టైల్ బోన్ పెయిన్ రావడానికి వివిధ కారణాలున్నాయి. ఎక్కువ సమయం కూర్చోనే ఉండటం లేదా బ్యాక్ పోర్షన్ కు దెబ్బతగిలినప్పుడు, టైల్ బోన్ గాయపడటానికి సాధారణ కారణాలు.

కొన్ని సందర్బాల్లో టైల్ బోన్ పెయిన్ స్పోర్ట్స్ పర్సన్స్ లో ఎక్కువగా ఉంటుంది, ఇంకా గర్భిణీలో , గర్భధారణ సమయంలో ఈ నొప్పిని ఎదుర్కుంటుంటారు . బౌలింగ్, సైక్లింగ్, రోయింగ్ వంటి ఆటల వల్ల టైట్ బోన్ ఫ్యాక్చర్ కు కారణమవుతుంది.కొన్ని సందర్భాల్లో లోయర్ బ్యాక్ పెయిన్ లేదా టైల్ బోన్ పెయిన్ కు సరైన కారణాలు ఉండవు . టైల్ బోన్ పెయిన్ కు స్పైనల్ ఇంజ్యూరి, ట్యూమర్స్, ఇన్ఫెక్షన్స్, మరియు ఇతర న్యూరాన్స్ కారణంగా టైల్ బోన్ గాయమవుతుంది.

టైల్ బోన్ లేదా లోయర్ బ్యాక్ పెయిన్ కు కారణం, లక్షణాలు గురించి తెలుసుకోవడం వల్ల వెంటనే చికిత్స తీసుకోవడానికి సహాయపడుతుంది. వెన్నెముక లేదా లోయర్ బ్యాక్ లో పెయిన్ విపరీతంగా ఉంటుంది. ఎక్కువ సలపడం , కొన్ని సందర్భాలో లోయర్ బ్యాక్ లో వాపు కూడా వస్తుంది. దీన్ని ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. మూత్రవిసర్జన సమయంలో, నొప్పి, సెక్స్ సమయంలో తీవ్ర నొప్పి ఉంటుంది.

టైల్ బోన్ ఇంజ్యూరిని తగ్గించుకోవడం ఎలా? టైల్ బోన్ పెయిన్ తగ్గించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి.ఫిజిలకల్ యాక్టివిటీ సమయంలో వెన్నెముకకు సపోర్టివ్ గా గేర్ వేసుకోవాలి. వీటితో పాటు టైల్ బోన్ లేదా లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

లేవేటర్ ఆనీ మసాజ్:

పెల్విక్ ను ఫ్లోర్ కు అనుకునేలా టైల్ బోన్ కు కుడివైపు తిరిగి పడుకుని, మజిల్స్ ను సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల 29 శాతం సక్సెస్ అవుతుంది. టైల్ బోన్ పెయిన్ నుండి ఉపశమనం కలుగుతుంది.

లేవేటర్ ఆని స్ట్రెచ్చింగ్:

ల్యావేటర్ ఆని మజిల్స్ స్ట్రెచ్ చేయడం వల్ల స్ట్రాంగ్ గా మారుతాయి. ఫిజికల్ థెరఫిస్ట్ జరిపిన పరిశోధనల ప్రకారం లేవేటర్ యానీ స్ట్రెచ్ చేసిన ఫేషంట్స్ లో 32శాతం విజయవంతమైనట్లు గుర్తించారు, ఇది టైల్ బోన్ పెయిన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది టైల్ బోన్ పెయిన్ తగ్గించడంలో సింపుల్ హోం రెమెడీ.

కూర్చోనే విదంగా ఫర్ఫెక్ట్ గా ఉండాలి.

లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి , కూర్చొనే పొజీషన్ కరెక్ట్ చేసుకోవాలి. లేదంటే కొస్సిడీనియాకు దారితీస్తుంది. అప్ రైట్ పొజీషన్ లో కూర్చోవడం, ఇలా కొద్ది రోజులు పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఎక్కడ కూర్చొన్నా స్ట్రెయిట్ గా కూర్చోవడం...మెడను స్ట్రెయిట్ నిలబెట్టి కూర్చోవడం వల్ల టైల్ బోన్ పెయిన్ తగ్గించుకోవచ్చు. జాయింట్స్ లో షార్ప్ పెయిన్ ఉన్నట్లైతే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

బోర్లా పడుకోవాలి:

బోర్లా పడుకోవడం లేదా నొప్పిలేని సైడ్ కు తిరిగి పడుకోవడం వల్ల టైల్ బోన్ పెయిన్ తగ్గించుకోవచ్చు. నొప్పి ఉన్న బ్యాక్ కు నేరుగా పడుకోకుండా రెండో వైపు తిరిగి పడుకోవడం మంచిది,

హాట్ వాటర్ బాటిల్ ఉపయోగించాలి:

టైల్ బోన్ పెయిన్ ఉన్న ప్రదేశంలో హాట్ ప్రెజర్ అందివ్వడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. హాట్ వాటర్ బాలిల్ ను నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేసిసున్నితంగా అప్లై చేస్తూ మసాజ్ చేయాలి ఇలా రోజుకు 20నిముషాలు హాట్ ప్యాడ్ అప్లై చేయడం , హాట్ బ్యాత్ చేయడం వల్ల అదేవిధమైన ఫలితాలను పొందువచ్చు.

సెక్స్ అవాయిడ్ చేయాలి:

టైల్ బోన్ కు పెల్విక్ మజిల్స్ కనెక్ట్ అవ్వడం వల్ల పెల్విక్ మీద బారం పడినప్పుడు, నొప్పి విపరీతంగా ఉంటుంది. కాబట్టి, సెక్స్ వంటి ఇండ్యూసింగ్ యాక్టివిటీస్ తగ్గించాలి.

ప్రొపిషినల్ మసాజ్ :

మెస్యుర్స్, చిరోప్రాక్టర్స్ టయల్ బోన్ పెయిన్ తగ్గిస్తుంది. ప్రొఫిషినల్స్ సూచనలతో , వారి పర్యవేక్షనలో మసాజ్ చేయించుకోవడం మంచిది . వారికి స్పెసిఫిక్ ప్రెజర్ పాయింట్స్ తెలియడం వల్ల నొప్పినుండి త్వరగా ఉపశమనం కలిగేలా చేస్తారు.

ఐస్ ప్యాక్:

లోయర్ బ్యాక్ పెయిన్ లేదా టైట్ బోన్ పెయిన్ తగ్గించడంలో ఐస్ ప్యాక్ కూడా గ్రేట్ గా సమాయపడుతుది.ఐస్ బ్యాగ్ తో నొప్పిఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

10 Effective Home Remedies To Treat Tailbone Pain

situation, right? If tailbone pain has been bugging you for a while now, then look no further! This post deals with the causes and the ways you can prevent tailbone pain! Read on and get relieved!
Story first published: Monday, November 7, 2016, 21:16 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter