For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైరల్ ఇన్ఫెక్షన్ కు చెక్ పెట్టే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

వైరల్ ఫీవర్ ప్రస్తుతం కామన్ హెల్త్ ఇష్యూగా మారింది. సహజంగా మనం ఎక్కువ బ్యాక్టీరియా మరియు వైరస్ కు ఎక్స్ పోజ్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ కు గురౌతుంటాము. ఇది వయసుతో సంబంధం లేకుండా వేధిస్తోంది. వైరల్ ఇన్ఫెక్షన్ మన కళ్ళకు కనబడని బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంటారు. వైలర్ ఇన్ఫెక్షన్స్ సంవత్సరంలో సమయం మరియు సీజన్ బట్టి వస్తుంటాయి.

వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇమ్యూన్ సిస్టమ్ పై ప్రభావం పడుతుంది. దీనివల్ల చాలా అనారోగ్యంగా అనిపిస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా.. చాలా సమస్యలు వస్తాయి. చర్మంపై దురదలు, ఎర్రగా మారడం, జుట్టు రాలిపోవడం, సాధారణ జలుబు మరియు దగ్గు, అలసటగా అనిపించడం ప్రధానంగా కనిపిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ప్రాణాంతకంగా మారుతాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్ వాతావరణ మార్పులు మరియు ప్రదేశాలు మారినప్పుడు వస్తుంటాయి .

ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండలేము. ఇవి మనకు తెలియకుండానే మన శరీరంలో జరిగే మార్పు. అయితే వీటికి బాధపడాల్సిన పనిలేదు . కొన్ని సింపుల్ రెమెడీస్ ను ఉపయోగించి ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి బయటపడవచ్చు . ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి మరియు చౌకైనవి కూడా మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో చూద్దాం...

1. గోరువెచ్చని నీరు లేదా బెవరేజెస్ తాగాలి:

1. గోరువెచ్చని నీరు లేదా బెవరేజెస్ తాగాలి:

కామన్ కోల్డ్ వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, డ్రై మౌత్ వంటి లక్షణాలు కనబడుతాయి. వీటిని నివారించుకోవడానికి హాట్ బెవరేజస్ గ్రేట్ గా సహాయపడుతాయి. వేడి నీటిని తాగాలి. మరియు హెర్బల్ టీలో నిమ్మరసం, తేనె మిక్స్ చేసి తాగొచ్చు. అలాగే జింజర్ టీ కూడా గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది,. టీ కాఫీల్లో కూడా అల్లం, నిమ్మరసం చేర్చుకోవచ్చు. అయితే డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలి.

2. ఆవిరి పట్టాలి:

2. ఆవిరి పట్టాలి:

జలుబు మరియు దగ్గు కారణంగా ముక్కుదిబ్బడం వల్ల శ్వాసనాళాలు బ్లాక్ అవుతాయి. శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతాయి ,. . ఇలా బ్లాక్ అయిన శ్వాసనాళాలు తెరుచుకుని, శ్వాస బాగా ఆడాలంటే ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టే నీటిలో యూకటిప్టస్ ఆయిల్ లేదా యూకలిప్టస్ ఆకులు వేసి ఆవిరి పట్టడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది .

3. అల్లం, బ్లాక్ పెప్పర్ మరియు అల్లం:

3. అల్లం, బ్లాక్ పెప్పర్ మరియు అల్లం:

సాధారణ జలుబు మరియు దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందాలంటే ఈ మూడింటినీ నీటిలో వేసి బాగా మరిగించి గోరువెచ్చగా తాగాలి. క్రమం తప్పకుండా రోజూ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వేడి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి గార్గిలింగ్ చేయడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

4. సూప్:

4. సూప్:

వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఫ్లూ వంటి జబ్బులకు సూప్ గొప్పగా సహాయపడుతుంది . చికెన్ సూప్, లేదా టమోటో సూప్ లేదా మీకు నచ్చిన ఏదైనా సూప్ ను వేడి వేడిగా తాగడం వల్ల గొంతులో గరగర మరియు గొంతు నొప్పిని నివారిస్తుంది . అలాగే సాధారణ ఫ్లూ కూడా నివారించబడుతుంది.

5. వెల్లుల్లి:

5. వెల్లుల్లి:

ఫ్లూ అంటే కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన అనారోగ్య సమస్య. ఫ్లూ నివారణకు వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది . వెల్లుల్లిలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరనల్ లక్షనాలు పుష్కలంగా ఉన్నాయి . వెల్లుల్లి పాయలను పచ్చిగా అలాగే తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . వెల్లుల్లిని కచపచ దంచి నీటిలో వేసి తినాలి .

6. వెనిగర్ :

6. వెనిగర్ :

వెనిగర్ ఫ్లూ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది బాడీ ఆల్కలైన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది . కాబట్టి ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవడం వల్ల ఫ్లూను నివారించుకోవచ్చు . ఒక గ్లాసు నీటిలో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేయాలి . రోజులో రెండు మూడు సార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

7. బాదం :

7. బాదం :

రాత్రి నీటిలో నానబెట్టిన బాదంను మరుసటి రోజు ఉదయం పరగడుపు తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది . ఇందులో విటిమన్స్, మినిరిల్స్ అధికంగా ఉంటాయి . ఇంకా మెగ్నీషియం, మరియు ఐరన్ కూడా అధికంగా ఉంటాయి . ఇందులో ఉండే ఎంజైమ్స్ రెస్పిరేటర్ హీలింగ్ పవర్ ను నయం చేస్తాయి . కాబట్టి మీరు బ్రొకైటిస్ తో బాధపడుతుంటే బాదంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

8. ఉల్లిపాయ:

8. ఉల్లిపాయ:

బ్రొకైటిస్ కు ఉల్లిపాయ గ్రేట్ గా సహాయపడుతుంది,. ఉల్లిపాయలు మ్యూకస్ ప్రసరణను మెరుగుపరుస్తుంది . తేనె అమేజింగ్ యాంటీ బయోటిక్ ఈ రెండింటి కాంబినేషన్ తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ ను గ్రేట్ గా తగ్గించుకోవచ్చు . ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేసి అందులో ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.

9. చిల్లీస్:

9. చిల్లీస్:

పచ్చిమిర్చి శరీరంలో వేడి పెంచి, చెమటలు పట్టేలా చేస్తుంది. ముఖ్క క్లియర్ చేస్తుంది. క్యానిన్ పెప్పర్ తినడం వల్ల ఎక్కువ మ్యూకస్ విడుదలవుతుంది . దాంతో శ్వాస తీసుకోవడానికి సులభమౌతుంది.

10. నిమ్మ:

10. నిమ్మ:

ఓల్డ్ రెమెడీ నిమ్మ, ఇది బ్రొంకైటిస్ కు ఒక ఉత్తమ రెమెడీ. దీన్ని గ్రీన్ టీ మరియు తేనెతో తీసుకోవచ్చని చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు . లెమన్ టీ తీసుకోవడం వల్ల అందులో వైరస్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది.

English summary

10 Effective Home Remedies To Treat Viral Infections

The simple and most important single thing the Indian mothers put in our hands each morning are the soaked almonds. Almonds are a rich source of nutrients and vitamins. It also contains magnesium and calcium. It has amazing healing power for respiratory illnesses.
Story first published:Thursday, May 5, 2016, 11:27 [IST]
Desktop Bottom Promotion