For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెంగ్యూ పేషంట్స్ ఖచ్చితంగా తినాల్సిన 10 హెల్తీ డైట్ ఫుడ్స్..!

డెంగీ పేషంట్స్ ఫుడ్ డైట్ లో ఫాలో అవ్వాలి. ఈ లక్షణాలున్నప్పుడు సరైన ఆహార నియాలమాలు పాటించగలిగితే శరీరంలో మరే ఇతర భాగాలకు హాని కలగకుండా పూర్తి శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

|

డెంగీ అనేది ఒక వైరస్. 'ఈడిస్ ఈజిప్టై' అనే ఒక రకం ఆడదోమ కుట్టడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. ఈ వైరస్ జీవితచక్రమం దోమల నుంచి మనుషులకు, మనుషుల నుంచి దోమలకు ఇది ఒక విష వలయంలా ఉంటుందన్నమాట. దోమ, దోమ కుట్టిన 5 నుంచి 6 రోజులకు జ్వరం ప్రారంభమవుతుంది. పగలు కుట్టే దోమల వల్ల ఈ విషజ్వరం వ్యాపిస్తుంటుంది.

దోమలకు ఆవాసం: నిలువ నీళ్లల్లో ఈడిస్ ఈజిప్టై దోమ గుడ్లు పెడుతుంది. ఓవర్‌హెడ్ ట్యాంకులు, అండర్‌గ్రౌండ్ ట్యాంకులు, కూలర్లు, ఇంట్లోని పాత్రలు, ఫ్లవర్‌వాజులు, నీటి కుండీలు, పాతటైర్లు, పనికిరాని పడేసిన బాటిళ్లు, పాత్రలు, డబ్బాలు... ఇలా ఎక్కడ నీళ్లు నిలువ ఉండటానికి అవకాశం ఉంటే అక్కడ ఈ దోమ గుడ్లు పెడుతుంది. ఈ నీళ్ల నుండి వారం, పదిరోజుల్లో లక్షలాది దోమలు తయారవుతాయి.

డెంగీ లక్షణాలు: 2 నుంచి 7 రోజుల వరకూ జ్వరం తగ్గకపోవడం ఒళ్లంతా తీవ్రమైన నొప్పులుగా ఉండటం (కండరాలలో, కీళ్లలో, తలలో విపరీతమైన నొప్పి వస్తుంటుంది) చర్మంపై ఎర్రటిమచ్చలు ర్యాష్‌లాగా కనిపించడం తెల్ల రక్తకణాలు బాగా పడిపోవడం (ఇది రక్తపరీక్షలో తెలుస్తుంది) హిమోగ్లోబిన్ 16 శాతం కంటే ఎక్కువ ఉండటం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోవడం (రక్తపరీక్షలో తెలుస్తుంది) ప్లేట్‌లెట్స్ సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది. వీటి సంఖ్య సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షలు ఉండాలి. కానీ... డెంగీ వ్యాధిలో ప్లేట్‌లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. ప్లేట్‌లెట్స్ అనేవి రక్తస్రావం జరగకుండా ఆపే కణాలు. అవి తగ్గడం వల్ల శరీరం లోపలి భాగాల్లో రక్తస్రావం జరిగి, అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. జ్వరం వచ్చిన మూడో రోజు నుంచి రెండో వారాంతం వరకు ఎప్పు డైనా ఇలా జరగవచ్చు. (అయితే మొదటివారం లోనే ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ). ఇది ప్రమాదకరమైన దశ. ఈ సమయంలో రోగిని పర్య వేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

డెంగీ పేషంట్స్ ఫుడ్ డైట్ లో ఫాలో అవ్వాలి. ఈ లక్షణాలున్నప్పుడు సరైన ఆహార నియాలమాలు పాటించగలిగితే శరీరంలో మరే ఇతర భాగాలకు హాని కలగకుండా పూర్తి శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీరు ఈ డెంగీ ఫీవర్ నుండి త్వరగా కోలుకోవడానికి ఈ ఆహారాలు బాగా సహాయపడుతాయి. డేంగీ లక్షణాలున్నవారు వీటిని ఖచ్చితంగా తినాలనే నియమం లేదు. కానీ వీటిని తీసుకోవడం వల్ల డెంగీ పేషంట్స్ కు కోలుకోవడానికి గొప్పగా సహాయపడుతాయి. మరి అటువంటి ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

ఆరెంజ్:

ఆరెంజ్:

డెంగీ రోగికి ఒక మంచి ఆహారం సిట్రస్ పండ్లు, ఆరెంజ్ జ్యూస్ మరియు పండ్లలో పుష్కలమైన విటిమిన్ సి మరియు శక్తి నిండి ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల, ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. యూరినరీ అవుట్ పుట్ ను మెరుగుపరిచి యాంటీబాడీస్ ప్రోత్సహించి రోగి త్వరగా కోలుకొనేందుకు సహాయపడుతుంది.

బొప్పాయి:

బొప్పాయి:

డెంగ్యు పేషంట్స్ కు బొబ్బాయి ఆకులు చాలా మంచిదని డాక్టర్స్ మరియు నిపుణులు సూచిస్తుంటారు. అందుకు 2తాజా బొప్పాయి ఆకులను తీసుకొని, వాటిని మెత్తగా పేస్ట్ చేసి, వాటి నుండి జ్యూసును తీసి, ప్రతి రోజూ ఉదయం మరియు రాత్రి రెండు చెంచాల జ్యూస్ ను డెంగ్యూ రోగికి ఇచ్చినట్లైతే రోగి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది. డెంగీ ఫీవర్ కు ఇది ఒక బెస్ట్ హోం రెమడీ.

ఆయిల్ ఫుడ్ ను నివారించాలి:

ఆయిల్ ఫుడ్ ను నివారించాలి:

డేంగ్యుకు మరో ప్రధాన లక్షణం పొట్ట సమస్యలు. కాబట్టి, డేంగ్యు లక్షణాలు కనిపించినప్పుడు, ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండటమే మంచిది. స్పైసీ ఫుడ్స్ పరిస్థితిని మరింత అధ్వాన్నంగా మార్చుతాయి. కాబట్టి, డేంగ్యు పేషంట్స్ ఆయిల్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

 గంజి:

గంజి:

పాపులర్ బ్రేక్ పాస్ట్ ఆప్షన్. పోరిడ్జ్ లో ఫైబర్, ఇతర న్యూట్రీషియన్స్ అత్యధికంగా ఉంటాయి. ఇది వ్యాధులతో పోరాడటానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ ప్రాణాంతక వైరస్ తో పోరాడాలంటే డెంగీ రోగికి ఒక బెస్ట్ ఫుడ్ గంజి. గంజి తాగడం వల్ల పేషంట్ లో కొంత శక్తిని, బలాన్ని నింపడానికి సహాయపడుతుంది. గంజి తాగడానికి, మింగడానికి చాలా తేలికగా ఉంటుంది. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

హెర్బల్ టీ:

హెర్బల్ టీ:

హెర్బల్ టీ: డెంగీ ఫీవర్ తో బాధపడుతున్న వారు, ఈ ఫీవర్ ను తగ్గించుకోవడానికి ఒక మంచి మార్గం నేచురల్ హెర్బల్ టీ తాగడమే. ఈ హేర్బల్ టీ అల్లం పెప్పర్ మింట్ మరియు యాలకులతో తయారు చేసిన హెర్బల్ టీలను ఎంపిక చేసుకోవడం మంచిది. హెర్బల్ టీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది డెంగ్యు పేషంట్స్ కు ఒక మంచి బెవరేజ్ . అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డేంగ్యు ఫీవర్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతాయి.

 కొబ్బరి బోండాం:

కొబ్బరి బోండాం:

కొబ్బరి బోండాం: డెంగీ ఫీవర్ తో పోరాడుతున్నప్పుడు, పేషంట్ ఎంత ఎక్కువగా కోకనట్ వాటర్ ను ఎంత తాగితే అంత మంచిది. కొబ్బరి నీళ్ళు శరీరం ద్వారా కోల్పోయిన ఎలెక్ట్రోలైట్స్ మరియు ఇతర ట్రేస్ మినిరల్స్ ను నింపి శరీరంను డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. శరీరంలో ఫ్లూయిడ్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది.

వెజిటేబుల్ జ్యూస్:

వెజిటేబుల్ జ్యూస్:

వెజిటేబుల్ జ్యూస్: డెంగ్యు ఫీవర్ తో బాధపడుతున్న పేషంట్స్ కు ఒక మంచి ఆహారం తాజాగా ఉండే క్యారెట్, కీరదోస జ్యూస్ లు మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్ జ్యూస్ లు తీసుకోవడం మంచిది. ఈ జ్యూసులు డేంగ్యు లక్షణాలను నివారించడంతో పాటు, శరీరానికి అవసరమయ్యే న్యూట్రీషియన్, విటమిన్స్, మినిరల్స్ ను అందిస్తుంది. దాంతో శరీరంలో వ్యాధినిరోధకత పెరుగుతుంది . నొప్పులను తగ్గిస్తుంది.

సూప్స్ :

సూప్స్ :

డెంగ్యు ఫీవర్ తో బాధపడే వారికి కావల్సిన శక్తిని, బలాన్ని అందివ్వడానికి సూప్స్ చాలా బాగా ఉపయోగపడుతాయి. జాయింట్ పెయింట్స్, కండరాల నొప్పుల నివారించడానికి, పేషంట్స్ లో ఆకలిని మరియు రుచిని కలిగించడానికి ఇవి బాగా సహాయపడుతాయి. సూప్స్ లో కారం తక్కువగా ఉండటం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది, బౌల్ మూమెంట్ క్రమంగా మెరుగుపడుతుంది.

పండ్ల రసాలు:

పండ్ల రసాలు:

డెంగ్యు పేషంట్స్ కు చాలా ఆరోగ్యకరమైన ఆహారం విటమిన్ సి ఫుడ్స్. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ ఫుడ్. ఇది కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది, పేషంట్ లో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది . అడ్రినల్ హార్మోన్స్ నిర్మాణం కోసం ఇవి చాలా ముఖ్యమైనవి. స్ట్రాబెర్రీ, జామకాయ,కివి మరియు బొప్పాయి, పైనాపిల్, ఆరెంజ్ ఫ్రూట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటాయి. డేంగ్యుతో బాధపడే వారు ఫ్రూట్ జ్యూస్ లను ఎక్కువగా తీసుకోవాలి.

వేపఆకులు:

వేపఆకులు:

వేపాకుల్లో ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది డేంగ్యు పెరగకుండా, విస్తరించకుండా , క్రిమి సంహారినిగా పనిచేస్తుంది. అందుచేతన ఇది డేంగ్యు రెమెడీస్ లో మరో ముఖ్యమైనటువంటి నేచురల్ రెమెడీగా ఉంది.

English summary

10 Healthy Diet Tips For Dengue Patients

High fever, joint pain, headache and measles-like skin rash usually accompany dengue (1). But then, there are certain simple diet tips that can help alleviate these symptoms and accelerate your recovery from dengue! Would you like to know what they are? Do give this post a read!
Story first published: Tuesday, October 25, 2016, 18:26 [IST]
Desktop Bottom Promotion