చలికాలంలో మగవాళ్లు ఖచ్చితంగా తినాల్సిన సూపర్ ఫుడ్స్..!!

మగవాళ్లకు చాలా పోషకాలు అవసరమవుతాయి. మగవాళ్లు ఆడవాళ్ల కంటే ఎక్కువ క్యాలరీలు తీసుకుంటారు. ఇతర కాలాలతో పోల్చితే.. మగవాళ్ల శరీరానికి చలికాలంలో ఎక్కువ క్యాలరీలు అవసరమవుతాయి.

Posted By:
Subscribe to Boldsky

ఆడవాళ్లు తీసుకునే ఆహారానికి మగవాళ్లు తీసుకునే ఆహారానికి చాలా వ్యత్యాసం ఉంది. మగవాళ్లకు చాలా పోషకాలు అవసరమవుతాయి. మగవాళ్లు ఆడవాళ్ల కంటే ఎక్కువ క్యాలరీలు తీసుకుంటారు. ఇతర కాలాలతో పోల్చితే.. మగవాళ్ల శరీరానికి చలికాలంలో ఎక్కువ క్యాలరీలు అవసరమవుతాయి.

10 Super-Foods All Men Should Include in their Diet This Winter

చలికాలంలో ఎక్కువ ఇమ్యునిటీ పవర్, ఎక్కువ స్టామినా, ఎక్కువ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ప్రతి ఒక్కరికీ ముఖ్యం. అయితే మగవాళ్లు మరింత ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మగవాళ్ల స్పెర్మ్ పై దుష్ర్పభావం చూపకుండా ఉండాలంటే.. చలికాలంలో వీళ్ల డైట్ కాస్త విభిన్నంగా, జాగ్రత్తగా ఉండాలి.

చలికాలంలో అన్నీ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల.. ఎక్కువగా చిరుతిండ్లు తినకుండా, ఈ చలికాలమంతా హెల్తీగా ఉండటానికి సహాయపడతాయి. కాబట్టి మగవాళ్లు తమ డైట్ లో కంపల్సరీ కొన్ని సూపర్ ఫుడ్స్ ని చేర్చుకోవాలి. మరి ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో చూసేద్దామా..

కర్జూరాలు

రాత్రి నిద్రపోవడానికి ముందు 5 కర్జూరాలను ఒక గ్లాసు వేడిపాలతో కలిపి తీసుకోవాలి. ఇది మగవాళ్ల ఆరోగ్యానికి చాలా మంచి ఐడియా.

వాల్ నట్స్

మగవాళ్లు కంపల్సరీ తీసుకోవాల్సిన ఆహారాల్లో వాల్ నట్స్ ఒకటి. ప్రతిరోజూ కొన్ని వాల్ నట్స్ ని మగవాళ్లు ముఖ్యంగా చలికాలం తీసుకోవాలి. దీనివల్ల స్పెర్మ్ కౌంట్ మెరుగుపడుతుంది.

ఎగ్స్

చలికాలంలో మగవాళ్ల శరీరానికి కావాల్సిన క్యాలరీలు అందడానికి ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ లో రెండు ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవాలి.

ద్రాక్ష రసం

ప్రతి రోజూ ఒక కప్పు ద్రాక్ష లేదా ఒక గ్లాసు ద్రాక్ష రసం మగవాళ్లు చలికాలంలో తీసుకోవాలి.

క్యారట్ జ్యూస్

మగవాళ్ల డైట్ లో చేర్చుకోవాల్సిన ఆహారాల్లో క్యారట్ జ్యూస్ చాలా ముఖ్యమైనది. చలికాలంలో ఒంట్లో శక్తిని పెంచి, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచడంలో.. క్యారట్స్ సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజూ ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ ని డైలీ డైట్ లో చేర్చుకోవాలి.

దానిమ్మ

ప్రతిరోజూ ఒక దానిమ్మ లేదా ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ ని మగవాళ్ల డైట్ లో చేర్చుకోవడం వల్ల వాళ్ల శరీరంలో అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది.

ఉసిరి

ఒక టీస్పూన్ ఉసిరి జ్యూస్ ని రోజుకి రెండుసార్లు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవడం వల్ల మగవాళ్ల ఆరోగ్యానికి మంచిది.

వెల్లుల్లి

మగవాళ్లు చలికాలంలో ప్రతిరోజూ ఉదయం 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి.

యాపిల్

మగవాళ్ల డైట్ లో యాపిల్స్ కంపల్సరీ ఉండాలి. చలికాలంలో ఉదయం ఒక యాపిల్, సాయంత్రం ఒక యాపిల్ తీసుకోవడం చాలా ముఖ్యం.

జామకాయ

జామకాయ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. సాల్ట్, పెప్పర్ వేసుకుని.. ప్రతిరోజూ రెండు జామకాయలను మగవాళ్లు కంపల్సరీ తినాలి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

10 Super-Foods All Men Should Include in their Diet This Winter

10 Super-Foods All Men Should Include in their Diet This Winter. We have compiled a list of the top 10 super foods that all men should eat this winter. Check out in the next slides.
Please Wait while comments are loading...
Subscribe Newsletter