వింటర్ సీజన్లో బాడీలో కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసే 10 సూపర్ ఫుడ్స్ ..!

శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే నేచురల్ రెమెడీస్, నేచురల్ పద్దతులకు మించి ఏది పనిచేయదు అని చెప్పవచ్చు.ఆహారాలపై అవగాహన, జాగ్రత్తలు తీసుక

Posted By:
Subscribe to Boldsky

సంవత్సరంలో అన్ని సీజన్స్ లో కంటే వింటర్ సీజన్ లో బాడీలో కొలెస్ట్రాల్ చేరడం ఎక్కువ. ఎందుకంటే వింటర్లో చాలా మంది బద్దకిస్తుంటారు, వ్యామాలు, జాగింగ్స్, ఎక్సర్ సైజ్, జిమ్, యోగా ఏవి ఉండవు, దానికి తోడు ఫ్యాట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. దాంతో శరీరంలో అమాంతంగా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల బరువు పెరగడం మాత్రమే కాదు, హార్ట్ , లివర్, కిడ్నీలకు సంబంధించిన మేజర్ హెల్త్ సమస్యలకు గురిఅవుతారు.

కాబట్టి, వింటర్లో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేదుకు 10 సూపర్ ఫుడ్స్ ను ఈక్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తాయి.

కొలెస్ట్రాల్ లో రెండు రకాలుంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్ , రెండోది చెడు కొలెస్ట్రాల్ . మంచి కొలెస్ట్రాల్ శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ మీద అదనపు ఏకాగ్రత కలిగి ఉండటం చాలా అవసరం.

10 Superfoods That Help Control Cholesterol During Winter

శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే నేచురల్ రెమెడీస్, నేచురల్ పద్దతులకు మించి ఏది పనిచేయదు అని చెప్పవచ్చు.

ఆహారాలపై అవగాహన, జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ ఏర్పడే ఆహారాల మీద ఓ కన్నెసి ఉంచాలి. .

ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన ఆహారాలు శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం...

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బాడీలో కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఫుడ్ .

మెంతులు:

మెంతుల్లో సపోనిన్ అనే కాంపౌండ్ అధికంగా ఉంటుంది. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే. ఈ రెండు పదార్థాలరు కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో మేజర్ పాత్ర పోషిస్తాయి.

.ఓట్ మీల్:

ఓట్ మీల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నివారిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది.

నట్స్ :

నట్స్ లో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేయడంలో వాల్ నట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. కాబట్టి, రోజూ గుప్పెడు నట్స్ తినడం మంచిది.

వెజిటేబుల్స్ :

గ్రీన్ వెజిటేబుల్స్ లో ఫైబర్, అదికంగా ఉంటుంది. ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్స్ బ్రొకోలిలో ఉండే ఫైబర్ కంటెంట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

సీజనల్ ఫ్రూట్స్ :

సీజనల్ ఫ్రూట్స్ లో ఆరెంజ్, గ్రేప్స్, వంటి పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే రోజుకు ఒక్క ఆపిల్ తినడం కూడా మంచిదే.

తేనె:

తేనలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. తేనె తినడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడం మాత్రమే కాదు, ఫ్యాట్ బర్న్ చేయడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

దాల్చిన చెక్క:

డైలీ డైట్ లో దాల్చిన చెక్కను చేర్చుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తో పోరాడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వచేరకుండా సహాయపడుతుంది.

.ఉల్లిపాయలు:

ఉల్లిపాయల్లో ఉండే క్విర్సిటిన్ అనే కంటెంట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది. డైలీ డైట్ లో ఉల్లిపాయలు చేర్చుకోవడం వల్ల సీజనల్ డిసీజెస్ నుండి ఉపశమనం పొందవచ్చు.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

10 Superfoods That Help Control Cholesterol During Winter

Controlling the level of cholesterol in your body, especially during winter is very essential. Find out the list of foods that help control cholesterol in this article.
Please Wait while comments are loading...
Subscribe Newsletter