For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: నీళ్లు సరిగ్గా తాగడం లేదని తెలిపే డేంజర్ సంకేతాలివే..

By Swathi
|

రోజూ నీళ్లు తాగుతున్నారా ? అంటే బాగా తాగున్నాను అన్న సమాధానమే చాలా మంది చెబుతారు. కానీ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక బాటిల్ లేదా ఒక లీటర్ కూడా నీళ్లు తాగి ఉండరు. ఇది ఒకరు, ఇద్దరి సమస్య కాదు. చాలా మంది నీళ్లు తాగాలంటే చాలా బద్దకంగా ఫీలవుతారు. అలాగే నీళ్లు తాగడం అంటే.. ఏదో మెడిసిన్ తాగినట్టు ఫీలవుతుంటారు. కానీ.. నీళ్లు తాగడం చాలా అవసరం. ఎందుకంటే.. మనుషుల శరీరం మూడోవంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి నీళ్లు సరిగా అందకపోతే.. శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి.

10 రోజుల్లో ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే వాటర్ డైట్

శరీరంలోని ప్రతి భాగం, ప్రతి చిన్న అవయవం, టిష్యూ, కణం అన్నీ కూడా నీటిపై ఆధారపడి ఉంటాయి. శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్స్ స్థాయి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ అవుతుంది. మలినాలు బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అంతే చర్మం ప్రకాశవంతంగా కనిపించడానికి కూడా నీళ్లు తాగడం తప్పనిసరి.

రైస్ వాట‌ర్‌తో మైండ్ బ్లోయింగ్ బెన్ఫిట్స్

అయితే శరీరానికి కావాల్సిన స్థాయిలో నీళ్లు అందకపోతే.. శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. బాడీ డీహైడ్రేట్ అవడమే కాకుండా.. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. మీరు సరిగ్గా నీళ్లు తాగడం లేదని తెలిపే.. కొన్ని సంకేతాలు ఇప్పుడు చూద్దాం. మీరు సరిపడా నీళ్లు తీసుకోవడం లేదని మీ బాడీ మీకు డేంజర్ సిగ్నల్స్ ఇస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

హార్ట్ బీట్

హార్ట్ బీట్

శరీరానికి కావాల్సిన స్థాయిలో నీళ్లు తీసుకోకపోతే.. గుండె వేగంపై ప్రభావం చూపుతుంది. తక్కువ నీళ్లు అందినప్పుడు బ్లడ్ చిక్కగా మారి, ప్లాస్మా పరిమాణం తగ్గుతుంది. దీనివల్ల బ్లడ్ సర్కులేషన్ కూడా తగ్గిపోయి.. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అలాగే భయం, ఆందోళన, ఉలిక్కిపాటు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలాగే ఒత్తిడికి లోనవుతారు.

నోరు ఆరిపోవడం

నోరు ఆరిపోవడం

శరీరానికి సరైన మోతాదులో నీళ్లు అందకపోతే.. లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల దుర్వాసన వస్తుంది. అలాగే నోరు ఎక్కువగా తడారిపోతూ ఉంటుంది. గొంతులో కూడా పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది.

తినాలనిపించడం

తినాలనిపించడం

కొన్ని సందర్భాల్లో శరీరానికి సరైన స్థాయిలో నీళ్లు అందకపోతే... దాహాన్ని ఆకలితో తీర్చుకుంటూ ఉండటమనేది ఒక సంకేతం. శరీరానికి నీళ్లు అవసరమైనప్పుడు ఫుడ్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఏదో తినాలి అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు తినడానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి.

కీళ్లు, కండరాల నొప్పులు

కీళ్లు, కండరాల నొప్పులు

తక్కువ నీళ్లు తాగుతున్నారని తెలిపే లక్షణాల్లో ఇది ఒకటి. ఉన్నట్టుండి కండరాలు, కీళ్ల నొప్పులు బాధిస్తాయి. ఎందుకంటే.. కీళ్ల మధ్యలో ఉండే కార్టిలేజ్ 80 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది. మీరు నీళ్లు తక్కువగా తాగినప్పుడు ఈ నొప్పుల ద్వారా మీకు సంకేతం అందుతుంది.

తలనొప్పి

తలనొప్పి

నీళ్లు తక్కువగా తాగినప్పుడు మీకు తలనొప్పి వేధిస్తుంటుంది. ఆక్సిజన్ తక్కువగా అందడం, బ్రెయిన్ కి బ్లడ్ తక్కువ అందడం వంటివి డీహైడ్రేషన్ ద్వారా కలుగుతాయి. దీంతో తలనొప్పి వస్తుంది.

కాన్స్టిపేషన్

కాన్స్టిపేషన్

కాన్స్టిపేషన్ నివారించడానికి తగిన స్థాయిలో నీళ్లు తాగాలని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. జీర్ణవ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరం. డీహైడ్రేషన్ కారణంగా, ఫ్లూయిడ్స్ తక్కువగా అందడం వల్ల ఈ సమస్య కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అలసట

అలసట

శరీరానికి కావాల్సిన స్థాయిలో నీళ్లు తీసుకోవడం వల్ల మిమ్మల్ని ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా ఉంచుతుంది. డీహైడ్రేషన్ వల్ల అలసటగా అనిపిస్తుంది. తక్కువ నీళ్లు తీసుకుంటే.. బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ సరిగా అందదు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయి అంటే.. మీరు శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగడం లేదని అర్థం.

యూరిన్ కలర్

యూరిన్ కలర్

మీ శరీరం డీహైడ్రేట్ అయిందని తెలిపే ముఖ్య లక్షణం మీ యూరిన్ కలర్. అలాగే తరచుగా యూరిన్ కి వెళ్లకపోయినా.. మీరు సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. రోజుకి 4 నుంచి 7 సార్లు యూరిన్ కివెళ్లాలి. అలాగే మీ యూరిన్ కలర్ ఎల్లో కలర్ లో ఉంది అంటే కూడా మీరు నీళ్లు తాగడం లేదని గుర్తించాలి.

ఏకాగ్రత

ఏకాగ్రత

తలనొప్పి, డీహైడ్రేషన్ కాకుండా.. బ్రెయిన్ ఫంక్షన్ పైనా ఇది ప్రభావం చూపుతుంది. మీ మూడ్, మెమరీ, డెసిషన్, ఏకాగ్రత వంటివాటిపై కూడా ఇది ప్రభావం చూపుతుందని స్టడీస్ చెబుతున్నాయి.

పెదాలు ఆరిపోవడం

పెదాలు ఆరిపోవడం

నీళ్లు బాగా తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. శరీరం డీహైడ్రేట్ అయింది అంటే.. చర్మం పొడిబారుతుంది. అలాగే చెమట కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సంకేతం మీలో కనిపిస్తే.. నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.

ఈ లక్షణాలన్నీ మీరు నీళ్లు శరీరానికి కావాల్సిన మోతాదులో తాగడం లేదని సూచిస్తాయి. కాబట్టి... ఇకపై ఈ సిగ్నల్స్ కనిపించిన వెంటనే నీళ్లు తాగే పరిమాణం పెంచండి.

English summary

10 Warning Signs That Your Body is Lacking Water

10 Warning Signs That Your Body is Lacking Water. The human body is made of 2/3 of water, so it cannot survive more than 72 hours without this amazing liquid. Namely, every single part of our body, every tissue, cell, and body organ significantly depends on water. These are the 10 most prominent dehydration symptoms that you must know
Story first published: Thursday, February 4, 2016, 17:12 [IST]
Desktop Bottom Promotion