For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్టలో మంట, గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టే ఫుడ్స్..!

By Swathi
|

మీరు తరచుగా పొట్టలో మంట వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారా ? పొట్ట ఉబ్బరం సమస్యలు ఎదురవుతున్నాయా ? ఒకవేళ అవును అయితే.. కొన్ని ఆహారాలున్నాయి. అవి.. గ్యాస్ట్రిక్ సమస్యలన్నింటినీ న్యాచురల్ గా తగ్గిస్తాయి.

ఒకవేళ మీరు రెగ్యులర్ గా అన్ హెల్తీ ఫుడ్స్ తింటున్నారు అంటే.. ఖచ్చితంగా.. మీరు గ్యాస్ట్రిక్ సమస్య లేదా పొట్టలో యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలను తరచుగా ఎదుర్కొంటారు.

గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు.. పొట్టలో ఎక్కువ ఎయిర్ చేరుకుని.. బ్లోటింగ్, పెయిన్, ఇర్రిటేషన్, ఇన్ల్ఫమేషన్ సమస్య ఎదురవుతుంది. ఇలాంటి సమస్యను సరైన సమయంలో ట్రీట్ చేయకపోతే.. గ్యాస్ట్రిక్స్ క్రోనిక్ యాసిడ్ డిసీజ్ గా మారే ప్రమాదం ఉంటుంది.

గ్యాస్ట్రిక్ట్ సమస్యకు ప్రధాన కారణం అన్ హెల్తీ డైట్, స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం, ప్రెగ్నన్సీ, డైజెస్టివ్ డిజార్డర్స్ వంటి సమస్యలు. పొట్టలో, చెస్ట్ లో మంటగా అనిపించడం, పొట్టలో నొప్పి, వాంతులు, వికారం, నోట్లో చేదుగా అనిపించడం, గొంతులో నొప్పి వంటి సంకేతాలను గ్యాస్ట్రిక్ లక్షణాలు. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తుంటే.. ఒకే రోజులో తగ్గించుకోవడానికి డైట్ లో ఈ ఫుడ్స్ చేర్చుకోవాలి.

ఓట్స్

ఓట్స్

ఓట్స్ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల పొట్ట యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. గ్యాస్ సమస్యను నివారిస్తాయి.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి పొట్టలో చేరుకున్న అదనపుడు యాసిడ్స్ ని గ్రహించి.. గ్యాస్ట్రిక్స్ ని న్యాచురల్ గా తగ్గిస్తాయి.

అల్లం

అల్లం

అల్లంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల.. పొట్టలో సమస్యలను సున్నితంగా తగ్గిస్తుంది.

అలోవెరా

అలోవెరా

అలోవెరా పొట్టలోపలి గోడల చుట్టూ పేరుకున్న యాసిడ్స్ ని పీల్చుకుని.. పొట్టలో మంట వంటి గ్యాస్ట్రిక్ సమస్యలను వెంటనే తగ్గిస్తుంది.

అరటిపండు

అరటిపండు

అరటిపండు పొట్టలో ఉపశమనాన్ని కలిగిస్తుంది. చల్లటి అనుభూతిని కలిగిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు.. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తాయి.

దోసకాయ

దోసకాయ

పొట్టలో చాలా చల్లటి అనుభూతిని కలిగించే.. వెజిటబుల్ దోసకాయ. ఇది పొట్టలో గ్యాస్ట్రిక్స్ ని చాలా మెరుగ్గా తగ్గిస్తుంది.

కర్బూజా

కర్బూజా

కర్బూజా పండు.. పొట్టలో యాసిడ్ ని బ్యాలెన్స్ చేసి.. గ్యాస్ట్రిక్స్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ ని ఎఫెక్టివ్ గా అడ్డుకుంటుంది.

లీన్ మీట్

లీన్ మీట్

న్యాచులర్ గా గ్యాస్ట్రిక్స్ ని తగ్గించుకోవాలి అంటే.. లీన్ మీట్ వంటి వాటిని.. ఆయిల్, స్పైసెస్ లేకుండా తీసుకోవాలి.

పుచ్చకాయ

పుచ్చకాయ

వాటర్ కంటెంట్ ఎక్కువగా, విటమిన్స్ ఎక్కువగా ఉండే.. వాటర్ మిలాన్ ని తీసుకోవడం వల్ల.. న్యాచురల్ గా గ్యాస్ట్రిక్ సమస్యను నివారించుకోవచ్చు.

చేపలు

చేపలు

చేపల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉండటం వల్ల.. శరీరంలో ఎసిడిటీని తగ్గిస్తాయి.

నట్స్

నట్స్

నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి.. పొట్టలో యాసిడ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. కాబట్టి.. హార్ట్ బర్న్, గ్యాస్ట్రిక్స్ నివారించడానికి నట్స్ ని తీసుకోవాలి.

కొబ్బరినూనె

కొబ్బరినూనె

కొబ్బరినూనెలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి.. గ్యాస్ట్రిక్ సమస్యను ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి.

English summary

12 Foods That Can Reduce Gastritis!

12 Foods That Can Reduce Gastritis. If you are someone who eats out on a regular basis or have unhealthy eating habits, you could be experiencing gastritis or acid reflux often.
Story first published: Thursday, September 22, 2016, 16:39 [IST]
Desktop Bottom Promotion