అలర్ట్ : మీ శరీరానికి సరిగా ప్రోటీన్స్ అందడం లేదని తెలిపే 12 సంకేతాలు..!!

Subscribe to Boldsky

ఎప్పుడు జబ్బుపడుతున్నారా? జలుబు, దగ్గు , మోకాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఎక్కువ కాలం వేధిస్తున్నాయా?సాధరణంగా వచ్చే జలుబు, నొప్పులను నిర్లక్ష్యం చేస్తుంటాము, అయితే ఎప్పుడూ వచ్చే సాధరణ లక్షణాలను నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఎందుకంటే ఇవి శరీరంలో ప్రోటీన్స్ లోపించినప్పుడు ఏర్పడుతుంది.

శరీరంలో ప్రోటీనుల లోపం ఉన్నట్లు ఎలా గుర్తిస్తారు?శరీరంలో ప్రోటీనులు లోపించడం వల్ల కనిపించే కొన్ని లక్షణాలను ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది.

శరీరానికి కావల్సిన శక్తిని అందివ్వడంలో సహాయపడటానికి అసవరమయ్యే వాటిలో ప్రోటీన్స్ కు ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. ఇది శరీరంలో కండరాల ఏర్పాటుకు, వ్యాధినిరోధకత పెంచడానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే శరీరంలో ప్రోటీనుల లోపం ఏర్పడుతుందో అప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి.

కొంత మంది బరువు తగ్గించుకోవడం కోసం పాటించే కఠమైన డైట్ నియమాల కారణంగా శరీరంలో ప్రోటీనుల లోపం ఏర్పడవచ్చు. అందువల్ల ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను శరీరానికి అందివ్వాలి. సమతుల్య ఆహారంను తీసుకోవడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. శరీరంలో ప్రోటీన్ల లోపం ఉన్నప్పుడు కనిపించే సంకేతాలు ఈ క్రింది విధంగా...

1. మజిల్స్ వీక్ గా ఉంటాయి:

శరీరానికి సరిగా ప్రోటీనులు అందకపోతే, కండరాలు వీక్ గా మారుతాయి. కాబట్టి, మజిల్స్ స్ట్ర్రాంగ్ గా ఉంచుకోవడం చాలా అసవరం.

2.ముఖం, పాదాలు, చేతులు వాపులు ఏర్పడుతాయి:

ముఖం, పాదాలు, చేతులలో వాపులు కనిపబడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరం మొత్తం నీరెక్కిపోతుంది. ఎప్పుడైతే శరీరంలో ప్రోటీన్లు లోపిస్తాయో అప్పుడు శరీరంలోని నీరు బయటకు నెట్టివేయడంలో విఫలమవుతుంది.

3. జాయింట్ పెయిన్:

మన శరీరంలో కావల్సినన్ని ప్రోటీన్లు లేకపోవడం వల్ల జాయింట్స్ మరియు మజిల్స్ చుట్టు పెయిన్ ఉంటుంది.

4. బ్రెయిన్ ఫాగ్:

నాడీవ్యవస్థ సరిగా పనిచేయాలంటే శరీరంలో తగిన మోతాదులో ప్రోటీన్లు ఉండాలి. శరీరంలో ప్రోటీన్లు లోపించడం వల్ల బ్రెయిన్ పవర్ తగ్గుతుంది. విషయాలను గుర్తుపట్టలేరు, మెదడులో ఆందోళను, గందరగోళం మొదలవుతుంది.

5. ఫ్రీక్వెంట్ అలర్జీలు:

శరీరంలో సరిపడా ప్రోటీన్లు ఉన్నప్పుడు, వ్యాధులను ఎదుర్కోవడానికి అవసరమయ్యే యాంటీబాడీస్ ను డెవలప్ చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ప్రోటీన్స్ లోపించినప్పుడు, ఇమ్యూనిటి లెవల్స్ తగ్గుతుంది . దాంతో తరచూ అలర్జీలకు గురికావల్సి వస్తుంది.

6. ఎప్పుడూ అలసటగా ఉండటం :

శరీరంలో ప్రోటీనులు లోపించడం వల్ల ఎప్పుడు అలసటగా, నీరసంగా ఉంటారు.

7. ఫ్రీక్వెంట్ గా జలుబు చేస్తుంది:

శరీరంలో ప్రోటీన్లు లోపించినప్పుడు ఇమ్యూనిటి లెవల్స్ తగ్గుతాయి. ఇమ్యూనిటి లెవల్స్ తగ్గినప్పుడు తరచూ జలుబు చేస్తుంటుంది.

8. స్వీట్స్ మీద ఎక్కువ కోరికలు కలుగుతాయి:

శరీరంలో ప్రోటీన్లు లోపించినప్పుడు, స్వీట్స్, మీద ఎక్కువ కోరిక కలుగుతుంది. కండరాలకు తగినంత ఎనర్జీ అందివ్వడానికి, నార్మల్ గా పనిచేయడానికి ప్రోటీన్లు చాలా అవసరమవుతాయి.

9. తరచూ ఆకలి పెరుగుతుంది:

ప్రోటీలను సరిపడా ఉన్పప్పుడు,ఎక్కువ సమయం ఆకలి కాకుండా, పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడైతే శరీరంలో ప్రోటీన్లు లోపిస్తుందో, అప్పుడు త్వరగా ఆకలి వేస్తుంటుంది.

10. నిద్రలేమి సమస్యలు:

బ్రెయిన్ హెల్త్ కు అవసరమయ్యే ప్రోటీన్లు లోపించినప్పుడు, హార్మోనులను ఉత్పత్తి చేయడంలో విఫలం అవుతుంది. దాంతో నిద్ర లోపం ఏర్పడుతుంది.

11. గాయాలు మానడం ఆలస్యం అవుతుంది:

శరీరానికి ప్రోటీన్లు ఎక్కువగా అవసరం అవుతాయి. ఇది ఎలాంటి గాయాలనైనా, పుండులను మాన్పుతాయి. ఎప్పుడైతే శరీరంలో ప్రోటీన్లు లోపిస్తాయో, అప్పుడు గాయలు మానడానికి సమయం పడుతుంది.

12. బ్లడ్ షుగర్ ఎక్కువ, తక్కవలు:

శరీరంలో ప్రోటీన్లు రక్తంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి, మీ శరీరంలో ప్రోటీన్లు లోపించనప్పుడు, బ్లడ్ షుగర్ లెవల్స్ లో లోపాలు ఏర్పడుతాయి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

12 Signs That Your Body Is Not Getting Enough Protein

Are cold and pain in the knees and joints troubling you for long? Well, assuming it to be a common cold or pain we might just ignore it, but these common symptoms should not be ignored as these could be due to lack of protein in the body. So how would you find out if your body actually lacks protein? We have listed here a few signs which show that your body is not getting enough protein.
Please Wait while comments are loading...
Subscribe Newsletter