చలికాలంలో పళ్ళ నొప్పులను నివారించే 7 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

ఆరోగ్యం సమస్యల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి దంత సమస్యలు. ముఖ్యంగా చలికాలంలో దంత సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. దంతక్షయం, చిగుళ్ళు వాపులు, చిగుళ్ళు లేదా దంతాలు సలపడం, దంతాల నుండి రక్తస్రావం వంటి సమస్యలు

Posted By:
Subscribe to Boldsky

ఆరోగ్యం సమస్యల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి దంత సమస్యలు. ముఖ్యంగా చలికాలంలో దంత సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. దంతక్షయం, చిగుళ్ళు వాపులు, చిగుళ్ళు లేదా దంతాలు సలపడం, దంతాల నుండి రక్తస్రావం వంటి సమస్యలు ఇబ్బంది కలిగిస్తుంటాయి. చలికాలంలో దంతాలు నొప్పి ప్రారంభమైతే ఆ బాధ అంతా..ఇంతా కాదు, భరించలేనంత గా ఉంటుంది.

టూత్ రూట్ కవర్ కాకుండా ఉండటం, బ్రోకెన్ టూత్, దంత క్షయం, వంటి సమస్యలు ఇబ్బంది పెడుతాయి. నొప్పి ప్రారంభంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదంటే నొప్పి దవడల వరకూ పాకుతుంది. దాంతో తలనొప్పి, నరాలు బలహీనత, నరాలు లాగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

కొంత మంది ఒకసారి డాక్టర్ ను కలిసిన తర్వాత రెగ్యులర్ చెకప్ కు వెళ్ళకుండా సమస్యను మరింత తీవ్రం చేసుకుంటుంటారు. కాబట్టి, చలికాలంలో సమస్యను మరింత తీవ్రం చేసుకోకుండా కొన్ని నేచురల్ టిప్స్ , ఇంట్లోనే ఉపశమనం పొందడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

హైడ్రోజన్ పెరాక్సైడ్:

మొటిమలను నివారించడంలో, మైక్రోస్కోపిక్ ఆర్గానిజం మరియు మరికొన్ని నొప్పులను తగ్గించుకోవడంలో హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను మనం ఉపయోగిస్తామన్న సంగతి తెలిసిందే. అయితే ఇది దంతసమస్యలను కూడా నివారిస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను కొద్దిగా నిటితో మిక్స్ చేసి, నోట్లో పోసుకుని పుక్కిలించాలి. దంతాల నొప్పి, నోట్లో వాసనను తగ్గించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

పెప్పర్-సాల్ట్ :

బ్లాక్ పెప్పర్ ను మెత్తగా పొడిచేసి, దానికి కొద్దిగా సాల్ట్ చేర్చాలి. సెన్సిటివ్ టీత్ కు ఈ రెండు పదార్థాలు గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిలో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు, నొప్పిని, వాపును నయం చేసే గుణాలు అధికంగా ఉన్నాయి. అవసరం అయితే ఈ రెండింటి మిశ్రమంలో కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి, పేస్ట్ లా తయారుచేసి, నొప్పి ఉన్న దంతాల మీద ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. కొద్ది నిముషాలు అలాగే ఉంచి తర్వాత నోరు శుభ్రం చేసుకుంటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

వెల్లుల్లి:

దంతా నొప్పి నుండి త్వరిత ఉపశమనం కలిగించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. వెల్లుల్లిల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు థెరఫిటిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి నొప్పి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి .
ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి (లేదా గార్లిక్ పౌడర్ ను తీసుకోవచ్చు) అందులో కొద్దిగా ఉప్పు, డార్క్ సాల్ట్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కువగా నొప్పి ఉన్న దంతాల మీద అప్లై చేయాలి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కంటెంట్ నొప్పిని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అవసరమైతే తిరిగి రిపీట్ చేయాలి.

లవంగాలు :

దంతాల నొప్పిన తగ్గించడంలో లవంగం నూనె బాగా పాపులర్ రెమెడీ. సాధారణంగా ఇది అన్ని ఇల్లల్లో ఉంటుంది. ఇక లవంగాలు ప్రతి ఇంట్లోను తప్పనిసరిగా ఉండే పోపు దినుసు .

లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, క్యాన్సర్ నివారణ గుణాలు, సెడేటివ్ లక్షణాలు అధికంగా ఉంటాయి, ఇవన్నీ దంతాల నొప్పి, ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. రెండు లవంగాలను పొడిచేసి, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ చేసి, నొప్పి, వాపు ఉన్న దంతాల మీద అప్లై చేయాలి.

మరో చిట్కా లవంగం నూనెలో కాటన్ బాల్ డిప్ చేసి, నొప్పి ఉన్న దంతాల మీద మర్ధన చేయాలి. కొన్ని చుక్కల లవంగం నూనెను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి నోట్లో పోసుకుని మౌత్ వాష్ చేయాలి.

 

జామ ఆకులు:

ఫ్రెష్ గా ఉండే జామ ఆకులు దంతాల నొప్పిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ, అనాల్జిక్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలు దంత సమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. దంతాల నొప్పి ఉన్నప్పుడు ఒకటి రెండు లేలేత జామ ఆకులను తీసుకుని, నమలడం వల్ల దంతాల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

మరో హోం రెమెడీ జామ ఆకులను నీటిలో వేసి కొద్ది సేపు బాయిల్ చేయాలి. 10 నిముషాలు ఉడికించిన తర్వాత , స్టౌ ఆఫ్ చేసి గోరువెచ్చగా చల్లారనివ్వాలి. ఈ వాటర్ లో కొద్దిగా ఉప్పు చేర్చి, ఈ నీటిని మౌత్ వాష్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ రిఫ్రెషింగ్ వాటర్ తో దంతాల నొప్పి, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది.

 

వెన్నిలా ఎక్స్ ట్రాక్ట్ :

వెనీలా ఎక్స్ ట్రాక్ట్ మరో హోం రెమెడీ. ఇది దంతాల నొప్పిని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాటన్ బాల్ ను వెనీలా ఎక్స్ ట్రాక్ట్ లో డిప్ చేసి, నొప్పి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఐస్ క్యూబ్స్ :

ఐస్ క్యూబ్స్ నోట్లో వేసుకుంటే చాలు, ఆ చల్లదనం బ్రెయిన్ వరకూ పాకుతుంది. అదే దంతాల నొప్పి ఉన్నప్పుడు ఆ చల్లదనం నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో కోల్డ్ ప్యాక్స్ కూడా నొప్పిని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

 


సెన్సిటివ్ గా ఉన్న టూత్ బ్రెష్ తో ఎప్పటికప్పుడు బ్రెష్ చేసుకోవడం మంచిది. దంతాలను శ్రుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎలాంటి దంత సమస్యలు రావు.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

7 Home Remedies to Treat Toothache in Winter Season

toothaches can vary greatly, from gentle soreness to an excruciating throbbing pain in your teeth or around your jaws. Some of the main causes of toothaches are pits, a contamination, an uncovered tooth root, a broken tooth, gum ailment, a loose filling, or jaw joint issue.
Please Wait while comments are loading...
Subscribe Newsletter