For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీలో రాళ్ళు గురించి 7 సర్ ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!

కిడ్నీలు సరిగా పనిచేయకపోతే ఈ శరీరంలోని జీవక్రియలన్నీ అస్థవ్యస్థం అవుతాయి. శరీరం మొత్తం వ్యర్థాలు, టాక్సిన్స్ నిల్వ ఉండిపోతాయి. దాంతో కిడ్నీల పనితీరు మరింత క్షీణ స్థితికి చేరుకుంటాయి.

|

ఈ మద్య కాలంలో ఎక్కువ మందిలో కనిపించే సమస్య కిడ్నీలో రాళ్ళు. తీసుకునే ఆహారం, శరీరతత్వం వంటివి స్టోన్స్‌ ఏర్పడటానికి కారణమ వుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు గట్టిగా క్రిస్టల్‌ రూపంలో ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో గానీ, మూత్రనాళాల్లో గానీ ఏర్పడ తాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్లయితే నెఫ్రోలిథియాసిస్‌ అని, మూత్రనాళాల్లో ఉంటే యూరోలిథియాసిస్‌ అని అంటారు. కిడ్నీలో రాళ్ళు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. అయితే స్త్రీలలో కంటే పురుషుల్లో ఎక్కువగా ఏర్పడతాయి. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారి లో ఈ సమస్య కనిపిస్తుంది. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్నప్పుడు కిడ్నీ స్టోన్స్‌ ఏర్పడితే భవిష్యత్తులో మళ్లీ మళ్లీ రావ డానికి అవకాశాలుంటాయి. ఒకటి కంటే ఎక్కువ స్టోన్స్‌ ఏర్పడినప్పు డు కూడా సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది.

మూత్రపిండాలు నడుము భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. అందువల్ల నొప్పి ఈ ప్రాంతంలో మొదలై పొత్తికడుపు వరకు పాకుతుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి తీవ్రత పెరుగుతుంది. మూత్రవిసర్జన తరచు చేయాల్సి రావడం, మూత్రం తక్కువ పరిమాణంలో, మంటగా రావడం, మూత్రం పసుపురంగు లేదా ఎరుపురంగులో రావడం, కడుపులో నొప్పి, వికారం, ఆకలి తగ్గిపోవడం, మలవిసర్జనకు వెళ్ళాల్సి వచ్చినట్లుండటం, తరచుగా వాంతులు అవడం, జ్వరం రావడం.

7 Surprising Facts You Must Know About Kidney Stones!

మన కిడ్నీలు రక్తంను వడగట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీరంలో ద్రవాలను సరైన స్థాయిలో ఉంచడం, శరీరంలోని రసాయనాల సమ తుల్యతను కాపాడటం, వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి తొలగించడం, వివిధ రకాల హార్మోన్లను విడుదల చేయడం. శరీరంలోని ద్రవాలను తొలగించడం లేదా నిలువరించడం మూత్రపిండాలు చేసే విధులలో ప్రధానమైనవి. ఒక వ్యక్తి ఆహారంలో అధిక మొత్తంలో ఉప్పు తీసుకుంటే, ఎక్కువగా దాహం వేసి నీరు ఎక్కువగా తాగుతాడు. అటువంటి సమయాలలో మూత్రపిండాలు అధికంగా ఉన్న ఉప్పును, నీటిని శరీరంనుంచి మూత్రం రూపంలో తొలగిస్తాయి.

కిడ్నీలు సరిగా పనిచేయకపోతే ఈ శరీరంలోని జీవక్రియలన్నీ అస్థవ్యస్థం అవుతాయి. శరీరం మొత్తం వ్యర్థాలు, టాక్సిన్స్ నిల్వ ఉండిపోతాయి. దాంతో కిడ్నీల పనితీరు మరింత క్షీణ స్థితికి చేరుకుంటాయి. కొన్ని మినిరల్స్ బయటకు పోకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ గా మార్పు చెంది, అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కిడ్నీ స్టోన్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ఫ్యాక్ట్ #1

ఫ్యాక్ట్ #1

కిడ్నీ స్టోన్స్ వివిధ రకాలుగా ఏర్పడుతాయి. కాల్షియం స్టోన్స్, యూరిక్ ఆసిడ్ స్టోన్స్, స్టువైట్ స్టోన్స్, సిస్టన్ స్టోన్స్ మొదలగు రూపాల్లో కిడ్నీలలో రాళ్ళ రూపంలో ఏర్పడుతాయి. ఒక్క దానికి ఒక్కో స్వభావం కలిగి ఉండటం వల్ల కిడ్నీల మీద తీవ్ర దుష్ర్పభావం చూపుతుంది.

ఫ్యాక్ట్ # 2

ఫ్యాక్ట్ # 2

కిడ్నీ స్టోన్స్ కారణంగా ఇవి కిడ్నీలోపల వైపు వాల్స్ కు ఒరవడి వల్ల నొప్పి రాదు. యూరిన్ డక్ట్ లేదా బ్లాడర్ లో స్టోన్స్ స్టక్ అవ్వడం వల్ల బ్లాడర్ లేదా పొట్టలో తీవ్రంగా నొప్పి వస్తుంది. వీటిని శరీరం బయటకు నెట్టివేయడానికి కష్టపడినప్పుడు ఇటువంటి నొప్పిని అనుభవిస్తారు.

ఫ్యాక్ట్ # 3

ఫ్యాక్ట్ # 3

పీనట్ బట్టర్, చాక్లెట్స్, స్పినాచ్, కాఫీ , బీర్ మొదలగు ఆక్సలేట్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడుతాయని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో నిర్ధారించారు.

ఫ్యాక్ట్ # 4

ఫ్యాక్ట్ # 4

కిడ్నీ స్టోన్స్ కు మరో సర్ ప్రైజింగ్ రీజన్ కూడా ఉంది, వాతావరణ పరిస్థితుల బట్టి కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయని అంటున్నారు నిపుణులు. ఎక్కువ వేడి ప్రాంతాల్లో నివసించే వారిలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడుటకు కారణమవుతుంది. వీరు శరీరం చాలా త్వరగా డీహైడ్రేషన్ కు కారణమవ్వడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడుతాయి.

ఫ్యాక్ట్ # 5 :

ఫ్యాక్ట్ # 5 :

సెక్స్యువల్ ఇంటర్ కోర్స్ ద్వారా కిడ్నీస్టోన్స్ ను తొలగించుకోవచ్చు. సెక్స్ సమయంలో శరీరంలో విడుదలయ్యే నైట్రిక్ యాసిడ్స్ , మూత్ర నాళాల్లోకి చేరి మూత్ర నాళం పెద్దగా అవ్వడం వల్ల మూత్రం ద్వార రాళ్ళు బయటకు నెట్టివేయడుతాయి.

ఫ్యాక్ట్ # 6 :

ఫ్యాక్ట్ # 6 :

క్యాల్షియం సప్లిమెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడుతాయి. కాబట్టి, క్యాల్షియం సప్లిమెంట్ కు బదులుగా పాలు, ఇతర డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం మంచిది.

ఫ్యాక్ట్ # 6 :

ఫ్యాక్ట్ # 6 :

రెగ్యులర్ గా లెమన్ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలు క్లీన్ అవుతాయి, కిడ్నీలలో స్టోన్స్ ఏర్పడకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

7 Surprising Facts You Must Know About Kidney Stones!

If you are someone who likes to keep yourself informed about the various ailments that can affect your vital organs, then you must read some of these surprising facts on kidney stones.
Desktop Bottom Promotion