నిర్లక్ష్యం చేయకూడని లో బ్లడ్ ప్రెజర్ లక్షణాలు..!!

మనుషుల శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలు, లక్షణాల ద్వారా.. కొన్ని వ్యాధులున్నాయని తెలుపుతుంది. దీనివల్ల వాటిని మొదట్లోనే నివారించవచ్చు. వాటి ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.

Posted By:
Subscribe to Boldsky

మన శరీరం రకరకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలను కొన్ని లక్షణాలు, సంకేతాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. మీకు లో బ్లడ్ ప్రెజర్ ఉంది అంటే.. శరీరం కొన్ని ప్రత్యేక లక్షణాలను సూచిస్తుంది.

మనుషుల శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలు, లక్షణాల ద్వారా.. కొన్ని వ్యాధులున్నాయని తెలుపుతుంది. దీనివల్ల వాటిని మొదట్లోనే నివారించవచ్చు. వాటి ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అయితే కొన్ని లక్షణాల మనం గమనించినా.. మామూలే అని నిర్లక్ష్యం చేస్తుంటాం.

low blood pressure signs

కొన్ని వ్యాధులకు వెంటనే ట్రీట్మెంట్ అందించకపోతే.. తర్వాత చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి.. లో బ్లడ్ ప్రెజర్ ని సూచించే ఆశ్చర్యకర లక్షణాలేంటి ? వాటిని ఎలా గుర్తించాలి ? ఎలా అలర్ట్ అవ్వాలో చూద్దాం..

లో బ్లడ్ ప్రెజర్ లేదా హైపోటెన్షన్ అనేది శరీరంలో బ్లడ్ ప్రెజర్ ని బట్టి వచ్చే సమస్యలు. సాధారణ బ్లడ్ ప్రెజర్ 90/60 ఉండాలి. లో బ్లడ్ ప్రెజర్ కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రెగ్నన్సీ, థైరాయిడ్ ప్రాబ్లమ్, డిప్రెషన్, అలసట, వడదెబ్బ, గుండె సమస్యలు మొదలైనవి.

మైకం, తలతిరగడం

మైకం, తలతిరగడం వంటివి చాలా అనారోగ్య సమస్యలతో ముడిపడి ఉంటాయి. ఇది లో బ్లడ్ ప్రెజర్ కి సంకేతం కావచ్చు. చాలా తరచుగా తల తిరగడం వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారంటే.. ఒకసారి బ్లడ్ ప్రెజర్ చెక్ చేయించుకోవడం మంచిది.

ఏకాగ్రత కోల్పోవడం

ఏకాగ్రత కోల్పోవడం వంటి లక్షణాలు కూడా లో బ్లడ్ ప్రెజర్ ని సూచిస్తాయి. ఒకవేళ మీరు లో బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నారంటే.. మెదడుకి ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది. దీనివల్ల ఏకాగ్రత కోల్పోతారు.

డీహైడ్రేషన్

చాలా తరచుగా మీరు డీహైడ్రేసన్ సమస్యను ఎదుర్కొంటున్నారంటే.. హైపోటెన్షన్ చెక్ చేయించుకోవడం మంచిది. హైపోటెన్ష్ వల్ల శరీరం ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్ ని కోల్పోతుంది. కారణంగా డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది.

బ్లర్ గా కనిపించడం

లో బ్లడ్ ప్రెజర్ ని సూచించే మరో లక్షణం.. కంటిచూపు మందగించడం, బ్లర్ గా కనిపించడం. చాలా అరుదైన సందర్భాల్లో.. హైపోటెన్షన్ ని మొదట్లోనే ట్రీట్ చేయకపోతే.. శాశ్వతంగా కంటిచూపు మందగిస్తుంది.

నిర్జీవమైన చర్మం

లో బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవాళ్లు.. తరచుగా జలుబు, చర్మం నిర్జీవంగా మారడం, చల్లగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా రక్తం సరఫరా కానప్పుడు ఈ లక్షణం కనిపిస్తుంది.

గుండె దడ

లో బ్లడ్ ప్రెజర్ కి మరో లక్షణం గుండె దడ లేదా వేగంగా.. గుండె కొట్టుకోవడం. లో బ్లడ్ ప్రెజర్ వల్ల గుండె రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి.

తీవ్ర అలసట

తరచుగా ఇబ్బందిపెట్టే అలసటను చాలా మంది చాలా నిర్లక్ష్యం చేస్తారు. కానీ.. ఇది కూడా లో బ్లడ్ ప్రెజర్ కి సంకేతం కావచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యను మీరు ఎదుర్కొంటున్నారు అంటే.. ఒకసారి డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

7 Surprising Signs Of Low Blood Pressure You Must Not Ignore

7 Surprising Signs Of Low Blood Pressure You Must Not Ignore. Listed here are a few surprising signs of low blood pressure or hypotension that must never be ignored in order to avoid major health complications!
Please Wait while comments are loading...
Subscribe Newsletter