For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సువాసనభరిత లవంగం నూనెలో అద్భుతమైన ప్రయోజనాలు ..

|

లవంగం అంటే కేవలం మసాలా దినుసనో, సుగంధద్రవ్యమనో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. రుచి కోసం కూరలలో వేసుకునే ఈ లవంగాలలో సువాసనే కాదు విలువైన పోషకాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ప్రతి ఇంట్లో సుపరిచితమైన వంటింటి వస్తువు. ప్రతి డిష్ లోనూ ఉపయోగించే మసాలా దినుసు. వీటిలో వాసనే కాదు విలువైన పోషకాలు కూడా ఉంటాయి. మాంసాహార వంటల్లోనే కాదు, మసాలా ఘాటు తగలాలంటే శాకాహార వంటల్లోనూ లవంగం మెగ్గ పడాల్సిందే. లేకుంటే కిక్కే రాదంటారు మసాలా ప్రియులు .

ఇండోనేషియాలోని స్పైస్ ఐల్యాండ్స్ గా పిలిచే మొలక్కస్ దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బ్రెజిల్, ఇండియా, వెస్టిండీస్, మారిషస్, జాంజిబార్, శ్రీలంక, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు. మిర్టేసీ మొక్క నుండి కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారి లవంగాల ఆకారాన్ని సంతరించుకుంటాయి. ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగించే ఈ లవంగాల నుండి నూనెలను కూడా తీస్తారు.

ఈ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రోటీన్స్, క్యాల్షియం, ఫైబర్, ఐరన్, జింక్, నియాసిన్, ఫొల్లెట్, ఇనుము, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఎ, బి, సి, మరియు ఇ, కె, డిలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అందుకే మనం ఉపయోగించే మెడిసిన్స్ అన్నింటీని లవంగం, మరియు లవంగం నూనె రీప్లేస్ చేస్తుంది .అందుకే ఇది గ్రేట్ నేచురల్ రెమెడీగా భావిస్తారు .

ఎలాంటి రిమార్క్స్ లేని ఆరోమా వాసన కలిగిన ఎసెన్సియల్ ఆయిల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక అనారోగ్య సమస్యలను నివారించుకోవడంలో గ్రేట్ గా ఉపయోగిస్తున్నారు

1. డెంటల్ కేర్ :

1. డెంటల్ కేర్ :

కొన్ని వేల శతాబ్దాల కాలం నుండి ఇటువంటి ఔషధ విలువలున్న నూనెను ఆయుర్వేదంగా తీసుకుంటున్నారు. లవంగం నూనె దంతలా నొప్పి, డెంటల్ ఇన్ఫెక్షన్స్ నివారించడలో గ్రేట్ గా సహాయపడుతుంది. లంగం నూనెలో ఉండే జర్మిసెల్ లక్షణాలు, దంత సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది, ఇది లవంగం నూనెను న్లోట్ అప్లై చేస్తే చాలా నొప్పి నుండి , అసౌకర్యం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

2. తలనొప్పి :

2. తలనొప్పి :

కొబ్బరి నూనెలో కొద్దిగా లవంగం నూనె మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. లవంగం నూనెలో నయం చేసే గుణాలుండటం వల్ల ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. అయితే శాశ్వతంగా నివారిస్తున్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు , కానీ తాత్కాలికంగా మాత్రం ఇది గ్రేట్ గా రిలీఫ్ ఇస్తుంది.

3. అజీర్థం :

3. అజీర్థం :

జీర్ణ సమస్యల విషయం లవంగం నూనె గ్రేట్ గా సహాయపడుతుంది . రెగ్యులర్ డైట్ లో లవంగం నూనె చేర్చుకునే వారు , జీర్ణ సమస్యలను ఎఫెక్టివ్ గా నివారించుకోగలరు .

4. శ్వాస సంబంధిత సమస్యలు :

4. శ్వాస సంబంధిత సమస్యలు :

లవంగం నూనెలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది శ్వాస సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహయపడుతుంది. అయితే దీన్ని ఉపయోగించే విధానం తెలుసుకుని ఉండాలి . వేడి నీటిలో కొద్దిగా లవంగం నూనె మిక్స్ చేసి ఆవిరి పట్టడం వల్ల శ్వాస సమస్యల నుండి తక్షణ ఉపశమనం పొందుతారు.

5. ఇన్ఫెక్షన్స్ :

5. ఇన్ఫెక్షన్స్ :

పురాతన కాలం నుండి లవంగం నూనెను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు . ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. లవంగం నూనెలో యాంటీ సెప్టిప్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షనాలు ఎక్కువగా ఉన్నందున , ఈ లక్షణాలన్నీ ఇన్ఫెక్షన్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

6. స్ట్రెస్ :

6. స్ట్రెస్ :

లవంగం నూనెతో మరో అమేజింగ్ బెనిఫిట్. దీన్ని ఉపయోగించడం వల్ల ఇది స్ట్రెస్ రిలీవర్ గా పనిచేస్తుంది. లవంగం నూనెలో ఉండే ఆరోమా వాసన స్మూతింగ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటుంది. బ్రెయిన్ మీద ఓవర్ గా పనిచేస్తుంది. బ్రెయిన్ ను రిలాక్స్ చేస్తుంది.

7. వికారం తగ్గిస్తుంది:

7. వికారం తగ్గిస్తుంది:

లవంగం నూనె వికారం, వాంతులను తగ్గించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. ఇది ఏజ్ ఓల్డ్ రెమెడీ . చాల మంది పిల్లలో కవర్ మీద లవంగం నూనె చల్లుకుని పడుకుంటారు. ఇలా చేయడం వల్ల వికారం తగ్గిస్తుందని నమ్ముతారు. వాంతులు కూడా తగ్గిస్తుంది.

English summary

7 Ways To Benefit From Clove Oil

In this day and age, most of us turn to over-the-counter medicines to get relief from just about anything. That's because there are a plethora of pills available that can provide relief in no time. But over-indulgence in these medicines can adversely affect the health and overall wellness of an individual.
Story first published:Monday, August 29, 2016, 12:47 [IST]
Desktop Bottom Promotion