త్రేన్పుల గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఫ్యాక్ట్స్..!

సడెన్ గా..మీకు చాలా పెద్దగా త్రేన్పు వచ్చింది. దీంతో.. అనుకోకుండా.. మీరు నలుగురిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయారు. దీంతో చాలా ఇబ్బందికి గురవుతుంటారు. ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తారు.

Posted By:
Subscribe to Boldsky

పబ్లిక్ లో త్రేన్పు వచ్చినప్పుడు.. మనం చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటాం. అయితే.. ఈ త్రేన్పులు ఎందుకు వస్తాయో తెలుసా ? త్రేన్పులు మీ ఆరోగ్యాన్ని సూచిస్తాయని ఎప్పడైనా విన్నారా ? గమనించారా ? అయితే.. ఇక్కడ త్రేన్పుల గురించి.. ఆశ్చర్యకర ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.

burps facts

మీటింగ్ లో ఉన్నారు లేదా మీకు కాబోయే పార్ట్ నర్ తో షికారుకి వెళ్లారు. అయితే.. సడెన్ గా..మీరు చాలా పెద్దగా త్రేన్పు వచ్చింది. దీంతో.. అనుకోకుండా.. మీకు నలుగురిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయారు. దీంతో చాలా ఇబ్బందికి గురవుతుంటారు. ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసి ఉంటారు.

అయితే త్రేన్పు రావడం అనేది చాలా సాధారణం. ఆరోగ్యకరం కూడా. కానీ పదిమందిలో ఉన్నప్పుడు త్రేన్పు వస్తే ఇబ్బందిగానే ఉంటుంది. పొట్ట నుంచి గాలి లేదా గ్యాస్ నోటి ద్వారా విడుదలైనప్పుడు బ్రేయ్ మంటూ.. త్రేన్పు పెద్దగా వస్తుంది. ఇప్పుడు త్రేన్పుల గురించి.. హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం..

త్రేన్పులు

భోజనం చేసిన తర్వాత 3 నుంచి 4 సార్లు త్రేన్పు వస్తే.. అది సాధారణంగా భావించాలి. అయితే కొన్నిసార్లు చాలా తరచుగా త్రేన్పు రావడం, నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించాయంటే.. మరో కారణం ఏదో ఉందని గ్రహించాలి.

డిజార్డర్

త్రేన్పులు వస్తే.. సప్రాగ్యాస్ట్రిక్ బెల్చింగ్ డిజార్డర్ అని పిలుస్తారు. ఎక్కువ మొత్తంలో గాలి పీల్చడం వల్ల.. ఆ వ్యక్తికి చాలా తరచుగా త్రేన్పులు వస్తాయి. ఈ వ్యాధి నివారించడానికి బిహేవియరల్ థెరపీ ఉంది.

గ్యాస్ట్రో

గ్యాస్ట్రోపారెసిస్ అనే మరో సందర్భంలో కూడా త్రేన్పులు వస్తాయి. పొట్టలోని కండరాలు పక్షవాతానికి గురైనప్పుడు మరియు పొట్టలో ఆహారం పూర్తీగా ఖళీ అయినప్పుడు చాలా తరచుగా త్రేన్పులు వస్తాయి.

గొంతు సమస్యలు

గొంతుకి సంబంధించిన సమస్యలు, గొంతులో వాపు వంటి సమస్యలు ఉన్నప్పుడు.. ఆహారం మింగడం వల్ల.. వాళ్లకు.. త్రేన్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

దుర్వాసన

మీకు త్రేన్పు వచ్చినప్పుడు.. దుర్వాసన కూడా వచ్చినట్టు గమనించారంటే.. మీరు అజీర్ణం సమస్యతో బాధపడుతున్నారని సూచిస్తుంది. కాబట్టి.. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

బరువు తగ్గడం

చాలా తరచుగా త్రేన్పులు వస్తున్నాయంటే.. చెప్పలేని రీతిలో మీరు బరువు తగ్గడానికి, ఆకలి తగ్గిపోవడానికి కారణమవుతుంది. ఇది అన్నవాహిక క్యాన్సర్ కి సంకేతం కావచ్చు. అన్నవాహికలో ట్యూమర్ కూడా.. త్రేన్పులకు కారణం అవుతుంది.

యాసిడ్ రిఫ్లక్స్

తరచుగా త్రేన్పు రావడం.. యాసిడ్ రిఫ్లక్స్ కి సంకేతం కావచ్చు. దీన్ని చాలా నిర్లక్ష్యం చేసినా, ట్రీట్మెంట్ అందించకపోయినా.. పొట్టలో అల్సర్లకు కారణమవుతుంది.

సర్జరీలు

గతంలో పొట్టలో సర్జరీలు చేయించుకున్న వాళ్లకు, ప్రేగులు తొలగించిన వాళ్లకు ఎప్పటికీ.. త్రేన్పులు రావు.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

8 Surprising Health Facts About Your Burps That You Must Know

8 Surprising Health Facts About Your Burps That You Must Know. Listed below are some of the interesting health facts on burping, or belching, which you must make yourself aware of. Read along.
Please Wait while comments are loading...
Subscribe Newsletter