For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో హానికారక మలినాలను వెంటనే.. తొలగించాలని తెలిపే సంకేతాలు..!

By Swathi
|

మనం మోడ్రన్ ప్రపంచంలో ఉన్నామని హ్యాపీగా ఫీలవుతుంటాం. అంతా టెక్నాలజీ ఉపయోగించుకుంటూ.. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉన్నామని భావిస్తుంటాం. కానీ.. ఈ మోడ్రన్ ప్రపంచపు అలవాట్లు, అభిరుచులు.. మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయనేది మాత్రం ఎవరూ సరిగా గ్రహించలేకపోతున్నారు.

వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, మనం ప్రతిరోజూ ఉపయోగించే ప్రొడక్ట్స్, కాస్మొటిక్స్, ఆహారం, గాలి, మందులు చాలా మనకు చాలా డేంజరస్ డ్యామేజ్ చేస్తున్నాయి. ఇలాంటి అనేక రకాల వ్యాధులను నివారించడానికి.. శరీరాన్ని డెటాక్స్ చేయాలి.

టైం టు టైం శరీరంలో పేరుకున్న మలినాలపై కన్నేయాలి. ఎప్పటికప్పుడు వాటిని బయటకు పంపకపోతే.. ప్రాణాంతక వ్యాధులు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శరీరంలో మలినాలను ఇప్పటికిప్పుడే.. వెంటనే బయటకు పంపేయాలని తెలిపే డేంజరస్ సంకేతాలేంటో చూద్దాం.. ఈ సంకేతాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.

ఎనర్జీ తగ్గిపోవడం

ఎనర్జీ తగ్గిపోవడం

రోజంతా గడిచాక.. అలసిపోవడం కామన్. కానీ.. రోజంతా.. అలసటగా కనిపించడం, రోజంతా నీరసంగానే ఫీలవుతున్నారంటే.. ఖచ్చితంగా మీ శరీరంలో మలినాలు పేరుకున్నాయని సంకేతం. కాబట్టి.. వెంటనే వాటిని బయటకు పంపాలని సూచిస్తుంది.

బ్లోటింగ్

బ్లోటింగ్

టాక్సిన్స్ వల్ల శరీరంలో ఆందోళన, కోపం, నెగటివ్ ఫీలింగ్ కూడా ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో మలినాల వల్ల కడుపు ఉబ్బరం సమస్య అనేది.. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్.

ఇన్సోమియా

ఇన్సోమియా

నమ్మినా నమ్మకపోయినా.. శరీరంలో టాక్సిన్స్ పేరుకున్నప్పుడు నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. ఇవి టిష్యూలో పేరుకుపోవడం వల్ల .. బ్లడ్ ఫ్లోకి ఆటంకం ఏర్పడుతుంది.

తలనొప్పి

తలనొప్పి

శరీరంలోని నరాల వ్యవస్థలో మలినాలు చేరుకుంటే.. తలనొప్పి సమస్యకు కారణమవుతుంది.

పిత్తం

పిత్తం

గాల్ బ్లాడర్ లో తీవ్రంగా పిత్తదోషం వస్తోంది అంటే.. లివర్ లో చాలా ఎక్కువగా టాక్సిన్స్ పేరుకుపోయాయని సంకేతం.

తెల్లటి లేదా పసుపు నాలుక

తెల్లటి లేదా పసుపు నాలుక

నాలుక రంగులో మార్పులు కనిపించాయంటే.. రక్తంలో మలినాలు చేరుకున్నాయని తెలుపుతుంది. లాలాజలం తగ్గడం వల్ల మైక్రో ఆర్గానిజంమ్స్ ఉత్పత్తి చేయడానికి నాలుక ఎనర్జీని కోల్పోతుంది.

శరీర ఉష్ణోగ్రత

శరీర ఉష్ణోగ్రత

శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగినప్పుడు.. కాలేయం లోపల ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడిని తగ్గించే ప్రక్రియలో శరీరం చెమటను బయటపెడుతుంది. ఇవన్నీ శరీరంలో మలినాలు ఎక్కువ అయ్యాయని తెలిపే సంకేతాలు.

చర్మ సమస్యలు

చర్మ సమస్యలు

చర్మంలో మలినాలు పేరుకుంటే.. దురద, వాపు, ఇరిటేషన్ వంటి సమస్యలు కనిపిస్తాయి.

సైనస్

సైనస్

శరీరంలో ఎక్కువ మొత్తంలో మలినాలు చేరుకున్నప్పుడు.. సైనస్ సమస్య వస్తుంది. ఇలాంటి లక్షణాలను గుర్తించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే అలర్ట్ అవ్వాలి.

English summary

9 Alarming Signs Telling you Flush Toxins From your Body Now!

9 Alarming Signs Telling you Flush Toxins From your Body Now! We are leaving in a modern world but depending from which point we are looking, it might not be the best thing since we are surrounded we so many toxins.
Story first published: Friday, September 23, 2016, 10:20 [IST]
Desktop Bottom Promotion