రోజూ వంటల్లో చిటికెడు పసుపు చేర్చితే పొందే అద్భుత ప్రయోజనాలు..!

పసుపులో శరీరంకు అవసరమయ్యే అనేక న్యూట్రీషియన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ బి, సి, ఇ, మరియు కె లు, ఐరన్, క్యాల్షియం, ఫైబర్ మరియు మెగ్నీషియంలు కూడా అత్యధికంగా ఉన్నాయి. రెగ్యులర్ వంటకాల్లో పసుపును

Posted By:
Subscribe to Boldsky

మన భారతీయ సంప్రదాయంలో పసుపు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు, పసుపులో పురాతన కాలం నుండి వాడుకల్లో ఉన్నది, వంటలకు, ఆయుర్వేదపరంగా, ఔషధంగా, శుభకార్యాల్లో ముఖ్యమైన పదార్థంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. రోజూ ఇంట్లో వండే ఆహారల్లో పసుపు తప్పనిసరిగా జోడిస్తుంటారు.ఇండియన్ మసాలా దినుసుల్లో ఉండే ఈ ఎల్లో కలర్ స్పైసీస్ ను వంటలకు ఉపయోగించడం వల్ల ఆహారానికి మంచి రంగు వస్తుంది. అంతే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

రెగ్యులర్ గా వండే ఆహారాల్లో చిటికెడు పసుపు చేర్చడం వల్ల అనేక వ్యాధులను నివారించుకోవచ్చు. జబ్బులను నయం చేసుకోవచ్చు. వంటలకు మాత్రమే కాదు, పాలలో చిటికెడు పసుపు చేర్చి తాగడం వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ను పొందుతారు.ఇది అపోహ కాదు, వాస్తవం, ఎందుకంటే ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే మెడిసినల్ లక్షణాలు వల్లే ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది కాబట్టి రెగ్యులర్ డైట్ లో దీన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలని అంటున్న ఆరోగ్య నిపుణులు.

పసుపు పాలలోని అద్భుతమైన బ్యూటీ&హెల్త్ బెనిఫిట్స్

అదనంగా, పసుపులో శరీరంకు అవసరమయ్యే అనేక న్యూట్రీషియన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ బి, సి, ఇ, మరియు కె లు, ఐరన్, క్యాల్షియం, ఫైబర్ మరియు మెగ్నీషియంలు కూడా అత్యధికంగా ఉన్నాయి.

రెగ్యులర్ వంటకాల్లో పసుపును జోడించడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

జీర్ణశక్తిని పెంచుతుంది:

పసుపు బైల్ ను ఉత్పత్తి చేస్తుంది . బ్యాక్టీరియల్ గ్రోత్ ను పెంచుతుంది. దాంతో జీర్ణశక్తి పెరుగుతుంది. చిటికెడు పసుపును పాలలో లేదా నీళ్ళలో మిక్స్ చేసి తాగడం వల్ల జీర్ణశక్తి మరింత పెరుగుతుంది.

జలుబుతో పోరాడుతుంది:

పసుపులో కుర్కుమిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది జలుబు, దగ్గును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చిటికెడు పసుపును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల లేదా వేడి పాలలో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

గాయాలు నయం అవుతాయి:

ఇందులో యాంటీబ్యాక్టియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. గాయాలైనప్పుడు, గాయల మీద చిటికెడు పసుపును అప్లై చేయడం వల్ల త్వరగా నయం అవుతుంది, తర్వాత ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

క్యాన్సర్ ను నివారిస్తుంది:

పసుపులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. రెగ్యులర్ గా వండే వంటల్లో చిటికెడు పసుపు చేర్చడం వల్ల కోలన్, ప్రొస్టేట్, బ్రెస్ట్ ,నివారిస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైంది.

ఆర్థ్రైటిస్ పెయిన్ తగ్గిస్తుంది:

పసుపులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి పసుపును కంటిన్యూగా రెగ్యులర్ వంటల్లో చేర్చుకోవడం వల్ల ఆర్థ్రైటిస్ పెయిన్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది:

పసుపులో కుర్కుమిన్ అనే కాంపౌండ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. దాంతో డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి, దాల్, కర్రీస్, రైస్ వంటి వాటిల్లో చిటికెడు పసుపు చేర్చుకోవడం మంచిది.

కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గిస్తుంది:

మీ డైలీ డైట్ లో చిటికెడు పసుపు చేర్చడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతుంది. ఇది రీసెర్చ్ ద్వారా నిర్ధారించబడినది. రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది, బాడీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది.

కాలేయ వ్యాధులను నివారిస్తుంది:

పసుపులో ఉండే కుర్కుమిన్ కాంపౌండ్ యాంటీఆక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆల్కహాల్, ఫ్యాటీ ఫుడ్స్ వల్ల లివర్ కు ఎఫెక్ట్ కాకుండా సహాయపడుతుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Add A Pinch Of Turmeric To Your Food Every Day And See What Happens!

In addition to this, turmeric also contains several nutrients that are essential for our body. It is rich in vitamins B, C, E and K, iron, calcium, fibre and magnesium. The health benefits of adding a pinch of turmeric to your daily food are discussed below. Take a look.
Please Wait while comments are loading...
Subscribe Newsletter