For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రీజ్ చేసిన నిమ్మకాయలో దాగున్న హెల్త్ సీక్రెట్స్..!!

By Swathi
|

ఆరోగ్యానికి నేచర్ అద్భుతమైన రెమిడీస్ అందిస్తుంది. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. కొన్ని రకాల పదార్థాలు.. న్యాచురల్ గా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ వంటి వాటిని కాస్త విభిన్నంగా ఉపయోగిస్తే.. మీ హెల్త్ మీ చేతుల్లో ఉంటుంది.

అలాంటి వాటిల్లో అత్యంత అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది నిమ్మకాయ. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక రకాల వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. అయితే.. నిమ్మకాయను మనం సాధారణంగా.. రసం తీసి తొక్క పడేస్తుంటాం. కానీ.. నిమ్మతొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని లేటెస్ట్ స్టడీస్ చెబుతున్నాయి.

అయితే నిమ్మతొక్కను డైరెక్ట్ గా తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి దాన్ని డీప్ ఫ్రీజ్ లో పెట్టి.. గ్రేట్ చేసి వంటకాల్లో ఉపయోగించడం వల్ల అమేజింగ్ బెన్ఫిట్స్ పొందవచ్చట. ఇలా ఫ్రోజెన్ లెమన్ లో అమోఘమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఈ టెక్నిక్ తో హెల్తీ లైఫ్ పొందడం ఎలాగో చూద్దాం..

నిమ్మతొక్క ఉపయోగించడం ఎలా

నిమ్మతొక్క ఉపయోగించడం ఎలా

నిమ్మకాయను ఒక రోజంతా డీప్ ఫ్రీజర్ లో పెట్టాలి. తర్వాత.. బయటకు తీసి రెండువైపులా తొనలు కట్ చేసి.. తురుము కోవాలి. ఈ తురుముని వంటకాలపై చల్లుకుని తీసుకోవాలి. అంతే.

నిమ్మతొక్కలో పోషకాలు

నిమ్మతొక్కలో పోషకాలు

నిమ్మరసంలో కంటే.. నిమ్మతొక్కలో 10 రెట్లు ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. నిమ్మకాయలో క్యాల్షియం, జింక్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, బి6, సి, ఈ ఉంటాయి.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

ఫ్రోజెన్ లెమన్ రెగ్యులర్ గా వచ్చే అనారోగ్య సమస్యలైన జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటి వాటిని ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఎందుకంటే.. ఫ్రీజ్ చేసిన లెమన్ ఇమ్యునిటీని వేగంగా పెంచుతుంది.

ఫ్రీజ్ చేయడం వల్ల

ఫ్రీజ్ చేయడం వల్ల

నిమ్మకాయను వండటం ద్వారా.. అందులోని పోషక గుణాలు 40 శాతం కోల్పోతుంది. అదే నిమ్మకాయను ఫ్రీజ్ చేసి ఉపయోగించడం వల్ల.. అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. టేస్టీగానూ ఉంటుంది.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్

నిమ్మకాయ శరీరంలో పేరుకున్న అదనపు కొలెస్ట్రాల్ ని కరిగించడంలో సహాయపడుతుంది. బ్లడ్ లో పేరుకున్న లిపిడ్స్ ని తొలగించడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

ప్రతిరోజూ 75 గ్రాముల నిమ్మకాయను తీసుకోవడం వల్ల.. చాలా హెల్తీగా, ఎఫెక్టివ్ గా బరువు తగ్గుతారని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

హానికారక మలినాలు

హానికారక మలినాలు

నిమ్మకాయ కూడా ఇతర పండ్లు, కూరగాయల మాదిరిగానే.. శరీరంలోని హానికారక మలినాలను బయటకు పంపి.. నూతనోత్తేజాన్ని ఇస్తుంది.

క్యాన్సర్

క్యాన్సర్

నిమ్మకాయ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. నిమ్మతొక్క తురుముని ఆహారాల్లో మిక్స్ చేసి తీసుకుంటూ ఉండటం వల్ల అనేక రకాల ట్యూమర్స్, సిస్ట్ లతో పోరాడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరకుండా అడ్డుకుంటుంది.

పురుగులు

పురుగులు

పొట్టలో ఉండే పరాన్నజీవులు, పురుగులను బయటకు పంపడంలో నిమ్మకాయ అద్భుతంగా సహాయపడుతుంది.

బీపీ

బీపీ

నిమ్మ రసంను మాత్రమే కాకుండా.. మొత్తం తొక్కతో సహా ఆహారాలలో ఉపయోగించడం వల్ల.. హై బ్లడ్ ప్రెజర్ ని రెగ్యులేట్ చేస్తుంది.

ఒత్తిడి

ఒత్తిడి

అలాగే నిమ్మకాయను ఫ్రీజ్ చేసి.. తొక్కతో సహా తురుమి వంటకాల్లో ఉపయోగించడం వల్ల.. ఒత్తిడి, వర్క్ ప్రెజర్, నరాల బలహీనత, భయం, ఆందోళన వంటి సమస్యల నుంచి కూడా తేలికగా బయటపడవచ్చు.

వంటకాలు

వంటకాలు

పంచదార లేని పెరుగులో, సలాడ్స్, గ్రీన్ టీ వంటి వాటిపై ఈ నిమ్మతొక్క తురుముని చల్లుకుని తీసుకుంటే.. మంచి ఫ్లేవర్ తో పాటు, టేస్ట్ గా కూడా ఉంటుంది.

English summary

Amazing Health Benefits of Frozen Lemons

Amazing Health Benefits of Frozen Lemons. Nature can give us the best remedies for our health. You don’t need to spend money on the expensive chemicals just to stay healthy and fit.
Desktop Bottom Promotion