అల్లం, ఉప్పు కలిపి నమిలితే ఏమవుతుందో తెలుసా ?

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల గొంతులో, శ్వాసనాళాల్లో ఉన్న టాక్సిన్స్ ని తొలగిస్తాయి. అలా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఎలర్జీలను నివారిస్తుంది. ఆస్తమా, బ్రొంకైటిస్ దగ్గుని నివారిస్తుంది.

Posted By:
Subscribe to Boldsky

అజీర్ణాన్ని నివారించడంలో.. అల్లం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే ఇతర పొట్టలోని సమస్యలన్నింటికీ.. అల్లం చక్కటి పరిష్కారం. కానీ మీకు తెలుసా.. అల్లం దగ్గుని న్యాచురల్ గా నివారిస్తుందని ? మన పూర్వీకులు దగ్గు నివారించడానికి అల్లం, ఉప్పు కలిపి తీసుకునేవాళ్లట. ఇది.. చటుక్కున దగ్గుని నయం చేసేదట.

ginger and salt

కాబట్టి.. ఇకపై మీరు ఎప్పుడైనా.. దగ్గుతో బాధపడితే.. వెంటనే అల్లం, ఉప్పు కలిపి తీసుకోండి. ఈ ఎఫెక్టివ్ రెమెడీ.. వెంటనే దగ్గు నుంచి రిలాక్సేషన్ ని ఇస్తుంది. అల్లంలో శ్వాససంబంధిత సమస్యలు నివారించే గుణాలుంటాయి.

అలాగే అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల.. గొంతులో, శ్వాసనాళాల్లో ఉన్న టాక్సిన్స్ ని తొలగిస్తాయి. అలా.. దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఎలర్జీలను నివారిస్తుంది. ఆస్తమా, బ్రొంకైటిస్ దగ్గుని నివారిస్తుంది.

ginger

ఎలా ఉపయోగించాలి ?
అల్లంతోపాటు, ఉప్పు కలిపి కాసేపు నమలడం వల్ల.. దగ్గుని నివారించవచ్చు. అయితే.. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ఇది నమలడం సాధ్యం కాదు అనుకునేవాళ్లు.. అల్లం డికాషన్ తీసుకోవచ్చు.

cough

అల్లం, సాల్ట్
ముందుగా అల్లంను పొట్టు తీసి.. దానిపై ఉప్పు చల్లుకోవాలి. ఇప్పుడు.. దాన్ని నములుతూ.. రసం మింగేయాలి. కాస్త ఘాటుగా ఉంటుంది. నమలడం కష్టంగా ఉంటుంది. ఈ అల్లం, సాల్ట్ మొత్తం తీసుకున్న తర్వాత కొద్దిగా తేనె తీసుకుంటే.. ఆ ఘాటు తగ్గుతుంది.

ginger decoction

అల్లం డికాషన్
ఒకవేళ అల్లం నమలడం కష్టంగా భావించేవాళ్లు.. అల్లం డికాషన్ తో సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఒక గ్లాసునీటిని మరిగించాలి. అందులో కొన్ని అల్లం ముక్కలు వేయాలి. అలాగే చిటికెడు ఉప్పు కలిపి.. ఉడికించాలి. నీళ్లు సగం అయిన తర్వాత.. వేడిగా ఉండగా తాగాలి. ఈ రెండు రెమెడీలు.. దగ్గ, శ్వాస సంబంధ సమస్యలను తక్షణమే తగ్గిస్తాయి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Amazing Health Benefits of Ginger and salt

Amazing Health Benefits of Ginger and salt. This home remedy for dry cough works like a charm!
Please Wait while comments are loading...
Subscribe Newsletter