మొలకెత్తిన గింజలు హెల్తీనా, అపోహ మాత్రమేనా ?

Posted By:
Subscribe to Boldsky

మనం చిన్నవయసులో ఉన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం.. మొలకెత్తిన గింజలు చాలా హెల్తీ అని చెబుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని కంపల్సరీ తినాలని సూచిస్తూ ఉంటారు. అయితే.. ఈ మొలకెలు నిజంగా హెల్తీయేనా, మనం ఊహించనన్ని ప్రయోజనాలు వీటిలో ఉన్నాయా ?

sprouts

ఇప్పుడున్న నాలెడ్జ్, తెలివితేటల కారణంగా.. మనం తీసుకునే ప్రతి ఆహారం గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. కొన్ని ఆహారాలు తినవచ్చా తినకూడదా, డైలీ డైట్ లో చేర్చుకోవచ్చా లేదా అన్న అనేక డౌట్స్ వస్తూ ఉంటాయి.

అంతేకాదు.. కొన్ని ఆహారాలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ని కొంతమంది అత్యంత ఆరోగ్యకరం అని చెబితే.. మరికొందరు వాటిని అన్ హెల్తీ అని చెబుతుంటారు. మనం ఊహించినన్ని పోషకాలు ఉండవని చెబుతుంటారు. దీనివల్ల చాలా అయోమయం నెలకొంటుంది.

sprouts health benefits

ఇప్పుడు మొలకెత్తిన గింజలు, ధాన్యాలు ఎంత వరకు ఆరోగ్యం, వీటిని ప్రతిరోజూ డైట్ లో చేర్చుకోవచ్చా లేదా అనేది తెలుసుకుందాం. స్ప్రౌట్స్ గా పిలిచే.. ఈ మొలకలను పెసరపప్పు, శనగలతో తయారు చేసుకుంటాం. కొన్నిసార్లు నట్స్ ఉపయోగించి కూడా తయారు చేసుకుని సలాడ్స్, ఇతర వంటకాల్లో వాడుతాం.

మొలకెత్తిన గింజలు్లో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయని, వీటిని ఎక్కువగా తీసుకోవాలని, వయసుతో పరిమితం లేకుండా.. అందరికీ ఆరోగ్యకరమే చాలామంది సూచిస్తారు. అయితే మొలకెత్తిన తర్వాత ఈ గింజల్లో కొన్ని రకాల ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి చాలా హెల్తీ. ఇవి చాలా తేలికగా జీర్ణమవుతాయి.

sprouts

మొలకల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగుంటాయని.. శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. కాబట్టి.. ఎలాంటి సందేహం లేకుండా ప్రతిరోజూ ఒక కప్పు మొలకలు తీసుకుని.. మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Are Sprouted Grains Actually Healthy Or Is It Just A Myth?

Are Sprouted Grains Actually Healthy Or Is It Just A Myth? Are you curious to know if sprouted grains are healthy? Find out here!
Please Wait while comments are loading...
Subscribe Newsletter