తరచుగా పాదాల వాపు వస్తోందా ? వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే..!

మీ పాదాలలో వాపు వస్తోందా ? తరచుగా మీరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా ? ఇది చాలా బాధ, నొప్పిని కలిగిస్తోందా ? ఒకవేళ మీ పాదాలలో వాపు సమస్యను తరచుగా ఫేస్ చేస్తున్నారంటే పాదాల వాపుకి కారణాలు తెలుకోవాలి.

Posted By:
Subscribe to Boldsky

మీ పాదాలలో వాపు వస్తోందా ? తరచుగా మీరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా ? ఇది చాలా బాధ, నొప్పిని కలిగిస్తోందా ? ఒకవేళ మీ పాదాలలో వాపు సమస్యను తరచుగా ఫేస్ చేస్తున్నారంటే.. ముందుగా.. పాదాల వాపుకి కారణాలు తెలుసుకోవాలి.

swollen feet

మనుషుల శరీరం రకరకాల వ్యాధులను కొన్ని హెచ్చరిక సంకేతాల ద్వారా మనల్సి అలర్ట్ చేస్తుంది. కొన్ని లక్షణాలు, సంకేతాలు.. కొన్ని వ్యాధులను సూచిస్తాయి. కాబట్టి.. ఏ చిన్న లక్షణాన్నానైనా నిర్లక్ష్యం చేయకూడదు.

మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే వీటిని గుర్తించడం వల్ల తర్వాత వచ్చే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలను అరికట్టవచ్చు. చాలా సందర్భాల్లో ఈ లక్షణాలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. దీనివల్ల వాటిని నిర్లక్ష్యం చేస్తాం.

వాపు అనేది ఒక బాడీ పార్ట్ లేదా అవయవం లేదా చర్మంలో వస్తుంది. పాదాల్లో వాపు వస్తే.. చాలా ఇబ్బందిగా, నొప్పితో కూడి ఉంటుంది. కొన్నిసందర్భాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంటే.. కదలడం కూడా కష్టంగా మారుతుంది. మరి పాదాల్లో వాపు రావడానికి కారణాలేంటో తెలుసుకోవడం చాలా అవసరం.

ఎక్కువగా కదలడం

పాదాల్లో వాపు రావడానికి చాలా ఎక్కువగా నడవడం, పాదాలపై ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం వల్ల పాదాల్లో వాపు వస్తుంది.

షూస్

చాలామంది దీన్ని మొదట్లో గుర్తించలేరు. కానీ.. తాము వేసుకున్న షూస్ సరైనవి కాకపోయినా.. నొప్పి, వాపు, అసౌకర్యం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి.. వాటిని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

బరువు పెరగడం

ఒకవ్యక్తి బరువు పెరిగినప్పుడు.. వాళ్ల పాదాలపై ఒత్తిడి పెరిగి.. శరీరం మొత్తం బరువుని భరించలేకపోతుంది. దీనివల్ల కూడా.. పాదాల్లో వాపు వస్తుంది.

ప్రెగ్నన్సీ

పాదాల్లో వాపు రావడానికి ప్రెగ్నన్సీ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. గర్భధారణ సమయంలో.. బరువు పెరుగుతారు, అలాగే హార్మోనల్ చేంజెస్ కూడా కనిపిస్తాయి. వీటన్నింటి కారణంగా.. పాదాల్లో వాపు వస్తుంది.

సర్క్యులేషన్ డిజార్డర్

పాదాల్లో వాపు రావడానికి సర్క్యులేషన్ డిజార్డర్ కూడా కారణం కావచ్చు. కొన్ని పాదాల్లో బ్లడ్ క్లాటింగ్ ఏర్పడి తర్వాత వాపులు కనిపిస్తాయి.

డయాబెటిస్

మెటబాలిక్ డిజార్డర్, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడేవాళ్లలో పాదాల వాపు కనిపిస్తుంది. వీళ్లకు సరైన క్రమంతో బ్లడ్ సర్క్యులేషన్ జరగక, ఫ్లూయిడ్స్ రిటెన్షన్ లేకపోవడం వల్ల పాదాల్లో వాపు వస్తుంది.

ఇన్ఫెక్షన్

పాదాల వాపు రావడానికి మరో కారణం.. ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా కారణమవుతుంది. పాదాలు, వేళ్ల మధ్య ఇన్ఫెక్షన్ కారణంగా పాదాల వాపు వస్తుంది.

 

 

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Are Your Feet Swollen? Here Are A Few Surprising Reasons Why

Are Your Feet Swollen? Here Are A Few Surprising Reasons Why. Listed below are some of the surprising causes of swollen feet that you should know about, so that you can take the necessary steps, read on!
Please Wait while comments are loading...
Subscribe Newsletter