అటెన్షన్ ! కీళ్లనొప్పులతో బాధపడేవాళ్లు తినకూడని ఆహారాలు..!

ఆర్థరైటిస్ పేషంట్స్ లో కనిపించే ముఖ్య లక్షణం.. తీవ్రమైన కీళ్ల నొప్పులు. అయితే కొన్ని రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈ నొప్పులు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలుంటాయి.

Posted By:
Subscribe to Boldsky

కీళ్ల నొప్పులు ఉన్నాయంటే.. ఏ పనిచేయలేక, ఎటు కదల్లేక తీవ్ర ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఆర్థరైటిస్ పేషంట్స్ లో కనిపించే ముఖ్య లక్షణం.. తీవ్రమైన కీళ్ల నొప్పులు. అయితే కొన్ని రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈ నొప్పులు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలుంటాయి.

arthritis

ఒకసారి మీకు కీళ్ల నొప్పులు ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాత.. ఆ వాపు, నొప్పి తగ్గించే అనేక మందులు ఉపయోగిస్తాయి. పెయిన్ కిల్లర్స్ ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తారు. పెయిన్ కిల్లర్స్ ఉపయోగించడం వల్ల.. కొంతసమయం నొప్పి నుంచి ఉపశమనం కలిగించినా.. సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉంటాయి.

కాబట్టి న్యాచురల్ రెమిడీస్ ద్వారా ట్రీట్మెంట్ అందించడం మంచిది. అలాగే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల కూడా.. కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఈ కాలంలో యువతరం కూడా.. కీళ్ల నొప్పుల సమస్యను ఫేస్ చేస్తోంది. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు ఖచ్చితంగా తీసుకోకూడని ఆహారాల లిస్ట్ చూద్దాం..

టమోటా

టమోటా విత్తనాల్లో ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉంటుంది. యూరిక్ యాసిడ్ జాయింట్స్ లో పేరుకున్నప్పుడు చాలా తీవ్రమైన కీళ్ల నొప్పులు వస్తాయి. కాబట్టి.. చాలా స్ట్రిక్ట్ గా వీటికి దూరంగా ఉండాలి.

ఉప్పు

ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల కీళ్ల వాపులు, తర్వాత తీవ్ర నొప్పులు వేధిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ తో బాధపడేవాళ్లలో ఈ సమస్య ఎక్కువవుతుంది. కాబట్టి.. ఉప్పు మోతాదుని తగ్గించుకోవాలి.

పాలు

పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల ప్రొటీన్స్ కీళ్ల నొప్పులను మరింత తీవ్రం చేస్తాయి. కాబట్టి.. ఆర్థరైటిస్ తో బాధపడేవాళ్లు పాలు తీసుకోకూడదు.

షెల్ ఫిష్

షెల్ ఫిష్ లో యూరిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి ఇది కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లకు హానికరం. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగితే.. కీళ్లలలో తీవ్రమైన వాపు, నొప్పికి కారణమవుతుంది.

పంచదార

ఎక్కువ మొత్తంలో పంచదార, పంచదార ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. దీనివల్ల జాయింట్స్ పై ఒత్తిడి పెరిగి నొప్పులు మరింత తీవ్రమవుతాయి.

కాఫీ

కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లకు కాఫీ మరింత దుష్ర్పభావం చూపుతుంది. ఇందులో ఉండే కెఫీన్ శరీరాన్ని డీహైడ్రేట్ చేసి.. నొప్పి మరింత పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి కాఫీకి దూరంగా ఉండటం మంచిది.

ఆల్కహాల్

ఆర్థరైటిస్ తో బాధపడేవాళ్లు ఆల్కహాల్ మరింత చెడు ప్రభావం చూపుతుంది. విషంతో సమానం. ఇది కీళ్ల చుట్టూ నొప్పులకు కారణమవుతుంది.

వంకాయ

వంకాయలో ఆల్కలాయిడ్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది కీళ్లలలో వాపుకి కారణమై.. నొప్పి మరింత తీవ్రమవడానికి కారణమవుతుంది. కాబట్టి ఆర్థరైటిస్ తో బాధపడేవాళ్లు వంకాయను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Attention! 8 Foods That Arthritis Patients Should Strictly Avoid

Attention! 8 Foods That Arthritis Patients Should Strictly Avoid. There are certain foods that arthritis patients should avoid. Check the article to know about the list of foods to be avoided.
Please Wait while comments are loading...
Subscribe Newsletter